BigTV English

Namrata shirodkar: ఏంటీ.. మహేష్ కంటే ముందు నమ్రత ఇంకొకరిని ప్రేమించిందా.. అతని పరిస్థితి తెలిస్తే కన్నీళ్లాగవ్..!

Namrata shirodkar: ఏంటీ.. మహేష్ కంటే ముందు నమ్రత ఇంకొకరిని ప్రేమించిందా.. అతని పరిస్థితి తెలిస్తే కన్నీళ్లాగవ్..!

Namrata Shirodkar.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆదర్శ దంపతులుగా గుర్తింపు తెచ్చుకున్న జంటలలో మహేష్ బాబు (Mahesh Babu)- నమ్రత శిరోద్కర్(Namrata shirodkar)జంట కూడా ఒకటి. వైవాహిక బంధంలో ఒడిదుడుకులు లేకుండా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ జంట , ఇప్పటికీ కూడా కలిసిమెలిసి ఉంటూ పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ.. మరొకవైపు సంపదను సృష్టిస్తూ బిజీగా గడిపేస్తున్నారు. అలాంటి ఈ జంట గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేంటంటే మహేష్ బాబు సతీమణి ప్రముఖ హీరోయిన్ నమ్రతా శిరోద్కర్.. మహేష్ బాబును ప్రేమించడం కంటే ముందే ఒక అబ్బాయి తో దాదాపు 10 ఏళ్ల పాటు రిలేషన్ లో ఉన్నారట. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట.. కట్ చేస్తే సూపర్ స్టార్ మహేష్ బాబుకు భార్య అయింది నమ్రత. అసలు ఏం జరిగింది ? ఆమె ప్రేమించిన వ్యక్తి ఏమైపోయారు ? ఎందుకు వీరిద్దరూ విడిపోయారు ? ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటి..?అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.


దీపక్ శెట్టితో నమ్రత ప్రేమాయణం..

అసలు విషయంలోకి వెళ్తే.. నమ్రత శిరోద్కర్.. హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేదు కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యగా మంచి స్టార్డం ను సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ ను ప్రేమించి పెళ్లాడిన నమ్రత, అంతకుముందే ఇంకొక వ్యక్తిని ప్రేమించింది. ఆయన ఎవరో కాదు ఒక రెస్టారెంట్ కు ఓనర్ అయిన దీపక్ శెట్టి (Deepak shetty)తో ప్రేమలో పడిందట. పెళ్లి కూడా చేసుకోవాలని ఇద్దరూ ఫిక్స్ అయ్యారు. అయితే అతడు అకాల మరణం చెందడంతో వీరి బంధానికి కాస్త బ్రేక్ పడింది.


ఒకే ఏడాది నమ్రత తల్లి, బాయ్ ఫ్రెండ్ అకాల మరణం..

1990లో రెడిఫ్ AMA లో ఒక అభిమాని నమ్రతా తో ..దీపక్ ను పెళ్లి చేసుకుంటారా అని అడిగితే, ఆమె కూడా అవునని చెప్పిందట. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాము . త్వరలోనే వివాహం చేసుకుంటామని కూడా చెప్పిందట. అయితే ఏమైందో తెలియదు కానీ సడన్ గా వీరిద్దరూ విడిపోయారు. అలా విడిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకు దీపక్ గోవాలో ఒక చిన్న బాబును కాపాడడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అదే ఏడాది నమ్రత తల్లి కూడా క్యాన్సర్ తో పోరాడుతూ మరణించిందట. ఆ సమయంలో అటు జీవితం పంచుకోవాల్సిన వ్యక్తి, ఇటు జన్మనిచ్చిన తల్లి ఇద్దరు ఒకే ఏడాది మరణించేసరికి ఆ బాధ నుంచి బయటపడలేక పోయిందట నమ్రత.

మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకున్న నమ్రత..

అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ బాధ నుంచి తేరుకొని.. హీరోయిన్ గా అవకాశాలు అందుకుని , నటించే సమయంలో తెలుగులో వంశీ అనే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. అదే సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించారు. అలా ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారి, చివరకు పెద్దలను కాదని ముంబైలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ వీరు పెళ్లికి అంగీకరించలేదు. కానీ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని సహాయంతో మళ్ళీ వీరి పెళ్లి ఘనంగా జరిగిందని సమాచారం. ప్రస్తుతం భర్త ఆలనా పాలన, బిజినెస్, సినిమా ఇలా మహేష్ బాబు వేసుకునే దుస్తులను మొదలుకొని చేసే సినిమా వరకు అన్నింటిలో కూడా నమ్రత భాగమవుతుందని సమాచారం. మహేష్ బాబుకు వెన్నెముకలా నిలుస్తూ ఉత్తమ భార్యగా పిలిపించుకుంటోంది నమ్రత.

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×