KKR – Usman Tariq Controversy: కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Caribbean Premier League 2026) వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 7వ తేదీ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ పైన (shahrukh khan) దారుణంగా విమర్శలు వస్తున్నాయి. దేశద్రోహి అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. మొన్నటి వరకు కావ్య పాపను దారుణంగా ట్రోల్ చేశారు. అబ్రార్ అహ్మద్ విషయంలో ఆమెను ఆడుకున్నారు. ఇక కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ను ( Usman Tariq ) షారుఖ్ ఖాన్ టీమ్ రిటైన్ చేసుకుంది. ఈ క్రమంలోనే, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు కో ఓనర్ గా ఉన్న షారుఖ్ ఖాన్ ను దేశద్రోహి అంటూ రెచ్చిపోయి పోస్టులు పెడుతున్నారు.
Also Read: ఆ పాకిస్తాన్ వెధవను వద్దని మొత్తుకున్నా, కావ్యనే వినలేదు.. SRH కోచ్ సీరియస్
కరేబియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (Caribbean Premier League 2026) నేపథ్యంలో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు ( Trinbago Knight Riders ) బరిలోకి దిగుతోంది. దీనికి కేకేఆర్ జట్టును లీడ్ చేసిన వాళ్లే… ఓనర్లుగా కొనసాగుతున్నారు. అంటే ఇందులో షారుఖ్ ఖాన్ కూడా ఉన్నాడు. ఈ కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో… పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ను మరోసారి రిటైన్ చేసుకుంది కేకేఆర్ టీం. అతని స్థానంలో భర్తీ చేసేందుకు మరో ఆప్షన్ జట్టుకు కనిపించలేదు. గత సీజన్ లో కూడా ఉస్మాన్ తారిక్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. పది మ్యాచ్ లు ఆడిన ఉస్మాన్ తారిక్, ఏకంగా 20 వికెట్లు పడగొట్టాడు.
ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టులోనే ( Trinbago Knight Riders ) అత్యధిక వికెట్లు తీసిన మొనగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలోనే అతడిని వదులుకోలేక… అంటిపెట్టుకుంది కేకేఆర్. అయితే ఈ విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ ను ఉద్దేశించి దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ వాడిని ఎందుకు రిటైన్ చేసుకున్నారు ? అని ఫైర్ అవుతున్నారు. వెంటనే వాడిని వదిలించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ 2026 (IPL 2026 ) సమయంలో ముస్తాఫిజుర్ రహమాన్ విషయంలో కేకేఆర్ జట్టు (KR).. కూడా చాలా కఠినంగా వ్యవహరించింది. ఇండియా లాగే బంగ్లాదేశ్ మధ్య వివాదం రాజుకున్న నేపథ్యంలో ముస్తాఫిజుర్ రహమాన్ పై బ్యాన్ విధించింది. ఇప్పుడు కూడా అలాగే పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ పై బ్యాన్ వేయాలంటూ షారుక్ ఖాన్ పైన ఒత్తిడి తీసుకువస్తున్నారు.
Also Read: 6, 6, 6, 6 వైభవ్ సిక్సుల వర్షం..A సింబల్ చూపిస్తూ సెలబ్రేషన్స్, టీమిండియా విజయం