BigTV English

Telugu Film Workers : సమ్మె విరమణ, సీఎం రేవంత్ రెడ్డి పై తెలుగు సినిమా ప్రముఖులు ప్రశంసల జల్లు

Telugu Film Workers : సమ్మె విరమణ, సీఎం రేవంత్ రెడ్డి పై తెలుగు సినిమా ప్రముఖులు ప్రశంసల జల్లు

Telugu Film Workers : గత కొన్ని రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమా షూటింగ్ లేదు జరగటం లేదు. దీనికి కారణం తెలుగు సినిమా కార్మికులంతా కలిసి సమ్మె మొదలుపెట్టారు. తమ వేతనాలు 30% వరకు పెంచాలి అనేది వాళ్ళ డిమాండ్. ఆల్రెడీ చాలా ఎక్కువగానే ఇస్తున్న మళ్లీ పెంచడం కష్టం అనేది నిర్మాతల రెస్పాన్స్.


మొత్తానికి అటు నిర్మాతలు తగ్గలేదు, ఇటు సినిమా కార్మికులు తగ్గలేదు. అందుకనే మొత్తానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అసలు షూటింగ్ జరగలేదు. గత 17 రోజులుగా జరుగుతున్న ఈ ఇష్యూ కి నేడు శుభం కార్డు పడిపోయింది. రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఇన్వాల్వ్ అవ్వడం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి అనే రంగంలోకి దిగడంతో అంత క్లియర్ అయింది.

సీఎంపై ప్రశంసల జల్లు 


గత కొన్ని రోజులుగా నడుస్తున్న ఈ ఇష్యూ నేటితో క్లారిటీ వచ్చేసింది. రేపటి నుంచి షూటింగ్స్ మొదలుకానున్నాయి. ఈ తరుణంలో తెలుగు సినిమా ప్రముఖులు, తెలుగు సినిమా నిర్మాతలు సీఎం రేవంత్ రెడ్డి పైన ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా…

ఎంతో జ‌టిల‌మైన‌ ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ను చాలా సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా, ఇటు నిర్మాత‌లకు, అటు కార్మికులకు స‌మ‌న్యాయం జ‌రిగే విధంగా ప‌రిష్క‌రించిన తెలంగాణ ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకొంటున్నాను.

 

తెలుగు చిత్ర‌సీమ అభివృద్ధికి ముఖ్య‌మంత్రి గారు తీసుకొంటున్న చ‌ర్య‌లు అభినంద‌నీయం. హైద‌రాబాద్ ను దేశానికే కాదు, ప్ర‌పంచ చ‌ల‌న చిత్ర రంగానికే ఓ హ‌బ్ గా మార్చాల‌న్న ఆయ‌న ఆలోచ‌న‌లు, అందుకు చేస్తున్న కృషి హ‌ర్షించ‌ద‌గిన‌వి.

 

తెలుగు చిత్ర‌సీమ ఇలానే క‌లిసి మెలిసి ముందుకు సాగాల‌ని, ప్ర‌భుత్వం కూడా అన్ని ర‌కాలుగా అండ‌దండ‌లు అందిస్తుంద‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకొంటున్నా.

https://Twitter.com/KChiruTweets/status/1958583510345851165?t=ZIAwOC3izm5873Mzk-OSRQ&s=19

మైత్రి మూవీ మేకర్ సంస్థ కూడా స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

https://Twitter.com/MythriOfficial/status/1958579692577202261?t=NQIEkfoMkV23HnXSb6YBrw&s=19

అలానే ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

https://Twitter.com/peoplemediafcy/status/1958578973073723584?t=E_7oJT9Nc1lU5xdg1Nmdhw&s=19

Related News

Pradeep Ranganathan: హీరో నాని రికార్డును సమం చేయబోతున్న యంగ్ హీరో.. ఫలితం లభిస్తుందా?

Roshan Champion: రోషన్‌ ‘ఛాంపియన్‌’ రిలీజ్ డేట్‌ వచ్చేసింది.. థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే!

Naga Chaitanya: ప్రయత్నించినా.. తప్పించుకోలేకపోయా.. చైతూ మాటలు వెనుక ఆంతర్యం?

Dadasaheb Phalke Biopic: ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ఆగిపోయినట్టేనా.. జక్కన్న కీలక నిర్ణయం!

Kantara Movie: కాంతార: చాప్టర్‌ 1 విలన్‌కి డబ్బింగ్‌ చెప్పింది ఈ బిగ్‌బాస్‌ కంటెస్టెంటే.. తెలుసా?

Srinidhi shetty: ఆ ఇద్దరి హీరోల కోసం రాత్రి పగలు ఆ పని చేస్తా.. శ్రీనిధి శెట్టి

DVV Danayya : పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్… దానయ్య దారెటు ?

Rishabh shetty: కాంతార1 లో రిషబ్ శెట్టి భార్య పిల్లలు కూడా ఉన్నారా…అసలు కనిపెట్టలేరుగా?

Big Stories

×