BigTV English

Upasana : మెగాకోడలు ఉపాసనకి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యత.. ప్రశంసల వెల్లువ!

Upasana : మెగాకోడలు ఉపాసనకి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యత.. ప్రశంసల వెల్లువ!

Upasana: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కోడలిగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) కి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తనకు అప్పగించిన బాధ్యతలపై సంతోషం వ్యక్తం చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి మెగా కోడలు ఉపాసన ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే కాంగ్రెస్ సర్కార్ “స్పోర్ట్స్ పాలసీ – 2025” ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ ప్రభుత్వం తాజాగా “స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ”ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ సంస్థకు చైర్మన్ గా సంజీవ్ గోయెంకాను నియమించగా .. ఉపాసన కామినేనిని కో చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ సంస్థకు కో చైర్మన్గా ఉపాసన..

తెలంగాణ ప్రభుత్వం ఉపాసనకు స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ సంస్థకు కో చైర్మన్ గా బాధ్యతలు అప్పగించడం పై సంతోషం వ్యక్తం చేసింది ఉపాసన. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. “ఈ నియామకం నాకు మరింత గౌరవాన్ని ఇచ్చింది. నాకు సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేసే అవకాశం రావడం మరింత గౌరవంగా భావిస్తున్నాను” అంటూ ఉపాసన తెలియజేసింది.


స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ బోర్డు సభ్యులు..

ఇకపోతే ఈ స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ బోర్డు సభ్యులుగా సన్ టీవీ నెట్వర్క్, సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్, ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్, పుల్లల గోపీచంద్, భూటియా , అభినవ్ బింద్ర, రవికాంత్ రెడ్డి తదితరులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ లో తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా నిలపాలనే సంకల్పంతోనే ఈ క్రీడా విధానాన్ని తీసుకొచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో మంచి క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతోనే ఈ పాలసీని తీసుకొచ్చినట్లు కూడా ఆయన స్పష్టం చేశారు.

సంతోషంలో మెగా ఫ్యామిలీ..

ఇకపోతే ఉపాసనాకి ఈ పదవి అప్పగించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు మెగా కోడలు ఉపాసనాకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అటు వైద్యరంగంలోనే కాదు ఇటు వివిధ రంగాలలో కూడా మంచి అవగాహన కలిగిన ఉపాసనకు ఇలాంటి బాధ్యత అప్పగించడంతో అటు సీఎం రేవంత్ రెడ్డి పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికైతే మెగా కోడలికి ఇప్పుడు కీలక పదవి దక్కడంతో అటు మెగా కుటుంబ సభ్యులు, అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.

రామ్ చరణ్ కెరియర్..

ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డివంగా, సుకుమార్ డైరెక్షన్ లో సినిమాలు చేయనున్నారు.

 

ALSO READ: Hero Ajith: కెరియర్ పై అజిత్ ఎమోషనల్ కామెంట్స్.. ఒడిదుడుకులు, అవమానాలే అంటూ!

Related News

FOX Spotted: మ్యాచ్ మధ్యలో ఎంట్రీ ఇచ్చిన వింత జంతువు… ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

IND vs ENG: టీమిండియాలో మొత్తం గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లే…గిల్ విజయ రహస్యం ఇదేనా

Karishma Kotak : స్టేడియంలోనే బట్టలు మార్చుకున్న యాంకర్.. వీడియో చూస్తే!

Vindhya Vishaka : సిరాజ్ కెరీర్ మొత్తం కష్టాలే.. తండ్రి చనిపోయినా మ్యాచ్ ఆడాడు.. ఇప్పుడు రియల్ హీరో అయ్యాడు

Prasidh Krishna : వీడు మామూలోడు కాదు… చెప్పి మరి వికెట్ తీశాడు.. ఇంగ్లీష్ వాడి పరువు తీశాడు

Gautam Gambhir : డ్రెస్సింగ్ రూమ్ లో గౌతమ్ గంభీర్ చేసిన రచ్చ చూడండి

Big Stories

×