Virender Sehwag: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ( Indian Premier League 2026 Tournament) పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్న ఈ టోర్నమెంట్ కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ డేంజర్ ఆటగాడు బాబర్ ఆజం ( babar azam ) సెంచరీ నమోదు చేశాడు. కేవలం 52 బంతుల్లో సెంచరీ చేసి ఇరగదీశాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, ఆరు బౌండరీలు ఉన్నాయి. పెషావర్ జల్మీ వర్సెస్ క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య ఇవాళ మ్యాచ్ జరగగా… బాబర్ ఆజం సెంచరీ నమోదు చేశాడు.
Also Read: Tanveer Ahemed: గిల్ బ్యాట్లలో రబ్బర్లు…అందుకే అవలీలగా సిక్సులు, బౌండరీలు కొడుతున్నాడు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా పెషావర్ జల్మీ వర్సెస్ క్వెట్టా గ్లాడియేటర్స్ ( Peshawar Zalmi vs Quetta Gladiators) మధ్య 29వ మ్యాచ్ జరుగుతుంది. కరాచీ లోని నేషనల్ క్రికెట్ స్టేడియం ( National Stadium, Karachi) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ సందర్భంగా పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజం అదిరిపోయే సెంచరీ నమోదు చేశాడు. అయితే బాబర్ ఆజం సెంచరీ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో అతనికి సపోర్ట్ గా నిలుస్తూ పాకిస్తాన్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇంత వరకు ఎవరు కూడా ఈ రేంజ్ లో సెంచరీ చేయలేదన్న తరహాలోనే పాకిస్తాన్ అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు.
అయితే పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజం సెంచరీ చేసిన నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ తన స్టైల్లో స్పందించాడు. బాబర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని చెబుతూనే అతని పరువు తీసే ప్రయత్నం చేశాడు. బాబర్ ఆజం అదిరిపోయే బ్యాటింగ్ చేశాడని వెల్లడించాడు. చాలా రోజుల తర్వాత బాబర్ ఆజం సెంచరీ చేయడం హర్షించ దగ్గ విషయమని స్పష్టం చేశారు. ఇదే ఊపు కొనసాగితే పాకిస్తాన్ కెప్టెన్ గా మళ్ళీ అతనికి అవకాశం వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు వీరేంద్ర సెహ్వాగ్ జోష్యం చెప్పారు. ఈ సీజన్ లో టాప్ స్కోరర్ గా బాబర్ ఆజం నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు.
అయితే ఇలాంటి సెంచరీలు ఇండియాలో పాలు తాగే బుడ్డోడు కూడా అవలీలగా కొడతాడని.. దీనికి ఇంత హైప్ అవసరం లేదని చురకలు అంటించారు. బాబర్ ఒక్క సెంచరీ చేస్తే ఇంత ఓవరాక్షన్ ఎందుకు? అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు వీరేంద్ర సెహ్వాగ్. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో పెషావర్ జల్మీ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లు ఆడింది. ఈ సందర్భంగా మూడు వికెట్ల నష్టానికి 255 పరుగులు సాధించింది. బాబర్ సెంచరీ చేయగా కుషాల్ మెండిస్ 83 పరుగులతో రాణించారు. ఈ లక్ష్యాన్ని చేదించలేక చిత్తుగా ఓడిపోయింది క్వెట్టా గ్లాడియేటర్స్.
https://www.facebook.com/photo/?fbid=982591854681557&set=a.808612632079481