Viral video: ఇప్పుడు ఏడ చూసినా చూసినా సోషల్ మీడియా హవానే కనిపిస్తోంది. జంతువులకు సంబంధించిన వీడియోలు, కామెడీ వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. కొంచెం ఆసక్తిగా ఉంటే చాలు నెటిజన్లు ఆ వీడియోలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వైరల్ వీడియోలను లక్షల మంది నెటిజన్లు చూస్తున్నారు. వీడియో బాగుంటే లైకులు, కామెంట్లు కూడా చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర, చంద్రాపూర్ లో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా డ్రైన్ లో పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకుందాం.
?utm_source=ig_web_copy_link
మహారాష్ట్ర, చంద్రాపూర్ లో ఓ వ్యక్తి రెండు కేక్ బాక్సులు చేతులతో పట్టుకుని రోడ్డు పక్కన ఉన్న డ్రైన్ లో పడిపోయాడు. ఈ చంద్రాపూర్ లోని జనతా కాలేజీ చౌక్ వద్ద సెవెన్ స్టార్ బెేకరీ వద్ద జరిగింది. అతను నడుస్తూ ముందుకు వెళ్తుండగా స్లాబ్ ఒక్కసారిగా విరిగిపోవడంతో లోపలకి కుప్పకూలిపోయాడు. అదృష్టవశాత్తూ సమీపంలో ఉన్న వారు వెంటనే అతన్ని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో అతనికి స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత, మరిన్ని ప్రమాదాలను నివారించడానికి విరిగిన డ్రైన్‌ను రాళ్లతో కప్పేశారు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరా రికార్డు అయ్యింది. ఈ వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ALSO READ: Viral video: భూమ్మీద నీకింకా నూకలున్నయ్ బ్రో.. అందుకే రెప్పపాటు సమయంలో చచ్చిబతికావ్
ఈ ఘటనపై స్థానిక ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు స్పందించారు.మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఆరోపిస్తూ.. ఈ సంఘటనపై స్థానిక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మున్సిపల్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. చంద్రపూర్‌లోని పాదచారుల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ALSO READ: Annamaya District: అన్నమయ్య జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు మృతి, ఒకరు గల్లంతు
నెటిజన్లు ప్రభుత్వం రోడ్డు భద్రతా చర్యలను సమీక్షించాలని.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్ చేశారు. ‘ప్రభుత్వం రోడ్డు కాంట్రాక్ట్‌లను జాగ్రత్తగా తనిఖీ చేయాలి. ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరగుతున్నాయి..’ అని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ‘ఈ ఘటనకు ఎవరైనా బాధ్యత వహిస్తారు’ అని మరొక నెటిజన్ రాసుకొచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.