DMart History: డి మార్ట్ కేవలం సూపర్ మార్కెట్ మాత్రమే కాదు. లక్షలాది మంది భారతీయులకు సరసమైన కిరాణా సామాన్లు, గృహోపకరణాలు, రోజువారీ నిత్యావసరాలను అందిస్తుంది. నాణ్యమైన వస్తువులను చౌక ధరల్లో అందించడమే డిమార్ట్ ప్రత్యేకత. ఆ పద్దతే ఇవాళ దేశంలోనే ఆ సంస్థను అగ్రగామిగా నిలబెట్టింది. డిమార్ట్ దేశంలోని అత్యంత ప్రసిద్ధ సూపర్ మార్కెట్ చైన్లలో ఒకటిగా ఉంది. బడ్జెట్ లో ధరల్లో రోజువారీ నిత్యావసరాలను అందించడంలో ముందు ఉంటుంది. ఇది వినియోగదారులకు ఒకే దగ్గర గృహ, వ్యక్తిగత ఉత్పత్తలును అందిస్తోంది. డిమార్ట్ స్టోర్ లో ఫుడ్, శుభ్రపరిచే లిక్విడ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, దుస్తులు, వంటగది సామాగ్రి, బెడ్, బాత్ లినెన్, గృహోపకరణాలు సహా బోలెడు వస్తువుల లభిస్తాయి. కస్టమర్లకు తక్కువ ధరల్లో అందిస్తోంది.
డి-మార్ట్ అంటే ఏంటి?
డి-మార్ట్ అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ (ASL) యాజమాన్యంలో ఉంది. దేశ వ్యాప్తంగా ఉన్న స్టోర్లను అదే సంస్థ నిర్వహిస్తుంది. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. డి మార్ట్, డి మార్ట్ మినిమాక్స్, డి మార్ట్ ప్రీమియా, డి హోమ్స్, డచ్ హార్బర్, ఇతర బ్రాండ్లు ASL యాజమాన్యంలో ఉన్నాయి. డిమార్ట్ ఫుల్ నేమ్ ‘దమాని మార్ట్’. దాని వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని. ఆయన పేరు మీదుగా దీనికి డిమార్ట్ అని పేరు పెట్టారు. భారతీయ కుటుంబాల పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి రాధాకిషన్, అతని కుటుంబం 2002లో డిమార్ట్ ను ప్రారంభించారు. డి-మార్ట్ ప్రధాన లక్ష్యం వినియోగదారులకు తక్కువ ధరలో క్వాలిటీ ఉత్పత్తులను అందించడం.
2002లో ముంబైలో తొలి స్టోర్ ప్రారంభం
2002లో ముంబైలోని పోవైలో డిమార్ట్ తన మొదటి స్టోర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా విస్తరించింది. ఇప్పుడు 415 ప్రదేశాలలో డిమార్ట్ లు ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, చత్తీస్ గఢ్, ఢిల్లీ NCR, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్‌తో సహా పలు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. చాలా డిమార్ట్ స్టోర్లు నిత్యం కొనుగోలుదారులతో నిండి ఉంటాయి. వారు తక్కువ ధరలకు వస్తువులను అమ్మడానికి ఒక పెద్ద కారణం ఏమిటంటే. వారు అద్దె చెల్లించరు. సాధారణంగా సొంత భవనాలను కలిగి ఉంటారు. ఇది వారికి డబ్బు ఆదా చేయడానికి సహాయ పడుతుంది . ఆ పొదుపును కస్టమర్లకు అందిస్తారు. ప్రస్తుతం కంపెనీలో సుమారు 15,000 మంది శాశ్వత ఉద్యోగులను, 59,961 మంది ఉద్యోగులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకుంది.
డి మార్ట్ కేవలం షాపింగ్ చేయడానికి ఒక ప్రదేశంగా మాత్రమే కాకుండా, భారతదేశంలో మధ్యతరగతి జీవితంలో ఒక సాధారణ భాగంగా మారింది. తక్కువ ధరలు, శుభ్రమైన స్టోర్లు ప్రజల విశ్వాసాన్ని పొందాయి. చాలా కాలంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డిమార్ట్ రానున్న రోజుల్లో మరింత విస్తరించే అవకాశం ఉంది. సామాన్యులకు మరింత చౌక ధరల్లో సరుకులను అందించే అవకాశం ఉంది.
Read Also: డిమార్ట్ లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్ గా కొనేయొచ్చు?