Mohammed Siraj : టీమిండియా క్రికెటర్లు ఈ మధ్య క్రికెట్ ఆడటంతో పాటు సైడ్ బిజినెస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో క్రికెటర్ ఒక్కో రంగాన్ని ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా వీళ్లు జాతీయ జట్టుకు ఆడుతూనే మరోవైపు ఐపీఎల్ లీగ్ లో దుమ్మురేపడం మనం ప్రతీ సంవత్సరం చూస్తూనే ఉన్నాం. ఇక అదే సమయంలో కొన్ని యాడ్స్ లో నటిస్తూ కోట్లాది రూపాయలను వెనకేసుకుంటున్నారు. అలా వచ్చిన డబ్బులతో కొన్నింటిని వ్యాపారాల్లో భాగస్వాములు అవ్వడం లేదా కొత్త బిజినెస్ ప్రారంభించడం లాంటివి చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కూడా ఇప్పుడు ఇదే దారిలో నడుస్తున్నాడు. హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. జొహార్బా పేరుతో ఒక కొత్త ప్రీమియం రెస్టారెంట్ ను ప్రారంభించాడు సిరాజ్.
Also Read : Rishabh Pant : రిషబ్ పంత్ విరిగిన కాలి వేళ్ళు.. ఫోటో వైరల్..
సిరాజ్ హోటల్ లో ఫ్యామిలీ భోజనం రూ.5000
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో గల ఈ రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ లో మొఘలాయి, పర్షియన్ తో పాటు, అరేబియన్, చైనీస్ లాంటి విభిన్న రకాల వంటకాలను సిద్ధం చేశారు. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తరువాత సిరాజ్ కూడా రెస్టారెంట్ ను ప్రారంభించాడు. జోహర్ఫా రెస్టారెంట్. అన్ని వంటకాల్లో ప్రత్యేకంగా హైదరాబాద్ మిర్చి ప్రత్యేకత. ఇంటీరియర్స్ రాయల్ ఫీల్, లగ్జరీ లుక్ కనిపిస్తుంది. ప్రీమియం డైనింగ్ అనుభవం గ్యారెంటీ. అయితే ఈ హోటల్ లో ఇప్పుడు అధిక ధరలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా సలాడ్ రూ.355, స్పెషల్ ప్లాటర్ రూ.3,999, ఫ్యామిలీ భోజనం రూ.5000 అంటే చాలా ఖరీదు అనే చెప్పాలి. మధ్య తరగతి ప్రజలు రూ.5000 పెట్టి ఫ్యామిలీ భోజనం చేస్తారా..? రూ.5000 పెడితే నెల మొత్తం గడిపేయవచ్చు అని కొందరూ పేర్కొనడం గమనార్హం.
బిర్యానీ రిచ్ ఫ్లేవర్..
బిర్యాని రిచ్ ఫ్లేవర్.. యూనిక్ హైదరాబాద్ ని టచ్ చేశారు. పిస్తా హౌస్, షా హౌస్ లెజెండ్స్ సరసన చేరింది. డైలీ డైనింగ్ చేసే వారికి ఇది అస్సలు బెటర్ కాదనే చెప్పవచ్చు. ఫ్యామిలీ ఔటింగ్, గ్రూప్స్, స్పెషల్ ఎక్స్ పీరియన్స్ కి ఇది సరిపోతుంది. సిరాజ్ ప్రస్తుతం టీమిండియా టెస్ట్ సిరీస్ ముగించుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన 5 టెస్ట్ సిరీస్ ల మ్యాచ్ లో 5 టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో సిరాజ్ మాయాజాలంతోనే టీమిండియా మ్యాచ్ గెలిచింది. లేదంటే ఆ మ్యాచ్ ఓడిపోయింటే సిరీస్ కోల్పోయేవాళ్లం. అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు సిరాజ్. టీమిండియా కీలక బౌలర్ బుమ్రా తరువాత సిరాజ్ రెండో కీలక బౌలర్ అనే చెప్పాలి. కానీ టీ-20 సిరీస్ కి సిరాజ్ ని ఎంపిక చేయకపోవడం గమనార్హం. అద్భుతంగడా బౌలింగ్ చేసే సిరాజ్ ఎంపిక చేయలేదు ఏందని హైదరాబాద్ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.