Thriller Series OTT : ఉత్కంఠభరితమైన సస్పెన్స్, హైస్కూల్ డ్రామా, లవ్ ఎలిమెంట్స్ కలగలిసిన ఒక పక్కా యంగ్ అడల్ట్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రీసెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చింది. మొదటి సిరీస్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సిరీస్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఇది టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. పైకి ప్రశాంతంగా కనిపించే ఒక చిన్న ఊరి నేపథ్యంలో సాగే ఈ కథలో, ఒక పాత మర్డర్ కేస్ వెనుక ఉన్న డ్రగ్స్, బ్లాక్‌మెయిలింగ్, డార్క్ సీక్రెట్స్ చుట్టూ ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. ప్రతి ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్టులతో సస్పెన్స్‌ను చివరి వరకు కొనసాగిస్తూనే, ఇద్దరు టీనేజర్ల మధ్య చిగురించే సున్నితమైన ప్రేమను ఇందులో చాలా చక్కగా చూపించారు. సింపుల్‌గా చెప్పాలంటే, ఇది ‘Sherlock Holmes’ తరహా ఇంటెలిజెంట్ ఇన్వెస్టిగేషన్, ‘Wednesday’ లాంటి మోడ్రన్ టీనేజ్ థ్రిల్లర్ స్టైల్‌తో కలిపి తీసిన ఒక పర్ఫెక్ట్ సస్పెన్స్ వెబ్ సిరీస్.
ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘ఎ గుడ్ గర్ల్స్ గైడ్ టు మర్డర్’ (A Good Girl’s Guide to Murder). నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ సిరీస్ Wednesday ఫేమ్ ఎమ్మా మైయర్స్ ఇందులో కథానాయిక ‘పిప్’ పాత్రలో నటించగా, బ్రిటీష్ నటుడు జైన్ ఇక్బాల్ ఆమెకు సహాయం చేసే ‘రవి సింగ్’ పాత్రను పోషించాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థలు మూనేజ్ పిక్చర్స్, బీబీసీ, నెట్‌ఫ్లిక్స్ కలసి నిర్మించాయి. ఇంగ్లాండ్‌లోని ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథను విజువల్ గా చాలా గ్రాండ్‌గా, ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. ప్రముఖ రచయిత్రి హాలీ జాక్సన్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్, విడుదలైన కొద్ది రోజుల్లోనే ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో గ్లోబల్ టాప్-10 లో నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది.ఈ సిరీస్ మొత్తం రెండు సీజన్లుగా అందుబాటులో ఉంది. మొదటి సీజన్ 6 ఎపిసోడ్లతో 2024 లో విడుదలవగా, సీజన్ 2 కూడా 6 ఎపిసోడ్లతో ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్రస్తుతం ఈ సిరీస్ యొక్క అన్ని ఎపిసోడ్లు నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సస్పెన్స్, క్రైమ్, లవ్ ఎలిమెంట్స్ ఉన్న సిరీస్‌లను ఇష్టపడే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ వాచ్.
ఐదేళ్ల క్రితం లిటిల్ కిల్టన్ అనే ఊరిలో ఆండీ బెల్ అనే స్కూల్ అమ్మాయి అకస్మాత్తుగా మాయమవుతుంది. ఆమెను ఆమె బాయ్‌ఫ్రెండ్ సాల్ సింగ్ ఘోరంగా చంపాడని, ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు కేసు ముగిస్తారు. అయితే 17 ఏళ్ల స్కూల్ టాపర్ పిప్పా “పిప్” సాల్ మంచివాడని, అతన్ని ఎవరో ఇరికించారని గట్టిగా నమ్ముతుంది. తన ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ నెపంతో, సాల్ తమ్ముడు రవి సింగ్ సహాయంతో పిప్ ఈ పాత కేసును ఒంటరిగా రీ-ఓపెన్ చేసి పరిశోధన మొదలుపెడుతుంది.
పిప్ ఇన్వెస్టిగేషన్ లోతుగా వెళ్లేకొద్దీ, ఆండీ బెల్ అమాయకురాలు కాదని, ఆమె రహస్యంగా డ్రగ్స్ అమ్మేదని, వయసులో పెద్దవాడైన వ్యక్తితో సీక్రెట్ ఎఫైర్ పెట్టుకుందని తెలుస్తుంది. కేసును ఆపడానికి పిప్‌కు బెదిరింపులు వచ్చినా ఆమె వెనక్కి తగ్గదు. చివరకు ఆండీ సీక్రెట్ ప్రియుడు మరెవరో కాదు, వాళ్ళ స్కూల్ ఇంగ్లీష్ టీచర్ ఎలియట్ వార్డ్ అని పిప్ కనిపెడుతుంది. ఐదేళ్ల క్రితం ఆండీ మాయమైన రాత్రి ఎలియట్, అతని స్నేహితులే సాల్ సింగ్‌ను దారుణంగా చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆధారాలతో సహా బయటపెడుతుంది. దీంతో స్టోరీ మరింత ఇంటెన్స్ గా మారుతుంది. చివరికి ఆండీ మర్డర్ వెనుక అసలు మిస్టరీ ఏమిటి ? పిప్ ఈ మిస్టరీని ఎలా బయటకు తెస్తుంది ? అనేది ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : మనుషులని మాయం చేసే బ్లాక్ మ్యాజిక్… కల్లోనూ వెంటాడే హర్రర్ సీన్లున్న మూవీ