Coolie Pre release: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఒకరు. ఈయన డైరెక్షన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే రజనీకాంత్(Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన కూలీ సినిమా(Coolie) కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేకవంతం చేశారు. తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ హీరోలు..
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శృతిహాసన్(Shruthi Hassan) సినిమా గురించి ఎన్నో విషయాలను మాట్లాడారు. అదే విధంగా యాంకర్ సుమ శృతిహాసన్ ను ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు శృతిహాసన్ తెలుగులో దాదాపు అందరు హీరోలతో కలిసి సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే మీకు తెలుగులో హీరోల(Tollywood Actors) నుంచి ఏదైనా దొంగతనం చేయాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ దొంగతనం చేస్తారనే ప్రశ్న వేశారు. మొదట పవన్ కళ్యాణ్ పేరు చెప్పడంతో పవన్ కళ్యాణ్ గారి నుంచి నేనేమీ దొంగలించలేను అంటూ ఈమె సమాధానం చెప్పారు.
బన్నీ నుంచి డాన్స్ దొంగలిస్తా..
ఇక వెంటనే ప్రభాస్ పేరు చెప్పడంతో ప్రభాస్ ఫుడ్ దొంగతనం చేస్తానని అలాంటి టేస్టీ ఫుడ్ ప్రిపేర్ చేసే ఆయన కుక్ ను దొంగలిస్తాను అంటూ సమాధానం చెప్పారు. అల్లు అర్జున్ నుంచి ఆయన డాన్స్ తీసుకుంటాను, మహేష్ బాబు నుంచి ఆయన స్టైల్, బాలకృష్ణ గారి నుంచి ఆయన హ్యూమర్, రజనీకాంత్ గారి పేరు చెప్పడంతో రజనీకాంత్ గారి నుంచి ప్రతి ఒక్క క్వాలిటీని దొంగతనం చేయాలనిపిస్తుంది అంటూ సమాధానం చెప్పారు. ఇక ఈమె తండ్రి కమల్ హాసన్ గారి గురించి ప్రశ్న రావడంతో ఆయన నుంచి నేను అన్ని నేర్చుకున్నాను అని సమాధానం చెప్పారు. ఇంకా ఏదైనా నేర్చుకోలేకపోయాను అనే భావన మీలో ఉంటుంది కదా అంటూ సుమ ప్రశ్నించడంతో నాన్న హార్డ్ వర్క్ దొంగలించాలి అంటూ సమాధానం ఇచ్చారు.
విలన్ పాత్రలో నాగార్జున…
ఇక అక్కడే ఉన్న నాగార్జున గారి పేరు చెప్పడంతో నాగార్జున గురించి శృతిహాసన్… నాకు సర్ డైట్, ఫిట్నెస్, ఎనర్జీ, చరిష్మా అన్ని లక్షణాలను దొంగలిస్తాను అంటూ ఈ సందర్భంగా శృతిహాసన్ సమాధానం చెప్పారు. ఇక ఈమె దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ ప్రీతి అనే పాత్రలో నటుడు సత్యరాజ్ కుమార్తెగా కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మొదటిసారి నాగార్జున విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఆగస్టు 14న రాబోతున్న ఈ సినిమా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: Coolie pre Release: మోనికా సాంగ్ కు స్టేజ్ పైనే డాన్స్ ఇరగదీసిన సత్యరాజ్..