E-Paper
Advertisement

Brendon McCullum: వివాదంలో బ్రెండన్ మెక్‌కలమ్.. వాకీ టాకీతో కుట్ర‌లు, నేపాల్ ఓట‌మి

Brendon McCullum: వివాదంలో బ్రెండన్ మెక్‌కలమ్.. వాకీ టాకీతో కుట్ర‌లు, నేపాల్ ఓట‌మి
Advertisement

Brendon McCullum:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ ప్రారంభమై ఇప్పటికే రెండు రోజులు పూర్తయింది. ఈ రెండు రోజుల వ్యవధిలో రోజుకు మూడు మ్యాచ్లు చొప్పున మొత్తం ఆరు మ్యాచులు జరిగాయి. అయితే ఈ ప్రతి మ్యాచ్ లో కూడా పసికూన జట్లు రెచ్చిపోతున్నాయి. ఇండియాను అమెరికా వణికించగా, పాకిస్తాన్ కు నెదర్లాండ్స్ చుక్కలు చూపించింది. ఇక నిన్న క్రికెట్ కనిపెట్టిన ఇంగ్లాండును ఓడించే అంత పనిచేసింది నేపాల్ జట్టు. దీంతో నిన్నటి నుంచి నేపాల్ క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే నేపాల్ వర్సెస్ ఇంగ్లాండ్ ( England vs Nepal ) మధ్య జరిగిన మ్యాచ్ పైన సరికొత్త వివాదం రాజుకుంది. ఈ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ ( Brendon McCullum) వాకీ-టాకీ వాడడం ఇప్పుడు వివాదంగా మారింది. దీనిపై రక రకాల విమర్శలు వస్తున్నాయి.

Also Read: Paul Van Meekeren Trolls Pak: మూడు చెరువుల నీళ్లు తాగించాం, పాకిస్తాన్ ది అస‌లు గెలుపే కాదు..ఇజ్జ‌త్ తీసిన నెదర్లాండ్స్ బౌలర్

వాకీ-టాకీ వివాదం… చిక్కుల్లో ఇంగ్లాండ్ కోచ్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇప్పటి వరకు ఆరు మ్యాచులు ఫినిష్ అయ్యాయి. ఇవాళ మరో మూడు మ్యాచ్లు జరుగుతాయి. అయితే ఈ టోర్నమెంట్ లో భాగంగా నిన్న ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్ జర్ల మధ్య ఐదవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా అద్భుతంగా రాణించిన నేపాలి జట్టు, ఒకానొక సమయంలో ఇంగ్లాండ్ ను ఓడించినంత పని చేసింది. అయితే చివరకు నాలుగు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. చేసింది చేసే క్రమంలో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది నేపాల్ క్రికెట్ జట్టు. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్ ఆడింది. ఈ నేపథ్యంలోనే ఏడు వికెట్లు నష్టపోయి 184 పరుగులు సాధించింది ఇంగ్లాండు. నేపాల్ క్రికెట్ ప్లేయర్లకు ఈ 185 పరుగుల లక్ష్యం చాలా పెద్దదే. కానీ అవలీలగా చేదించేంత పని చేశారు.

180 పరుగుల దాకా వచ్చి మ్యాచ్ ఓడిపోయారు నేపాల్ క్రికెటర్లు. అయితే నేపాల్ క్రికెట్ జట్టు చేజింగ్ చేసే సమయంలో ఎన్ని ఎత్తుగడలు వేసినా ఇంగ్లాండ్ బౌలర్లు వికెట్లు మాత్రం తీయలేకపోయారు. దీంతో స్వయంగా ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ రంగంలోకి దిగి వాకీ టాకీలు వాడి బౌలర్లకు అలాగే కెప్టెన్ కు సలహా సూచనలు అందించారు. అయితే మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా వాకీ టాకీ వాడడం ఎంత మేరకు కరెక్ట్ అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఓటమి భయంతో వాకీ టాకీలు వాడాలని బ్రెండన్ మెక్‌కలమ్ ను ఆడుకుంటున్నారు జనాలు. వెంటనే బ్రెండన్ మెక్‌కలమ్ పై బ్యాన్ విధించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

అసలు వాకీ టాకీలు వాడవచ్చా ?

Advertisement

క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో ఆడే క్రికెటర్లు అస్సలు వాకీ టాకీలు వాడకూడదు. కానీ కోచింగ్ స్టాఫ్ వీటిని వాడుకోవచ్చట. అయితే ఐసీసీ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వాడుకోవాలి. అంతేకాదు హెల్త్ ఎమర్జెన్సీ సమయంలోనే వాకీ టాకీలు ఉపయోగించుకోవాలి. కానీ బ్రెండన్ మెక్‌కలమ్ మాత్రం మ్యాచ్ గెలిచేందుకు వాడుతున్నాడు. దీంతో అతనిపై ఐసీసీ యాక్షన్ తీసుకుంటుందని కొంత మంది అంటున్నారు.

 

 

Related News

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

Big Stories

Advertisement
×