E-Paper
Advertisement

ఆ పాకిస్తాన్ వెధ‌వ‌ను వ‌ద్ద‌ని మొత్తుకున్నా, కావ్య‌నే విన‌లేదు.. SRH కోచ్ సీరియ‌స్‌

ఆ పాకిస్తాన్ వెధ‌వ‌ను వ‌ద్ద‌ని మొత్తుకున్నా, కావ్య‌నే విన‌లేదు.. SRH కోచ్ సీరియ‌స్‌
Advertisement

Sunrisers head coach Daniel Vettori on buying Abrar Ahmed:  ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ (The Hundred Men’s Competition 2026) ప్రారంభమైన నేపథ్యంలో కావ్య పాపపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. కావ్య పాప దేశ ద్రోహి అంటూ ముద్ర వేస్తున్నారు. ఈ టోర్నమెంట్ వేలం సందర్భంగా పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ కొనుగోలు చేసినప్పుడు జరిగిన ట్రోలింగే ఇప్పుడు మళ్ళీ షురూ అయింది. ఇక ది 100 లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైన నేపథ్యంలో కావ్య పాప జట్టు తరఫున అబ్రార్ అహ్మద్ ఇప్పటికే తొలి మ్యాచ్ ఆడాడు.

దీంతో మళ్లీ కావ్యను ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే దీనిపై సన్ రైజర్స్ లీడ్స్ జట్టు  (Sunrisers Leeds) హెడ్ కోచ్ డేనియెల్ వెట్టోరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పాకిస్తాన్ వెధవ అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేయకూడదని తాను మొత్తుకున్నానని బాంబు పేల్చారు. తాను ఎంత చెప్పినా వినకుండా కావ్య పాప ( Kavya Maran) మొండి చేసిందని షాకింగ్ నిజాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ ను కొనుగోలు చేయాల్సి వచ్చిందన్నారు. దీంతో డేనియెల్ వెట్టోరీ ( Daniel Vettori) చేసిన వ్యాఖ్యలు దుమారం వేపుతున్నాయి.

Advertisement

Also Read: Sikandar Raza Warns Team India: మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

ఆ పాకిస్తాన్ వెధ‌వ‌ను వ‌ద్ద‌ని మొత్తుకున్నా, కావ్య‌నే విన‌లేదు

ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ (The Hundred Men’s Competition 2026) వేలంలో పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను సన్ రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంపై ఆ జట్టు హెడ్ కోచ్ డేనియెల్ వెట్టోరీ క్లారిటీ ఇచ్చారు. వేలం సమయంలో ఇంగ్లాండ్ ఆటగాడు ఆదిల్ రషీద్ ను ( Adil Rashid) కొనుగోలు చేయాలని ప్లాన్ వేసుకున్నట్లు వివరించారు. అయితే అతడు అందుబాటులో ఉండబోడని వార్త తమకు తెలిసిందని.. ఈ క్రమంలో విదేశీ క్రికెటర్ ను తీసుకోవాలని ప్రయత్నం మొదలుపెట్టినట్లు వివరించారు.

Advertisement

ఈ క్రమంలో మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప ( Kavya Maran) ప్రతిపాదించారని వెల్లడించారు. కానీ తనకు మాత్రం అతడిని కొనుగోలు చేయడం ఏమాత్రం ఇష్టం లేదని వెల్లడించారు. మరో గతిలేక అతన్ని కొనుగోలు చేసాం తప్ప.. ఇంకేం లేదని వివరించారు. అయితే ఆ పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసిన నేపథ్యంలో కావ్య పాప పైన దేశద్రోహి ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జట్టు అవసరాల కోసం అబ్రార్ అహ్మ‌ద్ ను తీసుకున్నాం తప్ప… ఇండియాకు అన్యాయం చేసే పరిస్థితులను తాము తీసుకురాబోమని వెల్లడించారు సన్ రైజర్స్ లీడ్స్ జట్టు హెడ్ కోచ్ డేనియెల్ వెట్టోరీ.

Also Read: MI London vs Sunrisers Leeds, 1st Match: కావ్య పాప‌కు బిగ్ షాక్‌…స‌న్ రైజ‌ర్స్ మ్యాచ్ లు చూడకుండా కుట్ర‌లు !

Related News

మ‌ళ్లీ ఐపీఎల్ పిల్ల బ‌చ్చాల‌తోనే ఆడుతున్నారు..జింబాబ్వేతోనూ ఓట‌మి ఖాయం

టీమిండియా క్రికెట‌ర్లు కాకుండా, వాళ్ల భార్య‌లే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు ?

Kavya Maran: నా డ‌బ్బు, నా ఇష్టం..ఎవ‌రినైనా కొనేస్తా?

మ‌ళ్లీ తెర‌పైకి షేక్ హ్యాండ్ వివాదం…మా కాళ్ల ద‌గ్గ‌ర‌కు బీసీసీఐ వ‌చ్చిందంటూ ఓవరాక్ష‌న్

గొడ‌వ‌లు మ‌ర్చిపోయి, మాతో టెస్ట్ సిరీస్ ఆడండి..బీసీసీఐని కోరిన న‌ఖ్వీ

పాకిస్తాన్ క్రికెట్ లో వాస్తు దోషం..PCB ఆఫీస్ మార్చాలంటూ ఆదేశాలు

పొద్దున లేస్తే.. రాముడిని, మోదీని తిడ‌తారా? ఇవేం దిక్కుమాలిన నిర‌స‌న‌లు !

Big Stories

Advertisement
×