Mega 157 Teaser: కొంతమంది అభిమానులకు తమ ఫేవరెట్ హీరో కొన్ని అంశాలు చేస్తే అవి నచ్చుతాయి. కానీ చాలామంది వాటిని దాటి కొంత మంది హీరోలతో ఏవేవో చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. అవి కూడా హిట్ అవుతాయి. కానీ ఎక్కువ శాతం హిట్ అయ్యే దాఖలాలు తక్కువ. రీసెంట్ గా నాగ వంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొందరు హీరోలు కొన్ని చేస్తే అభిమానులు ఇష్టపడతారు అని చెప్పారు. అది మాత్రం వాస్తవం.
ఖుషి సినిమా తర్వాత పది సంవత్సరాలు హిట్టు లేకపోతే, హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా చూడడానికి ఇష్టపడతారో అలా చూపించే సక్సెస్ అయ్యాడు. ఆ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకుంది. అయితే మెగాస్టార్ చిరంజీవిలోని వింటేజ్ వైబ్ చూసి చాలా రోజులైంది. వాల్తేరు వీరయ్య సినిమాతో అది కొంతమేరకు బయటకు తీసుకొచ్చాడు బాబి. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా అంత సక్సెస్ అయింది.
Mega 157 టైటిల్ ఇదే
మెగా Mega 157 టైటిల్ ఏంటి అని అందరూ చాలా రోజుల నుంచి క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. “మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు” (Mana Shankara Vara Prasad Garu… Pandagaki Vasthunnaru) అనేది సినిమా టైటిల్. సినిమా టైటిల్ లోనే ఎప్పుడొస్తున్నామో కూడా క్లారిటీ ఇచ్చేసాడు అనిల్ రావిపూడి. అయితే ఈ టీజర్ మాత్రం అదిరిపోయిందని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎలా అయితే చూడాలి అనుకుంటున్నాడు అలానే చూపించాడు అనిల్ రావిపూడి. అన్నిటినీ మించి ఈ టీజర్ చూస్తున్నప్పుడు రౌడీ అల్లుడు వైబ్ కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. దానిని ఇప్పుడు దర్శకులు పెద్దగా ఉపయోగించలేదు. దాన్ని బయటికి తీసే ప్రయత్నం చేశాడు అనిల్ రావిపూడి.
పండక్కి బ్లాక్ బస్టర్ ఖాయం
ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తరలివస్తారు. మరోవైపు అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎటువంటి అంశాలు పెడితే వర్క్ అవుట్ అవుతాయో బాగా తెలిసిన వ్యక్తి అనిల్ రావిపూడి. అందుకే ఇప్పటివరకు ఒక డిజాస్టర్ సినిమా కూడా తీయకుండా కలెక్షన్లు కొలగొట్టాడు. ఈసారి మెగాస్టార్ చిరంజీవితో పండగ బరిలో దిగుతున్నాడు అనిల్. మన శివశంకర వరప్రసాద్ గారు పండక్కి వచ్చి ఏ రేంజ్ లో ఆకట్టుకుంటారో వేచి చూడాలి.
Also Read: Telugu Film Industry: స్ట్రైక్ ఎండ్ అయితే సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ గా ఉన్న సినిమాలివే