BigTV English

Hero Ajith: కెరియర్ పై అజిత్ ఎమోషనల్ కామెంట్స్.. ఒడిదుడుకులు, అవమానాలే అంటూ!

Hero Ajith: కెరియర్ పై అజిత్ ఎమోషనల్ కామెంట్స్.. ఒడిదుడుకులు, అవమానాలే అంటూ!

Hero Ajith:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు హీరో అజిత్ (Hero Ajith). నేచురల్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. మేకప్ కి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తారని సినీ ప్రియులు కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇటీవల సినీ ఇండస్ట్రీకి వచ్చి 33 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. కెరియర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, పడ్డ అవమానాలపై ఎమోషనల్ పోస్ట్ పెట్టారు అజిత్. ముఖ్యంగా తన జర్నీ అంత సులభంగా సాగలేదని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, అభిమానులకు రుణపడి ఉంటాను అంటూ ఒక సుదీర్ఘ నోట్ విడుదల చేశారు.


పడి లేచిన కెరటంలా ముందుకు వెళ్తున్నాను – అజిత్

అజిత్ తన నోట్ లో.. “సినిమా అనే ఒక కష్టమైన ఇండస్ట్రీలో నేను 33 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను మీతో పంచుకోవాలని ఉంది. గడిచిన ప్రతి సంవత్సరం కూడా నాకు ఒక మైలు రాయితో సమానం. భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్ల కోసం ఎదురు చూస్తున్నాను. మీరంతా చూపించే ప్రేమకు ఎలాంటి కృతజ్ఞత చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాలేదు. బయట వ్యక్తిగానే ఇండస్ట్రీలోకి వచ్చి, ఈ స్థాయికి చేరుకున్నాను. అలా నా ఇన్నేళ్ల ప్రయాణం ఎప్పుడూ అంత సులభంగా సాగలేదు జీవితంలో ఎన్నో మానసిక ఒత్తిడిలు, వైఫల్యాలు, ఎదురు దెబ్బలు నిరంతరం నన్ను పరీక్షించాయి. కానీ అభిమానుల అండ నన్ను ఎప్పుడూ ఆగిపోయేలా చేయలేదు. వాటిని ఎదుర్కొంటూనే ముందుకు సాగాను అన్నింటిని భరిస్తూ.. పడిలేచిన కెరటంలా మరింత ఉత్సాహంతో పని చేస్తున్నాను. పట్టుదలే నేను నమ్ముకున్న ఏకైక మార్గం.


అభిమానుల వల్లే ఈ స్థాయి – అజిత్

అటు సినిమాలలో కూడా ఎన్నో ఊహించని పరాజయాలను చవి చూశాను. ఇక ముందుకు సాగలేను అనుకున్న ప్రతిసారి కూడా అభిమానుల ప్రేమే నన్ను ప్రోత్సహించింది. నా దగ్గర ఏమీ లేనప్పుడు, వైఫల్యాలు వరుసగా ఎదురవుతున్నప్పుడు కూడా మీరంతా నా వెంటే నిలిచారు. ఇలాంటి విశ్వాసం లభించడం చాలా అరుదు. ఇలాంటి గొప్ప అభిమానులు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

మోటర్ రేసింగ్ లో కూడా భారీ సక్సెస్..

సినిమా ఇండస్ట్రీలోనే కాదు నేను ఇష్టపడ్డ మోటర్ రేసింగ్ లో కూడా ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి.. శారీరకంగా కూడా గాయాలయ్యాయి. అక్కడ కూడా నన్ను ఎదగనీయకుండా ఆపడానికి చాలామంది విశ్వప్రయత్నాలు చేశారు. అవమానించారు.. పరీక్షించారు. ముఖ్యంగా నేను పతకాలు సాధించే స్థాయికి ఎదిగాను. ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే ఏదైనా సాధ్యమవుతుందని నిరూపించారు అంటూ తెలిపారు.

నా భార్య వెన్నంటే నిలిచింది – అజిత్

నా భార్య షాలినే లేకపోతే ఏదీ కూడా సాధ్యం కాదు. ఎప్పుడూ నా వెంటే నిలిచింది. 33 ఏళ్లుగా మీరు నన్ను, నాలోని లోపాలను అంగీకరించారు. మీతో ఎప్పటికీ నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తాను. అటు మోటార్ రేసింగ్ లో కూడా మన దేశం గర్వపడేలా చేస్తానని మాట ఇస్తున్నాను అంటూ తెలిపారు. మొత్తానికి అయితే అజిత్ పంచుకున్న ఈ నోట్ ఇప్పుడు వైరల్ మారింది.

 

ALSO READ: Ustaad Bhagat Singh: పవన్ సినిమా సెట్‌‌లో గొడవ.. నిర్మాతల నిర్వాకంపై యూనియన్ మండిపాటు!

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×