E-Paper
Advertisement

U-19 World Cup Final: ఫైన‌ల్స్ లో ఇంగ్లాండ్ చిత్తు..6వ సారి ప్ర‌పంచ క‌ప్ గెలుచుకున్న టీమిండియా

U-19 World Cup Final: ఫైన‌ల్స్ లో ఇంగ్లాండ్ చిత్తు..6వ సారి ప్ర‌పంచ క‌ప్ గెలుచుకున్న టీమిండియా
Advertisement

U-19 World Cup Final:  ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా అండర్ 19 జట్టు, ఛాంపియన్ గా అవతరించింది. అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. హరారే లోని స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసి, టైటిల్ దక్కించుకుంది టీమిండియా. ఈ విజయంతో ఆరోసారి వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది ఇండియా.  ఈ మ్యాచ్ లో ఇండియా మొదట బ్యాటింగ్ చేసి, 411 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఇంగ్లాండ్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఛేజింగ్ లో 40.2 ఓవర్స్ లో 311 పరుగులకు ఆల్ అవుట్ అయింది ఇంగ్లాండ్. దీంతో వంద పరుగులు తేడాతో ఇండియా విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే ఆరవ సారి టైటిల్ గెల్చుకుంది.

Also Read: Trolls On Jemimah Rodrigues: 4వ సారి ఢిల్లీ ఓట‌మి..జెమిమాపై దారుణంగా ట్రోలింగ్…ఆ మ‌త‌మే కొంపముంచిందంటూ ?

6వ సారి ప్ర‌పంచ క‌ప్ గెలుచుకున్న టీమిండియా

Advertisement

ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ లో గెలిచిన టీమిండియా మ‌రోసారి ఛాంపియ‌న్ అయింది. ఈ త‌రుణంలోనే 6వ సారి వ‌ర‌ల్డ్ క‌ప్ టైటిల్ గెలుచుకుంది టీమిండియా. ఇప్ప‌టి వ‌ర‌కు అండ‌ర్ 19 ప్ర‌పంచ క‌ప్ లో 10 సార్లు ఫైన‌ల్స్ కు వెళ్లింది. ఈ త‌రుణంలోనే 6 సార్లు ఛాంపియ‌న్ గా నిలిచింది ఇండియా. 2000, 2008, 2012, 2018, 2022 సంవ‌త్సరాల‌లో టైటిల్ గెలిచిన అండర్ 19 టీమ్ ఇండియా, ఇప్పుడు మ‌రోసారి ఛాంపియ‌న్ అయింది.

 

175 పరుగులతో రెచ్చిపోయిన వైభవ్ సూర్య వంశీ

Advertisement

ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నేడు ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇండియా అలాగే ఇంగ్లాండ్ రెండు జట్లు కూడా ఈ మ్యాచ్ లో తలపడ్డాయి. అయితే ఇందులో టీం ఇండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలో 400 పరుగులు సాధించగలిగింది ఇండియా. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియా , 50 ఓవర్లు ఆడేసింది. ఈ తరుణంలో 9 వికెట్లు నష్టపోయిన అండర్ 19 టీం ఇండియా 411 పరుగుల భారీ టార్గెట్ ఇంగ్లాండ్ ముందు ఉంచింది. అయితే ఇండియా తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ మరోసారి తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించాడు వైభవ్ సూర్యవంశీ. ఇందులో 15 సిక్సర్లు అలాగే 15 బౌండరీలు ఉన్నాయి. 218. 75 స్ట్రైక్ రేట్ సాధించాడు. అటు టీమిండియా కెప్టెన్ ఆయుష్ మాత్రే 53 పరుగులతో రాణించాడు. దీంతో 50 ఓవర్లలో 400కు పైగా పరుగులు సాధించింది ఇండియా. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో తడబడ్డ ఇంగ్లాండ్ ఓడిపోయింది.

Also Read: Ambati Rayudu-Trump: ఇండియా, పాక్ మ్యాచ్ బాయ్ కాట్‌..రంగంలోకి ట్రంప్‌, అంబ‌టి ట్రోలింగ్ మాములుగా లేదుగా

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×