ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఫిబ్రవరి 4వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు పడకూడదు. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. దైవ చింతన పెరుగుతుంది.
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరులతో సఖ్యత కలుగుతుంది. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. దూర ప్రయాణాలలో ఊహించని మార్పులు కలుగుతాయి. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.
సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆశించిన పురోగతి కలుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ప్రేమ పెళ్లికి పెద్దల అంగీకారం.
స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విభేదాలు పెరుగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.
దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడి తప్పదు.
ఆర్థిక పరంగా ఆశించిన పురోగతి పెరుగుతుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
సన్నిహితుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. అవసరానికి ధన సహాయం అంది దీర్ఘకాలిక ఋణాలు కొంత వరకు తీర్చగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.
దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో అకారణ కలహా సూచనలు ఉన్నవి. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. కీలక వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.