Tollywood cineworkers: గత 17 రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమా కార్మికులు తమ వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలామంది నిర్మాతలు దీని గురించి మాట్లాడడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ ఏవి వర్క్ అవుట్ అవ్వలేదు. ఎప్పుడో క్లియర్ అయిపోవాల్సిన సమస్య రోజురోజుకుతో పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా దీనివలన చాలా సినిమాలు షూటింగ్ లేకపోయాయి.
మొత్తానికి ఈ ఇష్యూ గురించి చాలామంది రాజకీయ నాయకులను గెలిచారు. చాలామంది సీనియర్ సార్ హీరోలను కూడా గెలిచారు. అయితే ఈరోజు రేపు కొలిక్కి వచ్చేస్తుంది అనుకున్న మ్యాటర్ ఇప్పటివరకు రాలేదు. మొత్తానికి ఇది ఒక కొలిక్కి వచ్చేసినట్లు సమాచారం వినిపిస్తుంది.
ముగిసిన సమ్మె
తమ వేతనాలను 30 శాతం వరకు పెంచాలి అని సినీ కార్మికులు. ఇప్పటికే చాలా ఎక్కువ ఇస్తున్నాం అలా పెంచలేము అని నిర్మాతలు. అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలు తీయాలా వద్దా అని కొంతమంది నిర్మాతలు. ఇలా చాలామంది వివిధ రకాలు చర్చలు జరిగిన తరువాత. ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి కూడా ఇటు నిర్మాతలతోనూ అటు ఫెడరేషన్ సభ్యులతోనూ చర్చలు జరిపారు. మొత్తానికి తెలుగు సినిమా కార్మికులు సమ్మె విరమించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఆధ్వర్యంలో విజయవంతంగా చర్చలు ముగి సాయి. మరి కాసేపట్లో జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.
Also Read: Mega 157 Teaser: మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు, టీజర్ అదిరింది. అసలైన మెగా ట్రీట్