E-Paper
Advertisement

Smartphone Comparison: వివో X200T vs ఐకూ 13 vs రియల్మీ GT 7 ప్రో.. రూ.60,000లో ఏది బెస్ట్?

Smartphone Comparison: వివో X200T vs ఐకూ 13 vs రియల్మీ GT 7 ప్రో.. రూ.60,000లో ఏది బెస్ట్?
Advertisement

Vivo X200T vs iQOO 13 vs Realme GT 7 Pro Smartphone Comparison| స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో ఇటీవల భారత్‌లో వివో X200T స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్‌కు పోటీగా మార్కెట్లో దాదాపు ఇదే ధరలో iQOO 13, రియల్మీ GT 7 ప్రో పోటీగా ఉన్నాయి. మూడు ఫోన్లు ప్రీమియం ఫ్లాగ్‌షిప్ కేటగిరీలో ఉన్నాయి. పెర్ఫామెన్స్, కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్‌పై దృష్టి పెట్టాయి. ఈ కేటగిరిలో ఏ ఫోన్ బెస్ట్ అని నిర్ణయించుకునేందుకు వాటి ఫీచర్లను పోల్చి చూద్దాం.

ధర, స్టోరేజ్ ఆప్షన్లు

వివో X200T 12GB + 256GB వేరియంట్ ప్రారంభ ధర రూ.59,999. 12GB + 512GB వేరియంట్ ధర రూ.69,999.
iQOO 13 12GB + 256GB వేరియంట్ రూ.54,999 నుంచి మొదలవుతుంది. 16GB + 512GB వేరియంట్ రూ.59,999.
రియల్మీ GT 7 ప్రో 12GB + 256GB వేరియంట్ రూ.59,999 నుంచి మొదలవుతుంది. 16GB + 512GB వేరియంట్ రూ.65,999.

డిస్‌ప్లే, రెజల్యూషన్

Advertisement

వివో X200Tలో 6.67 ఇంచ్ AMOLED డిస్‌ప్లే ఉంది. 1260×2800 రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. పీక్ బ్రైట్‌నెస్ 5000 నిట్స్ వరకు ఉంది.
iQOO 13లో 6.82 ఇంచ్ 2K AMOLED డిస్‌ప్లే ఉంది. 3168×1440 రెజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. పీక్ బ్రైట్‌నెస్ 4500 నిట్స్ వరకు ఉంది.
రియల్మీ GT 7 ప్రోలో 6.78 ఇంచ్ LTPO OLED ప్లస్ డిస్‌ప్లే ఉంది. 2780×1264 రెజల్యూషన్, 6000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్ పెర్ఫామెన్స్

వివో X200Tలో మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్ ఉంది.
iQOO 13, రియల్మీ GT 7 ప్రో రెండింటిలోనూ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంది.
మూడు చిప్‌సెట్లు ఫ్లాగ్‌షిప్ స్పీడ్, ఎఫిషియెన్సీ ఇస్తాయి. గేమర్లు, హెవీ యూజర్లకు స్మూత్ పెర్ఫామెన్స్ లభిస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్

Advertisement

వివో X200T ఆండ్రాయిడ్ 16తో ఒరిజిన్ ఓఎస్ 6లో వస్తుంది.
iQOO 13 ఆండ్రాయిడ్ 15తో ఫన్‌టచ్ ఓఎస్ 15లో వస్తుంది.
రియల్మీ GT 7 ప్రో ఆండ్రాయిడ్ 15తో రియల్మీ UI 6.0లో వస్తుంది.
మూడు ఫోన్లు మోడర్న్ ఫీచర్లు, కస్టమైజేషన్ ఇస్తాయి.

కెమెరా సెటప్

వివో X200Tలో మూడు 50MP రియర్ కెమెరాలు ఉన్నాయి. ప్రైమరీ, అల్ట్రా-వైడ్, టెలిఫోటో సెన్సార్లు ఉన్నాయి. ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉంది.
iQOO 13లో కూడా మూడు 50MP రియర్ కెమెరాలు ఉన్నాయి. ప్రైమరీ, అల్ట్రా-వైడ్, టెలిఫోటో లెన్స్‌లు ఉన్నాయి. ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉంది.
రియల్మీ GT 7 ప్రోలో 50MP ప్రైమరీ కెమెరా (OIS) ఉంది. 8MP అల్ట్రా-వైడ్, 120x హైబ్రిడ్ జూమ్ టెలిఫోటో ఉన్నాయి. ముందు 16MP సెల్ఫీ కెమెరా ఉంది.

సైజు, బరువు

వివో X200T బరువు 203 గ్రాములు. iQOO 13 బరువు 213 గ్రాములు. రియల్మీ GT 7 ప్రో బరువు 222.8 గ్రాములు. వివో సన్నగా, తేలికగా ఉంటుంది. రియల్మీ డిజైన్ పరంగా పెద్ద బిల్డ్‌తో ఉండడం వల్ల హెవీగా అనిపిస్తుంది.

Also Read: గూగుల్ పే, ఫోన్‌పే, యూజర్లకు గుడ్‌న్యూస్.. యుపిఐ పేమెంట్స్ ఫెయిల్ అయితే ఎక్స్‌ట్రా పైసలు.. ఏం చేయాలంటే

బ్యాటరీ, ఛార్జింగ్

వివో X200Tలో 6200mAh బ్యాటరీ ఉంది. 90W వైర్డ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
iQOO 13లో 6000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి.
రియల్మీ GT 7 ప్రోలో 5800mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి.

వివో X200T వైర్‌లెస్ ఛార్జింగ్, బ్యాలెన్స్‌డ్ ఫీచర్లు కావాలనుకునేవారికి బెస్ట్. iQOO 13 బెస్ట్ వాల్యూ, బలమైన పెర్ఫామెన్స్ ఇస్తుంది.
రియల్మీ GT 7 ప్రో కెమెరా జూమ్ ఇష్టపడేవారికి సరిపోతుంది. మీ అవసరాలు బట్టి సరైన ఫోన్ ఎంచుకోండి.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×