E-Paper
Advertisement

Danish Kaneria: టీమిండియాను త‌ల‌చుకుని నిద్ర‌లో కూడా ఉలిక్కిప‌డుతున్నారు..ఫైన‌ల్స్ ఆడాల్సి వ‌స్తే పారిపోతారా ? పాక్ ను క‌డిగిపారేసిన క‌నేరియా

Danish Kaneria: టీమిండియాను త‌ల‌చుకుని నిద్ర‌లో కూడా ఉలిక్కిప‌డుతున్నారు..ఫైన‌ల్స్ ఆడాల్సి వ‌స్తే పారిపోతారా ? పాక్ ను క‌డిగిపారేసిన క‌నేరియా
Advertisement

Danish Kaneria:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 world Cup 2026 ) ఈ వారం చివరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7, శనివారం రోజున ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభం కానున్న టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ మార్చి 8వ తేదీ వరకు అంటే దాదాపు నెల రోజుల పాటు నిర్వహిస్తారు. ఇండియాతో పాటు శ్రీలంక వేదికగా ఈ టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ లు జరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇండియాతో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తూ సంచలన ప్రకటన చేసింది శత్రు దేశం పాకిస్తాన్. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ( Danish Kaneria ) స్పందించడం జరిగింది. ఉన్నఫలంగా ఇండియాతో జ‌రిగే మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తే, పాకిస్తాన్ ప్లేయ‌ర్లు భయపడ్డారనే సంకేతం బ‌య‌ట‌కు పోతుందని వ్యాఖ్యానించారు డానిష్ కనేరియా. దీంతో డానిష్ కనేరియా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Ind vs Pak Match-fixing: ఇండియాతో ఫిక్సింగ్ ? ఫోన్ లో చాటింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిని పాక్ కోచ్ స‌ర్ఫ‌రాజ్!

భయపడ్డారని సంకేతం పోతుంది.. Boycott పై పాక్ మాజీ క్రికెటర్ సంచలనం

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ముందుగా షెడ్యూల్ ప్రకటించిన దాని ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీన ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే నిన్నటి రోజున పాకిస్తాన్ కీలక ప్రకటన చేసింది. కొలంబో వేదికగా ఇండియాతో జరిగే మ్యాచ్ లో తమ జట్టు పాల్గొనడం లేదని వెల్లడించి, అందరికీ షాక్ ఇచ్చింది పాకిస్తాన్.

అయితే పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సొంత దేశపు మాజీ క్రికెటర్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. తాజాగా డానిష్ కనేరియా కూడా ఈ అంశంపై స్పందించారు. పాకిస్తాన్ జట్టుకు నిద్రలో కూడా ఇండియన్ భయంకరమైన బ్యాటింగ్ వణుకు పుడుతోంద‌ని సంచలన వ్యాఖ్యలు చేశారు డానిష్ కనేరియా. షెడ్యూల్ ఫైన‌ల్ అయిన‌ తర్వాత ఇప్పుడు బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటిస్తే… ఇండియా అంటే భయపడి పోయినట్లు బయటకు సంకేతం వెళ్తుందని చురకలు అంటించారు.

ఫైనల్ మ్యాచ్ కూడా ఇలా బహిష్కరిస్తారా ?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన మొదటి మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరించింది… ఇందులో ప్రాబ్లం లేదు.. మరి ఇండియాతో ఫైనల్ జరిగితే ? అప్పుడు ఏం చేస్తారు అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డును నిలదీశారు కనేరియా. ఫైనల్ మ్యాచ్ పడితే పారిపోతారా ? లేక నిలబడతారా ? అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. క్రికెట్ ద్వారా దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి… కానీ ఇండియాతో ఆడక పోవడం చాలా బాధాకరం అంటూ వ్యాఖ్యానించారు.

Also Read: T20 World Cup 2026: ఇండియా మ్యాచ్‌ను బాయ్ కాట్ చేసిన పాకిస్తాన్‌..PCBకి రూ.300 కోట్ల న‌ష్టం? మ‌నోళ్ల‌కు లాభ‌మే, వివరాలు ఇవే

 

Related News

VIRAT KOHLI : ఒక్క మ్యాచ్ ఓడినందుకే ఇంత కోపమా..? కోహ్లీ ఓవర్ త్రో పై దారుణంగా ట్రోలింగ్

Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండ‌గా రొమాన్స్‌..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైర‌ల్

రజత్ పాటిదార్ క్యాచ్ పై వివాదం…ధోని లాగానే అంపైర్ల‌తో గొడ‌వ‌ప‌డ్డ‌ కోహ్లీ

PSLలో మ‌రో అరాచ‌కం.. డ‌బ్బులు లేక ఆంటీల‌తో క్లీన్ చేయిస్తున్నారు, దొంగ‌ల్లా దూరేస్తున్నారు

అర్ష్‌దీప్‌ సింగ్ కు వెన్నుపోటు.. వైభ‌వ్ తో సమ్రీన్ కౌర్ సీక్రెట్ రిలేషన్, గిఫ్ట్ ఇచ్చి మ‌రీ ?

PSLలో మ‌రో దారుణం…స్టేడియంలో ఆఫ్ క‌రెంట్…ఒక్క‌సారిగా లైట్స్ ఆఫ్ !

గంగ‌లో క‌లిసిన పాకిస్తాన్‌ ప‌రువు..ఫిట్ నెస్ లేని ప్లేయ‌ర్ల కోస‌మే PSL అంటూ

Maxwell : ఇస్లాం మతంలోకి మారిన మాక్సిమామ…తెల్లటి లాల్చి ధరించి మరీ!

Big Stories

Advertisement
×