E-Paper
Advertisement

Virender Sehwag: షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో ప్ర‌తి ఓవ‌ర్ కు వైభ‌వ్ 3 సిక్స‌ర్లు కొడ‌తాడు

Virender Sehwag: షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో ప్ర‌తి ఓవ‌ర్ కు వైభ‌వ్ 3 సిక్స‌ర్లు కొడ‌తాడు
Advertisement

Virender Sehwag:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. జ‌స్ప్రీత్ బుమ్రా నుంచి మొదలుకొని భువనేశ్వర్ కుమార్ అందరినీ ఒక ఆట ఆడుకుంటున్నాడు వైభవ్. ప్రతి మ్యాచ్ లో కూడా సిక్సర్లు, బౌండరీలతో రెచ్చిపోతున్నాడు ఈ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య‌వంశీ. అయితే అలాంటి వైభవ్ సూర్యవంశీపై తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుమ్రా లాంటి నెంబర్ వన్ ఆటగాన్ని చెడుగుడు ఆడుకున్న వైభవ్ ( Vaibhav Suryavanshi), పాకిస్తాన్ బౌలర్ షాహీన్ అఫ్రిది ( shaheen afridi) బౌలింగ్ లోకి కూడా చిత‌క‌ బాదుతాడని హెచ్చరించారు. షాహీన్ అఫ్రిది వేసే ప్ర‌తి ఓవ‌ర్ లో 2 నుంచి 3 సిక్స‌ర్లు కొట్టే ద‌మ్ము వైభ‌వ్ ద‌గ్గ‌ర ఉంద‌ని బాంబ్ పేల్చారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag) చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుత‌న్నాయి.

Also Read: Rohit VS Bumrah: ముంబైలో చీలిక‌..రోహిత్ శ‌ర్మ‌ను బండ బూతులు తిట్టిన బుమ్రా, రూ.50 లక్ష‌ల ఫైన్‌

షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో ప్ర‌తి ఓవ‌ర్ కు వైభ‌వ్ 3 సిక్స‌ర్లు కొడ‌తాడు

Advertisement

రాజస్థాన్ రాయల్స్ డేంజర్ ఆటగాడు 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ, ఈ ఏడాది జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో ( Indian Premier League 2026 Tournament) ఊచ కోత కోస్తున్నాడు. ఎవరు ఊహించని రేంజ్ లో బాదేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో 300 స్ట్రైక్ రేట్ మైంటైన్ చేస్తూ చుక్కలు చూపిస్తున్నాడు. దీంతో వైభవ్ సూర్య వంశీ పైన సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాదు అతి త్వరలోనే వైభవ్ సూర్యవంశీ, టీమిండియాలోకి కూడా రాబోతున్నట్లు చర్చ మొదలైంది. టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య జరిగే సిరీస్ నేపథ్యంలో ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు.

అయితే ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం అతనిపై విషం కక్కుతున్నారు. డ్రగ్స్ తీసుకున్నాడని, డోపింగ్ టెస్టులు చేయాలంటూ తన్వీర్ అహ్మద్, షాహిద్ అఫ్రిది లాంటి పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి సపోర్ట్ గా నిలిచాడు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇంత అద్భుతంగా ఆడడం ఇండియాకు గర్వకారణం అన్నారు. వీడు మామూలు కొట్టుడు కొట్టడం లేదని… బుమ్రా లాంటి వాళ్లు కూడా వనికి పోతున్నారని పేర్కొన్నారు. పాకిస్తాన్ పాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రిది ( Shaheen Afridi) ప్రీమియర్ బౌలర్ అని చెప్పుకుంటూ తిరుగుతాడు.. అతని బౌలింగ్ లో కూడా వైభవ్ ( Vaibhav Suryavanshi) ప్రతి ఓవర్ లో మూడు సిక్సర్లు కొట్ట గలుగుతాడని హెచ్చరించారు. అంత పవర్ వైభవ్ దగ్గర ఉందని డేంజర్ బెల్స్ పంపించాడు వీరేంద్ర సెహ్వాగ్. దీంతో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Advertisement

 

https://www.facebook.com/photo/?fbid=976707211936688&set=a.808612632079481

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×