Mohammed Siraj : టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించనున్నట్టు సమాచారం. ఆసియా కప్ 2025కి అతన్ని ఎంపిక చేయకపోవడంతో టీ-20లకు మాత్రమే రిటైర్మెంట్ ఇస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం టెస్టులు, వన్డేలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించనున్నట్టు సమాచారం. వాస్తవానికి ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుతమైన బౌలింగ్ చేసిన సిరాజ్ ని ఆసియా కప్ టోర్నమెంట్ జట్టులో ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సిరాజ్ వేసిన బంతులకు ఇంగ్లాండ్ బ్యాటర్లు చుక్కలు చూశారు.
Also Read : Rishabh Pant : రిషబ్ పంత్ విరిగిన కాలి వేళ్ళు.. ఫోటో వైరల్..
సిరాజ్ ని కాదని హర్షిత్ రాణాకి చోటు ఎలా..?
ముఖ్యంగా ఆసియా కప్ 2025లో అద్భుతంగా బౌలింగ్ చేసే మహమ్మద్ సిరాజ్ ని కాదని హర్షిత్ రాణాకి చోటు ఎలా కల్పించారు..? అంతా ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా సెలక్షన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్న మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణను కాదని హర్షిత్ రాణాను ఎలా జట్టులోకి తీసుకుంటారని ప్రశ్నించాడు. ‘అసలు టీంలోకి హర్షిత్ రాణా ఎక్కడ నుంచి వచ్చాడు. అతడి ప్రదర్శన ఐపీఎల్‌లోనూ పేలవంగా ఉది. అతడి ఎకానమీ 10గా ఉంది. అతణ్ని ఎంపిక చేసి.. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు?’ అని ఫైర్ అయ్యాడు. ” యశస్వి జైస్వాల్ వంటి ప్లేయర్ జట్టులో లేకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. శుభ్‌మన్ గిల్ ఎంపిక మంచి నిర్ణయమే. అతడి ఆట బాగుంది. భవిష్యత్తులో మూడు ఫార్మాట్లలోనూ ఆడతాడు. అయితే జట్టు విజయం కోసం కీలక ఇన్నింగ్స్ ఆడే వారిని పక్కన పెట్టకూడదు అన్నారు.
Also Read : Mohammed Siraj : హైదరాబాద్ లో సిరాజ్ హోటల్… ఒక్కో ఐటమ్ ధర ఎంతంటే.. ఇవి మాత్రం కచ్చితంగా రుచి చూడాల్సిందే
టీమిండియా ఎంపికపై మాజీలు ఏమంటున్నారంటే..?
భారత జట్టు ఎంపికలో సమతుల్యం లోపించినట్లు అనిపిస్తోందని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై బీసీసీఐ అధికారికంగా స్పందించలేదు. జైస్వాల్‌కు ఏమైంది..? అని అశ్విన్ ప్రశ్నించాడు. బీసీసీఐ ప్రకటించిన టీంలో అనూహ్యంగా యశస్వి జైస్వాల్‌కు అవకాశం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ‘యశస్వి జైస్వాల్‌కు టెస్టు అవకాశం వచ్చినప్పుడు స్వీకరించాడు. ఈ మధ్యకాలంలో టెస్టుల్లోకి అడుగుపెట్టిన అత్యంత విజయవంతమైన క్రికెటర్ యశస్వి. ఏ ఫార్మాట్లో అయినాసరే ఎప్పుడు అవకాశం వచ్చినా వదులుకోలేదు. అయినా సరే అతడికి ఇప్పుడు ఛాన్స్ రాలేదు. ఒక దశలో నాయకత్వం రేసులోనూ నిలిచిన ఆటగాడు ఏకంగా జట్టులోనే లేకపోవడం షాక్‌కు గురిచేసింది. ఈ ఫార్మాట్లో యశస్వి స్ట్రైక్‌రేట్ 165. చాలాసార్లు తన కోసం కాకుండా జట్టు కోసం ఆడే వారిని కనుక్కోవడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో యశస్వి జైస్వాల్ ఉంటే సరిగ్గా సరిపోతాడు. ఆ జాబితాలో శ్రేయస్ అయ్యర్ కూడా ఉంటాడని అశ్విన్ పేర్కొన్నాడు. కీలక ఆటగాళ్లను సెలెక్ట్ చేయలేదని క్రికెట్ అభిమానులు బీసీసీఐ పై కాస్త ఆగ్రహంగా ఉన్నారు.