Wankhede Stadium : ఇటీవల ముంబైలో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. అయితే ఈ భారీ వర్షానికి రోడ్లు అన్ని జలమయం అయ్యాయి. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కూడా జలమయం కావడంతో ట్రాఫిక్ ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో కార్లు రోడ్లపై నీటిలో కొట్టుకుపోయాయి. కాలనీలన్ని నీట మునిగాయి. ఈ భారీ వర్షాలకు ముంబై వాంఖడే స్టేడియం కూడా నీట మునిగింది. ప్రస్తుతం ముంబైలోని వాంఖడేే స్టేడియంలోకి భారీ వరద నీరు వచ్చి చేరింది. దీంతో స్టేడియంలో నిలిచిన వాటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ స్టేడియం గురించి అందరూ చర్చించుకోవడం విశేషం.
Also Read : Rohit Sharma : రోహిత్ శర్మకు ఘోర అవమానం… ఆ మ్యాచ్ లు ఆడాల్సిందేనని బీసీసీఐ ఆదేశాలు
ముంబైలో వర్ష బీభత్సం..
ముఖ్యంగా మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. క్లౌడ్ బరస్ట్ లు, కొండ చరియలు విరిగిపడటం, తెరుచుకున్న మ్యాన్ హోల్స్ తో ఆ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ముంబై, పుణె, నాందేడ్ లలో కుండపోత వర్షం కురిసింది. ప్రధానంగా నాందేడ్ లో జరిగిన క్లౌడ్ బరస్ట్ వల్ల ఎనిమిది మంది మరణించారు. ఈ విపత్కర పరిస్థితుల పై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్ష కూడా నిర్వహించారు. రాబోయే 48 గంటలు చాలా కీలకమని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం. ఇక ముంబైలోని రోడ్లు అన్ని కూడా ప్రాజెక్ట్ కాలువల మాదిరిగా దర్శనమిచ్చాయి. చాలా ప్రాంతాల్లో కొన్ని కార్లు నీటిలో మునిగిపోయాయి. మరికొన్ని కార్లు కొట్టుకుపోయాయి. ప్రయాణికులు అతికష్టం మీద ముందుకు సాగారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నడుం లోతు నీటిలో ప్రయాణం చేయాల్సి రావడం గమనార్హం.
వాంఖడే కి మంచి రికార్డు..
ఇక కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బయటికి రావాలంటే ఈత కొట్టడం తప్పనిసరి అన్నట్టు మారింది పరిస్థితి. ఇక ఈ వరదల వల్ల లోకల్ ట్రైన్లు నడుస్తున్నప్పటికీ.. రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రోడ్ల పై రవాణా పూర్తిగా స్థంబించిపోయింది. ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 155 విమానాలు, అక్కడికీ చేరుకోవాల్సిన 100 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాశ్రయానికి వెళ్లే మార్గాలు నీట మునిగిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ముంబై నగరమంతా వరదలతో ఎలా నిండింతో అలాగే ముంబైలోని వాంఖడే స్టేడియం కూడా వరద నీటితో జలమయం అయింది. మరోవైపు వాంఖడే స్టేడియం సముద్ర తీరంలో ఉండటంతో కాస్త వరద ఎక్కువగానే వచ్చినట్టు సమాచారం. అయితే ఈ స్టేడియానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ స్టేడియంలో ఒక భారతీయుడు అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించాడు. 1992-93లో ఇంగ్లాండ్ పై వినోద్ కాంబ్లీ 224 పరుగులు చేశాడు. మరోవైపు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రవిశాస్త్త్రీ ఈ స్టేడియంలో 6 బంతుల్లో 6 సిక్స్ లు బాదాడు. అలాగేే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీని కూడా సాధించాడు రవిశాస్త్రీ. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, విజయ్ మర్చంట్, దిగ్గజ ముంబై క్రికెటర్ల పేరిట వాంఖడే స్టేడియంలో పలు స్టాండ్లు ఉన్నాయి.