Ravindra Jadeja Retiring Hurt: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ లో వివాదస్పద సంఘటన చోటు చేసుకుంది. రవీంద్ర జడేజా ( Ravindra Jadeja ) మంచి ఊపుతో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో.. అతన్ని బలవంతంగా బయటకు పంపించింది రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) యాజమాన్యం. ఇవాల్టి మ్యాచ్ లో నాలుగో వికెట్ కు రవీంద్ర జడేజా వచ్చాడు. ఈ క్రమంలోనే 19 బంతుల్లోనే 34 పరుగులు సాధించాడు. వైభవ్ సూర్యవంశీ కంటే భయంకరంగా ఆడుతున్నాడు రవీంద్ర జడేజా. ఇంత మంచి ఊపులో ఉన్న రవీంద్ర జడేజాను, రిటైర్డ్ హార్ట్ ( Ravindra Jadeja Retiring Hurt) అయ్యేలా ప్లాన్ చేసి మరీ, కుమార సంగక్కర కుట్రకు తెరలేపినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ చేయకుండా విఫలమైందని ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు. సంగక్కరకు అసలు బుర్రలేదంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ న్యూ చండీగఢ్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసి 214 పరుగులు సాధించింది. అయితే ఇవాల్టి మ్యాచ్ లో పవర్ ప్లే లోపే రాజస్థాన్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ప్రమోషన్ పొందిన రవీంద్ర జడేజా, మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే స్ట్రాటజిక్ టైం ఔట్ సమయానికి 34 పరుగులు సాధించి, టచ్ లోకి వచ్చిన జడేజాను రిటైర్డ్ హార్ట్ గా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం డగౌట్ కు పంపించేసింది.
హెడ్ కోచ్ కుమార సంగక్కర (Kumar Sangakkara) నిర్ణయం మేరకు ఈ సంఘటన జరిగింది. అయితే దీనిపై రవీంద్ర జడేజా, రాజస్థాన్ రాయల్స్ అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు. గాయం కాకుండా రిటైర్డ్ హార్ట్ గా ఎందుకు రవీంద్ర జడేజాను బయటకు పంపారని మండిపడుతున్నారు. కుమార సంగక్కర చెత్త నిర్ణయం వల్ల ఈ సంఘటన చోటుచేసుకుందని అతన్ని ట్రోల్ చేస్తున్నారు. అలాగే రవీంద్ర జడేజాను కొనసాగిస్తే, రాజస్థాన్ రాయల్స్ 250 దాటేదని పేర్కొంటున్నారు. ఇవాల్టి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే మాత్రం.. ఆ బాధ్యత కుమార సంగక్కర వహించాల్సిందేనని ఫైర్ అవుతున్నారు.
రిటైర్డ్ హార్ట్ గా రవీంద్ర జడేజా డకౌట్ కు వెళ్లిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ పీకల్లోకి కష్టాల్లో పడింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. దీంతో చేసేదేమీ లేక ఏడవ వికెట్ కు రవీంద్ర జడేజాను మళ్లీ దింపారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన జడేజా, బ్యాటింగ్ లో తన వంతు కృషి చేశాడు.
What a shameful decision by Rajasthan Royals management and captain Riyan Parag to retire out Ravindra Jadeja despite him.
batting brilliantly. Jadeja looked visibly sad and disappointed after the call. Scoring 34 runs off just 19 balls at a strike rate of 179, he deserved full… pic.twitter.com/VpjqLEtR77— Central Cricket (@arshdeep3444) May 29, 2026