PSL 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన మినీ వేలం నిన్నటితో ముగిసింది. ఇందులో కొంత మంది ప్లేయర్లు భారీ ధర పలుకగా మరి కొంతమందికి తక్కువ రేటు వచ్చింది. ఇక చాలా మంది ప్లేయర్లు అన్ సోల్డ్ గా మిగిలిపోయారు. ఇక కొంత మంది మినీ వేలానికి రిజిస్టర్ కూడా చేసుకోలేదు. అయితే అన్ సోల్డ్ , ఐపీఎల్ మినీ వేలానికి రిజిస్టర్ చేసుకోని ప్లేయర్లందరికీ బంపర్ ఆఫర్ తగిలింది. ఈ ప్లేయర్లందరికీ పాకిస్తాన్ సూపర్ లీగ్ లో పాల్గొనే ఛాన్స్ ఉంది. జనవరిలో జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్ డ్రాఫ్ట్ లో పేరు నమోదు చేసుకుంటే, ఈ ప్లేయర్లను పాకిస్తాన్ దేశానికి చెందిన జట్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. అంటే పీఎస్ఎల్ 11 టోర్నమెంట్ లో ఆడే అవకాశం దక్కనుంది.
Also Read: Yashasvi Jaiswal: మ్యాచ్ ఆడుతుండగా కలకలం.. ఆసుపత్రిలో చేరిన జైస్వాల్.. అసలు ఏమైంది అంటే
ఐపీఎల్ 2026 మినీ వేలం అన్ సోల్డ్ ప్లేయర్లు, రిజిస్టర్ చేసుకోని ఇతర క్రికెటర్లు అందరికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్ ఇచ్చింది. జనవరి 8వ తేదీన జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన వేలంలో రిజిస్టర్ చేసుకోమని పేర్కొందట. అక్కడ అన్యాయం జరిగినా మా దగ్గర అన్యాయం జరుగుతుందని బంపర్ ఆఫర్ ఇచ్చిందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ సారి వేలం సమయంలో మరో రెండు కొత్త జట్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి రాబోతున్నాయట. ప్రస్తుతానికి అయితే 6 జట్లు ఉన్నాయి. వాటిని ఎనిమిదికి పెంచే ప్రయత్నం జరుగుతోంది. అంటే జనవరి 8వ తేదీన జరగబోయే పాకిస్తాన్ సూపర్ లీగ్ వేలం సమయంలో కొత్తగా రెండు జట్లు యాడ్ కానున్నాయి. అంటే అక్కడ చాలా మంది ప్లేయర్లు అవసరం ఉంటుంది. అందుకే ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయర్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్ ఇస్తోందట. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 మార్చి 26వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు కొనసాగనుంది.
బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మార్క్ వుడ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, డెవాన్ కాన్వే, గస్ అట్కిన్సన్, వియాన్ ముల్డర్, జానీ బెయిర్‌స్టో, జేమీ స్మిత్, జెరాల్డ్ కోట్జీ, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా & ఆదిల్ రషీద్.
– రహ్మనుల్లా గుర్బాజ్
– గెరాల్డ్ కోట్జీ
– స్పెన్సర్ జాన్సన్
– మహేష్ తీక్షణ
– ముజీబ్ ఉర్ రెహమాన్
– సీన్ అబాట్
– మైఖేల్ బ్రేస్‌వెల్
– డారిల్ మిచెల్
– టాస్కిన్ అహ్మద్
– రిచర్డ్ గ్లీసన్
– డాన్ లారెన్స్
– రిలే మెరెడిత్
– जये రిచర్డ్‌సన్
– ఫజల్ హక్ ఫరూకి
– టామ్ కుర్రాన్
– విలియం ఓ’రూర్కే
– నవీన్-ఉల్-హక్
– ఆష్టన్ అగర్
– టైమల్ మిల్స్
– తబ్రైజ్ షంసి
– విలియం సదర్లాండ్
Also Read: IPL Auction 2026: మినీ వేలం తర్వాత 10 జట్ల ప్లేయర్ల ఫుల్ లిస్ట్ ఇదే, అన్ సోల్డ్ ప్లేయర్లు వీళ్లే
🚨 Players who went unsold in the IPL and will be available for PSL 11
– Jake Fraser-McGurk
– Devon Conway
– Gus Atkinson
– Jonny Bairstow
– Jamie Smith
– Rahmanullah Gurbaz
– Gerald Coetzee
– Spencer Johnson
– Maheesh Theekshana
– Mujeeb Ur Rahman
– Sean… pic.twitter.com/4Gu0pAXu8R— junaiz (@dhillow_) December 16, 2025