BigTV English
Advertisement

Rishabh Pant: పాపం…RCBలోకి రాకుండా పంత్‌ పై కోహ్లీ కుట్రలు..?

Rishabh Pant: పాపం…RCBలోకి రాకుండా పంత్‌ పై కోహ్లీ కుట్రలు..?

Virat Kohli Does not Want Rishabh Pant In RCB Due To Politics: ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటివారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. వేలం తేదీ, రిటెన్షన్ నిబంధనలు ఇంకా ఫిక్స్ కాలేదు. కొందరు ప్లేయర్లు మాత్రం ఫ్రాంచైజీలు మారుతున్నట్లు జోరుగానే చర్చలు జరుగుతున్నాయి. రోజు రోజుకి ఐపీఎల్ వేలానికి సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలోనూ విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. వీటిలో ఏది నిజమో ఏది అబద్దమో అస్సలు తెలియడం లేదు. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి రిషబ్ పంత్ వెళుతున్నాడంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.


రిషబ్ పంత్ తన మేనేజర్ ద్వారా ఆర్సిబి మేనేజ్మెంట్ ను సంప్రదించాడని చెప్పాడు. వచ్చే సీజన్ లో ఆర్సిబి కెప్టెన్ గా పంత్ వ్యవహరించాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే పంత్ ప్రతిపాదనలను ఆర్సిబి మేనేజ్మెంట్ తిరస్కరించినట్లు చెప్పాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరులోకి రిషబ్ పంత్ రావడం విరాట్ కోహ్లీకి అసలు ఇష్టం లేదని ఓ అభిమాని రాసుకోచ్చాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. దీనిపై రిషబ్ పంత్ స్వయంగా స్పందించాడు. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోండి. ఇలాంటి ఫేక్ న్యూస్ లు, ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలు సృష్టించవద్దంటూ చెప్పాడు. చాలా రోజుల నుంచి ఇలాంటి ఎన్నో కథనాలు జరుగుతున్నాయి.

ఇంతకాలం వీటన్నింటినీ నేను పట్టించుకోలేదు. కానీ ఈ వార్తపై నేను ఇప్పుడు స్పందించాల్సి వచ్చింది. సరైన సమాచారం లేకుండా ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టకండి. ఆధారాలు ఉంటేనే పోస్టులు చేయండి అని చెప్పుకొచ్చాడు. 2016 నుంచి పంత్ ఢిల్లీ జట్టుతోనే ప్రయాణం చేస్తున్నాడు. కెప్టెన్ గానూ వ్యవహరిస్తున్నాడు. మొన్నటి వరకు పంత్ ఈసారి ఫ్రాంఛైజీ మారడం ఖాయం అంటూ కథనాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి రిషబ్ వెళ్తున్నాడంటూ ప్రచారాలు జరిగాయి. ధోని రిటైర్ అయితే ఆ స్థానాన్ని పంత్ భర్తీ చేస్తాడనే కొంతమంది ఎక్స్పర్ట్స్ అనుకున్నారు. రిషబ్ పంత్ డేంజరస్ ప్లేయర్. ఎలాంటి ప్రత్యర్థితో అయినా చెలరేగి ఆడగలడు. ప్రస్తుతం పంత్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇతనికి భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. టీమ్ ఇండియాకు ఫ్యూచర్ కెప్టెన్ గాను పంత్ సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి.


Also Read: Yuvraj Singh: ఆ హీరోయిన్‌ ను వాడుకుని వదిలేశాడు..ఆస్ట్రేలియాలో అర్థరాత్రుల్లు కూడా ?

అందుకే ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ ను వదులుకోదంటూ వార్తలు వస్తున్నాయి. కచ్చితంగా యంగ్ వికెట్ కీపర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకుంటుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక 2022 డిసెంబర్ నెలలో ఘోరమైన కారు ప్రమాదం జరగడంతో కొన్ని రోజులపాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ఎన్నో శస్త్ర చికిత్సల అనంతరం వేగంగా కోలుకొని మళ్ళీ గ్రౌండ్ లోకి దిగాడు. గత ఐపీఎల్ సీజన్ తో తనలో పవర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ లోను తన అద్భుతమైన ఆట తీరుతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. తన అగ్రెసివ్ క్రికెట్ తో కట్టిపడేశాడు. శ్రీలంక టూర్ తో వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు. తొలి టెస్ట్ లో అద్భుతమైన సెంచరీ సాధించాడు.

Related News

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్‌, వేదిక‌లు ఖ‌రారు..ఇండియాకు రాబోమంటున్న‌ పాకిస్తాన్ ?

Quinton de Kock : రిటైర్మెంట్ వెన‌క్కి తీసుకుని, రీ-ఎంట్రీ ఇచ్చాడు…సెంచ‌రీతో పాకిస్తాన్ ను చిత్తు చేశాడు

Hong Kong Sixes 2025: నేడు టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య 6 ఓవ‌ర్ల మ్యాచ్‌…షెడ్యూల్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

Big Stories

×