E-Paper
Advertisement

U19 World Cup 2026: నేడే ఆఫ్ఘ‌నిస్తాన్ తో రెండో సెమీ ఫైన‌ల్..మ్యాచ్ ర‌ద్దైతే, టీమిండియా లాభ‌మేనా ?

U19 World Cup 2026: నేడే ఆఫ్ఘ‌నిస్తాన్ తో రెండో సెమీ ఫైన‌ల్..మ్యాచ్ ర‌ద్దైతే, టీమిండియా లాభ‌మేనా ?
Advertisement

U19 World Cup 2026: ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కు ( ICC Under 19 World Cup 2026) కౌంట్ డౌన్ షురూ అయింది. గత నెలలో ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. నిన్ననే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ఫినిష్ కాగా ఇవాళ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొదటి సెమీ ఫైనల్ లో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. ఇక ఇవాళ రెండో సెమీ ఫైనల్ లో భాగంగా ఇండియా అండర్ 19 వర్సెస్ ఆఫ్గనిస్తాన్ అండర్ 19 జట్ల ( India U19 vs Afghanistan U19, 2nd Semi-Final) మధ్య ఫైట్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది.

Also Read: Kevin Pietersen-Mohsin Naqvi: పాకిస్తాన్ కు సిగ్గుందా ? మ‌రీ..ఫైన‌ల్స్ లో టీమిండియాతో ఆడాల్సి వ‌స్తే, ఏం పీకుతారు? రెచ్చిపోయిన‌ పీట‌ర్స‌న్

నేడే రెండవ సెమీ ఫైనల్.. తాడోపేడో తేల్చుకోనున్న ఇండియా

Advertisement

ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో భాగంగా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండో సెమీ ఫైనల్ జరగనుంది. ఈ రెండో సెమీ ఫైనల్ హరారే లోని స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ( Harare Sports Club, Harare ) నిర్వహిస్తున్నారు. మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ వేదికగా ఈ మ్యాచ్ ప్రసారాలు చూడవచ్చు. గత రికార్డులు పరిశీలిస్తే ఆఫ్ఘనిస్తాన్ పైన ఇండియాకు ఎక్కువగా ఎడ్జ్ ఉంది. ఇక ఈ మ్యాచ్ లో ఇండియా విజయం సాధిస్తే ఫైనల్ కు దూసుకు వెళ్తుంది. ఫిబ్రవరి 6వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్తో టీమిండి ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇండియా ఓడిపోతే ఆఫ్ఘనిస్తాన్ ఫైనల్ కు వెళ్తుంది.

మ్యాచ్ ర‌ద్దైతే, టీమిండియా లాభ‌మేనా ?

ఇవాళ జ‌రిగే రెండో సెమీస్ కు వ‌ర్షం విల‌న్ గా మారి, మ్యాచ్ ర‌ద్దు అయితే రిజర్వ్ డే ఉంది. రేపు ఆడే ఛాన్సు ఉంటుంది. అయినా మ్యాచ్ కొన‌సాగ‌క‌పోతే, పాయింట్ల ప్ర‌కారం టీమిండియా ఫైన‌ల్ కు వెళ్ల‌నుంది.

ఇండియా వ‌ర్సెస్ ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్లు

Advertisement

భారత U19 జట్టు: ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే(c), వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు(w), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, హెనిల్ పటేల్, హర్వాన్ష్ పంగాలియా, మొహమ్మద్ ఎనాన్, ఉదవ్ మోహన్, కిషన్ కుమార్ సింగ్

ఆఫ్ఘనిస్తాన్ U19 స్క్వాడ్: ఉస్మాన్ సదాత్, ఖలీద్ అహ్మద్జాయ్, ఫైసల్ షినోజాదా, ఉజైరుల్లా నియాజై, మహబూబ్ ఖాన్(w/c), అజీజుల్లా మియాఖిల్, అబ్దుల్ అజీజ్, రూహుల్లా అరబ్, నూరిస్తానీ ఒమర్జాయ్, వహిదుల్లా సద్రన్, అఖీల్ సద్రన్, అఖీల్ ఒమర్జాయి ఖాన్, జైతుల్లా షాహీన్

Also Read: Danish Kaneria: టీమిండియా అంటే నిద్ర‌లో కూడా ఉలిక్కిప‌డుతున్నారు..ఫైన‌ల్స్ ఆడాల్సి వ‌స్తే పారిపోతారా ?

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×