
World Cup Final : మెగా ఈవెంట్ లో.. తెలుగు సింగర్ శ్రీరామచంద్ర పాట..
వరల్డ్ కప్ ఫైనల్ హీట్ క్షణక్షణాకి పెరిగిపోతోంది. కొత్తకొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఫైనల్ రోజున సంగీత్ ప్రోగ్రాంలో మన తెలుగు సింగర్ శ్రీరామచంద్ర పెర్ ఫార్ఫార్మెన్స్ ఉండబోతోంది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ ఆధ్వర్యంలో ఆటపాటల కార్యక్రమాలను బీసీసీఐ ఏర్పాటు చేసింది.
ఇందులో శ్రీరామచంద్ర తన పాటలతో కోట్లాదిమంది భారతీయులను అలరించనున్నాడు. ఈ గ్రాండ్ మెగా ఈవెంట్ లో ప్రపంచమంతా చూసే ఫైనల్ మ్యాచ్ వేదికపై శ్రీరామచంద్రకి అవకాశం రావడం చాలా గొప్ప విషయమని, ఇది ఒక అదృష్టం లాంటిదని, తను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు.
1200 డ్రోన్స్ ఒకేసారి ఆకాశంలోకి వెళ్లి..
ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే 1200 డ్రోన్స్ ఆకాశంలోకి వెళ్లి గెలిచిన జట్టు పేరును గగనతలంలో లిఖిస్తాయని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇదొక అపురూపమైన ఘట్టమని అంటున్నారు. ఇండియా ఫైనల్ కి చేరడం వల్ల ఇంత హైప్ వచ్చిందని కూడా చెబుతున్నారు. అదే ఇండియా కాకుండా వేరేది వచ్చి ఉంటే.. ఇంత హంగామా ఉండేది కాదని కూడా అంటున్నారు. కేవలం క్రికెట్ పై భారతీయులకి ఉన్న ప్రేమను మరింత పెంచేలా బీసీసీఐ కార్యక్రమాలను రూపొందించిందని కూడా చెబుతున్నారు.
కుళ్లుకుంటోన్న పాకిస్తాన్..
దాయాది దేశమైన పాకిస్తాన్…వరల్డ్ కప్ ఫైనల్ హంగామా చూసి కుమిలిపోతోంది, అంతేకాదు కుతకుతలాడిపోతోందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికి ఫైనల్ లో ఇండియా రాకూడదని కోరుకున్నారు. తీరా వచ్చాక…ఇక్కడ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఇక అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో జరుగుతున్న హంగు, ఆర్భాటం చూసి కుళ్లు పడుతోందని అంటున్నారు. వీళ్లే కాదు ఇండియా గెలవకూడదు అనుకునేవాళ్లందరి నోళ్లు మూతపడేలా రోహిత్ సేన కప్పు తీసుకొస్తుందని మరి కొందరు ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు.
ఆస్ట్రేలియా అంటే చిన్నప్పటి నుంచి పడదు: గిల్
చిన్నప్పటి నుంచి అంటే, క్రికెట్ తెలిసినప్పటి నుంచి, అంటే క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి కూడా ఆస్ట్రేలియా అంటే నాకు పడదని టీమ్ ఇండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ అన్నాడు. ఎందుకంటే మన ఇండియాకి ప్రతిసారి ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా వస్తుందని అన్నాడు. అందుకే నాకు ముఖ్యంగా ఆసిస్ అంటే అస్సలు పడదని అన్నాడు. అది ఇండియా పాలిట విలన్ అని అన్నాడు. అందుకే ఆ జట్టు ఎప్పుడూ ఓడిపోవాలనే కోరుకునే వాడినని అన్నాడు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ లో కూడా ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుంటానని అన్నాడు. ఆ జట్టును ఎలాగైనా ఓడించాలనే అనుక్షణం ఆలోచిస్తానని శపథం చేశాడు.
Komatireddy : ఓడినవారితో కూర్చోవాలా?.. ఆ నోటీసులు చెత్తబుట్టలో పడ్డాయి : కోమటిరెడ్డి