E-Paper
Advertisement

U19 WC Semi-final 2026: భారత్ – పాక్ మధ్య ఇవాళ కీలక మ్యాచ్..గెలిస్తే సెమీస్‌..టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలి

U19 WC Semi-final 2026: భారత్ – పాక్ మధ్య ఇవాళ కీలక మ్యాచ్..గెలిస్తే సెమీస్‌..టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలి

U19 WC Semi-final 2026: ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( ICC Under 19 World Cup 2026) చివరి దశకు వచ్చింది. జనవరి 15వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 6వ తేదీన ముగియనుంది. వన్డే ఫార్మాట్ లో జరుగుతున్న ఈ ప్రపంచకప్ లో ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. సెమీ ఫైనల్ రేసు కోసం పాకిస్తాన్ వర్సెస్ ఇండియా అండర్ 19 జట్ల ( India U19 vs Pakistan U19) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. బులవాయో వేదికగా ఈ రెండు దట్ల మధ్య ఫైట్ ఉండనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది.

Also Read: Kohli Deactivate Instagram: కోహ్లీ, అనుష్క మ‌ధ్య చిచ్చు పెట్టిన సెక్సీ లేడీ..అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​ మాయం !

పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైట్

అండర్ 19 పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఇవాళ సూపర్ సిక్స్ లో భాగంగా చిట్ట చివరి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా సెమీ ఫైనల్ కు దూసుకు వెళుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఎలాగైనా పాకిస్తాన్ ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని ఇండియా అండర్ 19 జట్టు స్కెచ్ వేస్తోంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిపోయింది ఇండియా. అయితే అప్పటి పగను ఇప్పుడు తీర్చుకోవాలని స్కెచ్ లు వేస్తోందట ఇండియా. ఇక ఈ మ్యాచ్ లు జియో హాట్‌ స్టార్ లో చూడొచ్చు. మ్యాచ్ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ప్రారంభం కానుంది.

ఇప్పటికే సెమీఫైనల్ కు దూసుకు వెళ్లిన 3 జట్లు

ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 20026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే మూడు జట్లు సెమీ ఫైనల్ కు క్వాలిఫై అయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దూసుకువెళ్లాయి. అయితే ఇవాళ ఇండియా గెలిస్తే ఆఫ్ఘనిస్తాన్ తో తొలి సెమీ ఫైనల్ ఆడనుంది. పాకిస్తాన్ గెలిస్తే ఆస్ట్రేలియాతో ఫైట్ ఉంటుంది. అందుకే ఎలాగైనా గెలిచి ఆఫ్ఘనిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు వెళ్లాలని ఇండియా సన్నద్ధమవుతోంద‌ట‌.

ఇండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ జ‌ట్లు

భారత్: ఆరోన్ జార్జ్, అభిజ్ఞాన్ కుందు, హర్వాన్ష్ పంగాలియా, వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, ఆయుష్ మ్హత్రే (కెప్టెన్‌), విహాన్ మల్హోత్రా, ఆర్ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, హెనిల్ పటేల్, మహమ్మద్ మోహన్, కిషన్, ఉదవ్.

పాకిస్థాన్: ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్‌), ఉస్మాన్ ఖాన్, అలీ హసన్ బలోచ్, హమ్జా జహూర్, హుజైఫా అహ్సాన్, మహ్మద్ షయాన్, సమీర్ మిన్హాస్, అహ్మద్ హుస్సేన్, అబ్దుల్ సుభాన్, అలీ రజా, డానియాల్ అలీ ఖాన్, మహ్మద్ సయామ్, మోమిన్ ఖమర్, నికాబ్ షఫీక్. పైన పేర్కొన్న జ‌ట్ల‌లో ఒక్కో జ‌ట్టు నుంచి కేవ‌లం 11 మంది మాత్ర‌మే ఆడ‌తారు.

Also Read:  Yuvraj Singh: యువ‌రాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోట‌ల్ లో చెప్పులు కూడా !

 

 

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×