Wasim Akram slams Irfan pathan : పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో పలు కీలక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు అత్యంత చెత్తగా ప్రదర్శన కనబరిచి ఓడిపోయింది. దీంతో పాకిస్తాన్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు మాజీలు. ఈ లిస్టులో ఇర్ఫాన్ పఠాన్ ( Irfan pathan ) కూడా ఉన్నారు. అత్యంత హీనంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఉద్దేశించి ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు చేశారు. అయితే దీనికి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ ( Wasim Akram) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పొద్దున లేస్తే, పాకిస్తాన్ పైన ఏడవడమేనా ? ముందు టీమిండియాను గాడిలో పెట్టుకో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ గురించి మరోసారి మాట్లాడితే, పళ్లు రాలకొడతానంటూ హెచ్చరించారు. దీంతో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ ( Wasim Akram) చేసిన వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ క్రికెట్ జట్టును వ్యతిరేకిస్తూ.. కించపరుస్తున్న ఇర్ఫాన్ పఠాన్ ను ( Irfan pathan) ఉద్దేశించి మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ పఠాన్ చాలా మంచి వ్యక్తి అయినప్పటికీ.. చాలా అక్కస్ తో తమ పాకిస్తాన్ జట్టుపై విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఒకప్పుడు తన దగ్గర బౌలింగ్ నేర్చుకున్న ఇర్ఫాన్.. బుద్ధి తక్కువ అయిన వాడిలాగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు.
2004 ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా సిరీస్ సందర్భంగా… ఇర్ఫాన్ పఠాన్ తనను కలిశాడని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో తాను కామెంట్రీ బాక్స్ లో కూర్చున్నానని గుర్తు చేశారు. కామెంట్రీ చేసిన తర్వాత ఇర్ఫాన్ పఠాన్ ను ట్రైన్ చేసినట్లు వివరించారు. బౌలింగ్ యాక్షన్ గురించి పలు సూచనలు కూడా ఇర్ఫాన్ పఠాన్ కు ఇచ్చినట్లు వివరించారు. అయితే వీటన్నిటిని మర్చిపోయి… పాకిస్తాన్ క్రికెట్ జట్టును కించపరుస్తూ పోస్టులు పెడుతున్నాడని మండిపడ్డారు.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వసీం అక్రమ్. పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగే మ్యాచ్ ను చాలా పెద్ద యుద్దం అన్నట్లుగా చూస్తారని ఫైర్ అయ్యారు. అందులో ఒక మ్యాచ్ పాకిస్తాన్ గెలిస్తే.. మరో మ్యాచ్ ఇండియా గెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇలా ఇండియా ఓడిపోతే పాకిస్తాన్ కు ఏమి రాదని.. అటు పాకిస్తాన్ ఓడిపోయి టీమిండియా గెలిస్తే పెద్దగా ఒరిగిందేమి ఉండదని ఆయన తెలిపారు. పగ ప్రతీకారం పెంచుకొని అనవసరంగా అభిమానులు కొట్టుకుని చావకూడదని కోరారు.