E-Paper
Advertisement

Revanth Reddy: కానిస్టేబుళ్ల కుటుంబాలకు రూ. కోటి సాయం.. ముఖ్యమంత్రి రేవంత్ చేతులమీదుగా..

Revanth Reddy: కానిస్టేబుళ్ల కుటుంబాలకు రూ. కోటి సాయం.. ముఖ్యమంత్రి రేవంత్ చేతులమీదుగా..
Advertisement

Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు, ఎక్సైజ్ కానిస్టేబుళ్ల కుటుంబాలకు అండగా నిలిచింది. ఇటీవల గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో వీరమరణం పొందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య, అలాగే గతేడాది అక్టోబర్‌లో దుండగుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబాలకు ప్రభుత్వం భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ ఇద్దరు కానిస్టేబుళ్ల కుటుంబాలకు తలో రూ. కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా అందజేశారు. నిజామాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభ వేదికగా ఆయా కుటుంబ సభ్యులకు ఈ చెక్కులను సీఎం అంద‌జేశారు.

నిజామాబాద్ జిల్లాలో జనవరి 23న అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకునేందుకు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సాహసోపేతంగా వ్యవహరించారు. ప్రాణాలకు తెగించి ఆ ముఠాను అడ్డుకునే ప్రయత్నం చేయగా, అక్రమ రవాణాదారులు ఆమెను వాహనంతో వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సౌమ్యను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. సౌమ్య చూపిన ధైర్యసాహసాలను ప్రభుత్వం గుర్తించి, ఆమె కుటుంబానికి తక్షణ ఆర్థిక భరోసాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది.

Advertisement

మరోవైపు, గతేడాది అక్టోబర్‌లో విధి నిర్వహణలో ఉండగా అసాంఘిక శక్తుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంది. నిందితులను పట్టుకునే క్రమంలో దుండగులు జరిపిన కత్తిపోట్ల వల్ల ఆయన మరణించారు. ప్రాణాలు పణంగా పెట్టి శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రయత్నించే సిబ్బందికి ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. దేశం కోసం, ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన ఈ వీర కానిస్టేబుళ్ల త్యాగం మరువలేనిదని, వారి కుటుంబాలకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read Also: CM Revanth Reddy: రేవంత్ గౌడ్.. రేవంత్ మాదిగ.. రేవంత్ ముదిరాజు.. కులగణనపై విమర్శలకు సీఎం మాస్ కౌంటర్!

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×