Hi Nanna Promotions : హాయ్ నాన్న పొలిటికల్ హైప్..మెత్తగా మీడియా పై సెటైర్లు సంధించిన నాని..

Hi Nanna Promotions : హాయ్ నాన్న పొలిటికల్ హైప్..మెత్తగా మీడియా పై సెటైర్లు సంధించిన నాని..

Hi Nanna Promotions
Share this post with your friends

Hi Nanna Promotions

Hi Nanna Promotions : నాచురల్‌ స్టార్‌ నాని,మృణాల్ ఠాకూర్‌ కాంబో లో డిసెంబర్‌ 7న గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది. మూవీ రిలీజ్ దగ్గర పడడంతో హాయ్‌ నాన్న మూవీ టీమ్ ప్రమోషన్స్ని వెరైటీగా క్యారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా చాలా డిఫరెంట్ వీడియోని విడుదల చేశారు. గత కొన్ని వారాలుగా ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ఫర్ రేంజ్ లో జరుపుతున్నారు మూవీ టీమ్. తాజాగా విడుదలైన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలో ఎలక్షన్ సీజన్ నడుస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పొలిటికల్ ఆంగిల్ ని కూడా మూవీ పబ్లిసిటీ కోసం ఉపయోగించేశారు. నాని పొలిటిషన్ గెటప్ లో తన రాబోయే మూవీ కోసం ప్రమోషన్ చేశాడు. ఈ వీడియోలో నాని ఫేమస్ పొలిటిషియన్స్ ని అనుసరించడంతోపాటు కొందరిపై తనదైన శైలిలో సెటైర్లు కూడా వేశాడు. ఈ ప్రమోషన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన నాయకులను.. పార్టీకి చెందిన వ్యక్తులను ఇమిటేట్ చేయడంతో పాటుగా ఎలక్షన్ సమయంలో పార్టీలు తమకు తోచిన హామీలను ఇస్తూ మేనిఫెస్టో మ్యాజిక్ చేస్తున్నాయి అని నాని ప్రస్తుత ఎలక్షన్ పరిస్థితి గురించి తనదైన శైలిలో మాట్లాడాడు. ఇక వీడియో చివర్లో మీడియా వారిపై కూడా నాని చిన్న రేంజ్ పంచ్ వదిలాడు. ఇంతకుముందు సుమా ఒక కార్యక్రమంలో మీడియా వారి పై తినడం గురించి మాట్లాడి పెద్ద దుమారమే లేపింది. ఆ తర్వాత మీడియా వారికి క్షమాపణలు చెప్పిందనుకోండి. ఆ విషయాన్ని నాని 

ఈ వీడియోలో గుర్తు చేస్తూ తాను తింటున్నట్టు సైగ చేసి..

క్షమాపణలు చెప్పడానికి నేను యాంకర్ ని కాదు పొలిటిషన్ అంటూ.. మీడియా వారికి చిన్న సైజు కౌంటర్ ఇచ్చాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోని అందరూ లైట్గా తీసుకుంటే పర్లేదు కానీ సీరియస్గా తీసుకుంటే మాత్రం పెద్ద కాంట్రవర్సీ అవ్వడం కన్ఫామ్ అంటున్నారు కొందరు నెటిజెన్స్. ఇక హాయ్ నాన్న మూవీ ఏ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందో విడుదల అయ్యాక తెలుస్తుంది..


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Dasara Review : ధూంధాం దసరా.. ఆడు పక్కా తెలంగాణోడు.. బిగ్ టీవీ.. బిగ్ రివ్యూ..

Bigtv Digital

Narayankhed : అనూహ్యంగా తప్పుకున్న సురేష్ షెట్కర్.. బరిలో సంజీవ్ రెడ్డి..

Bigtv Digital

Nagarjuna Akkineni : రైట‌ర్‌ను డైరెక్ట‌ర్‌గా మారుస్తున్న నాగ్‌..!

BigTv Desk

IPL Auction : దుబాయిలో ఐపీఎల్ వేలం.. పెళ్లిళ్ల కారణంగానేనా?

Bigtv Digital

Tamil Nadu Bus Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..

Bigtv Digital

Gold Rates: షాక్.. పెరిగిన బంగారం ధరలు..

Bigtv Digital

Leave a Comment