Vaibhav Sooryavanshi signing an A Letter: టీమిండియా వర్సెస్ జింబాబ్వే (Zimbabwe vs India) మధ్య ఇవాళ టి20 సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. హరారే లోని స్పోర్ట్స్ క్లబ్ వేదికగా (Harare Sports Club, Harare) జరిగిన తొలి మ్యాచ్ లోనే టీమిండియా బంపర్ భారీ నమోదు చేసుకుంది. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi ) ఎట్టకేలకు ఈ మ్యాచ్ లో రాణించాడు. కేవలం 18 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అతి పిన్న వయసులోనే అర్థ సెంచరీ చేసిన వీరుడిగా రికార్డు సృష్టించాడు. అయితే ఈ అర్థ సెంచరీ నమోదు చేసిన తర్వాత తన చేతి వేళ్లతో A అనే సింబల్ చూపిస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
జింబాబ్వే తో జరిగిన తొలి టీ20 సందర్భంగా 19 బంతుల్లో మొత్తం 50 పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు నాలుగు బౌండరీలు ఉండడం గమనార్హం. దాదాపు 300 స్ట్రైక్ రేట్ తో ఊచకోత కోశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో తొలిసారి అర్థ సెంచరీ నమోదు చేసుకున్న క్రమంలో A సింబల్ తన చేతి వేళ్లతో చూపిస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు వైభవ్. తన తల్లి ఆర్తి సూర్యవంశీ (Aarti Sooryavanshi) పేరు A లెటర్ తో మొదలవుతుంది.
ఈ క్రమంలోనే తన అర్థ సెంచరీని తల్లికి అంకితం చేస్తున్నట్లు ఈ A సింబల్ ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన ఫోటో అలాగే వీడియో వైరల్ గా మారింది. ఈ సన్నివేశం చూసిన క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ గడ్డపై విఫలమైన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వే పై రాణించడం మంచి పరిణామం అంటున్నారు. ఇదే ఊపును ఇలాగే కొనసాగించాలని కోరుతున్నారు.
టీమిండియా వర్సెస్ జింబాబ్వే (Zimbabwe vs India) మధ్య హరారే వేదికగా ఇవాళ మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో మొదట జింబాబ్వే బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 20 ఓవర్లు ఆడిన జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని కేవలం 13 ఓవర్లలోనే మూడు వికెట్ల నష్టానికి చేదించింది టీమిండియా. దీంతో 7 వికెట్ల తేడాతో బంపర్ విజయాన్ని నమోదు చేసుకుని శ్రేయస్ అయ్యర్ సేన. ఈ విజయంతో శ్రేయస్ అయ్యర్ ఖాతాలో తొలి విక్టరీ నమోదయింది. దాదాపు 7 మ్యాచ్ ల తర్వాత తన కెప్టెన్సీలో టీమిండియా మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది.