E-Paper
Advertisement

వైభ‌వ్ కోసం మూడు ప్లాన్స్ అన్నావ్..మ్యాచ్ మొత్తం గంగ‌లో క‌లిపావ్, క‌మిన్స్ ప‌రువు తీసిన యాంక‌ర్‌

వైభ‌వ్ కోసం మూడు ప్లాన్స్ అన్నావ్..మ్యాచ్ మొత్తం గంగ‌లో క‌లిపావ్, క‌మిన్స్ ప‌రువు తీసిన యాంక‌ర్‌
Advertisement

RR VS SRH:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) కథ ముగిసింది. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals ) చేతిలో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఏకంగా 47 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతులు దారుణంగా ఓడిపోయింది హైదరాబాద్. ఈ ఓటమి నేపథ్యంలో ఇంటిదారి పట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. అటు క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ ఆడేందుకు రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫై అయింది. మే 29వ తేదీన అంటే రేపు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య క్వాలిఫైయర్ రెండో మ్యాచ్ ఉంటుంది.

Also Read: Vaibhav-Parag: వైభ‌వ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బ‌య‌ట‌పెట్టిన‌ రియాన్ ప‌రాగ్, ఇదిగో షాకింగ్ వీడియో 

వైభ‌వ్ కోసం మూడు ప్లాన్స్ అన్నావ్ ? ఏది చేత‌కాలేదా

Advertisement

ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్య వంశీ నిన్న చేసిన విధ్వంసం దెబ్బకు హైదరాబాద్ ఓడిపోవాల్సి వచ్చింది. కేవలం 29 బంతుల్లో 97 పరుగులు సాధించి హైదరాబాద్ బౌలర్లకు నరకం చూపించాడు. ఏ బంతి వేసిన కూడా సిక్సర్ లేదా బౌండరీ తరలించాడు వైభవ్. ఈ క్రమంలో హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ( Pat Cummins) పరువు తీసింది తెలుగు స్పోర్ట్స్ యాంకర్ ప్రత్యూష సాధు (prathyusha sadhu ipl anchor). వైభవ్ సూర్యవంశీ (vaibhav suryavanshi) కోసం మూడు ప్లాన్స్ సిద్ధం చేశామని మ్యాచ్ కంటే ముందు పాట్ కమ్మిన్స్ విర్రవీగాడని గుర్తు చేశారు. కానీ మ్యాచ్ షురూ అయిన తర్వాత…పాట్ కమ్మిన్సే, వైభవ్ సూర్యవంశీకి ఎక్కువగా పరుగులు సమర్పించుకున్నాడని పరువు తీశారు ప్రత్యూష.

నిన్న మ్యాచ్ ఓడిపోవడానికి ముఖ్య కారణం పాట్ కమ్మిన్స్ చెత్త బౌలింగ్ అంటూ ఆమె ర్యాగింగ్ చేశారు. టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకోకుండా బౌలింగ్ తీసుకోవడం హైదరాబాద్ కు మైనస్ గా మారిందని కూడా ఆమె విశ్లేషించారు. ముఖ్యంగా వైభవ్ సూర్య వంశీని కట్టడి చేయడంలో స్కెచ్ వేసిన‌ మూడు ప్లాన్స్ లో ఏ ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదా ? అంటూ ర్యాగింగ్ చేశారు. మీరు మూడు ప్లాన్సు సిద్ధం చేసుకుంటేనే 97 పరుగులు సాధించాడు.. ఏ ప్లాన్ తో రాకపోయి ఉంటే.. హైదరాబాద్ జట్టుకు తడిచిపోయేదని సెటైర్లు పేల్చారు ప్రత్యుష. దీంతో తెలుగు స్పోర్ట్స్ యాంకర్ ప్రత్యూష సాధు (prathyusha sadhu ipl anchor) వీడియో వైరల్ గా మారింది.

నాలుగు ఓవర్లలో 64 పరుగులు సమర్పించుకున్న పాట్ కమ్మిన్స్

Advertisement

రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ చెత్త ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్లలో 64 పరుగులు ఇచ్చి హైదరాబాద్ కొంపముంచాడు. ఒక్క వికెట్ తీయకపోవడమే కాదు.. బ్యాటింగ్ లో కూడా తేలిపోయాడు పాట్ కమ్మిన్స్.

Also Read:  Abdul Razzaq: PSL అల్లా కంటే ప‌విత్ర‌మైన‌ది..ఐపీఎల్ అతిపెద్ద‌ ఫిక్సింగ్ హబ్ Abdul Razzaq: PSL

 

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

 

Related News

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×