BigTV English
Advertisement

Yash Dayal : ఆమెకు ఐఫోన్.. లక్షల్లో డబ్బు కూడా ఇచ్చా.. నాకే ద్రోహం చేసింది

Yash Dayal : ఆమెకు ఐఫోన్.. లక్షల్లో డబ్బు కూడా ఇచ్చా.. నాకే ద్రోహం చేసింది

Yash Dayal :  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ యశ్ దయాల్ పై ఇటీవల కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే అతను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి లైంగికంగా వాడుకున్నాడని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో యశ్ దయాల్ పై FIR ఫైల్ చేశారు పోలీసులు. ఈ తరుణంలోనే వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై యశ్ దయాల్ తాజాగా స్పందించాడు. తనపై ఆరోపణలు చేస్తున్న యువతికి ఐఫోన్, రూ.లక్షల్లో నగదు అప్పుగా ఇచ్చానని.. కానీ ఇప్పటివరకు ఆమె తిరిగి ఇవ్వలేదని రాయల్ ఛాలెంజర్స్ బౌలర్ యశ్ దయాల్ తెలిపారు. తన కుటుంబ సభ్యుల చికిత్స పేరుతో  పాటు.. షాపింగ్ కి కూడా తీసుకువెళ్లి డబ్బులు కాజేసిందని ఆయన ఆరోపించారు. వీటన్నింటికీ తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఆ యువతి పై పోలీసులకు రిటన్ కంప్లైంట్ ఇచ్చిన యశ్ దయాల్.. ఆమె పై FIR నమోదు చేయాలని కోరాడు.


Also Read : MS Dhoni : 50 మిలియన్ ఫాలోవర్స్…అది ధోని అకౌంట్ కాదట… ఫేక్ అంటూ ట్రోలింగ్.. కోహ్లీ ఆడుకుంటున్నాడుగా

ఫోన్, ల్యాప్ టాప్ దొంగిలించింది : యశ్ దయాల్ 


ముఖ్యంగా తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చరేసిన యువతి తన ఫోన్, ల్యాప్ టాప్ దొంగిలించిందని ఆరోపించాడు. 2021లో ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆ యువతితో తనకు పరిచయం ఏర్పడిందని.. ఆ తరువాత ఒకరితో మరొకరం మాట్లాడుకున్నామని తెలిపారు. ఆసుపత్రికి వెళ్లాలని చెప్పి తన దగ్గర నుంచి లక్షలాది రూపాయలను అప్పుగా తీసుకుందని.. డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పి ఇప్పటికీ రిటన్ ఇవ్వలేదని తెలిపాడు. షాపింగ్ కోసం ఆమె తన వద్ద నుంచి పదే పదే తీసుకుందని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపాడు. తనపై ఘజియాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిసి.. ఆమె పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. తనను మోసం చేసిన ఆ మహిళతో పాటు ఆమె కుటుంబంలోని అనేక మంది పై FIR నమోదు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నాడు యశ్ దయాల్.

అంతా ఉత్తదే.. నన్నే మోసం చేసింది 

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాల్ పై కేసు నమోదైన విషయం తెెలిసిందే. పెళ్లి చేసుకుంటానని తప్పుడు హామీలు ఇవ్వడం.. మోసపూరితంగా లైంగిక సంబంధం పెట్టుకోవడంతో బీఎన్ఎస్ సెక్షన్ 69 ప్రకారం.. అతని పై ఇందిరాపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. గత ఐదేళ్లుగా యశ్.. తనతో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ఓ యువతి  ఐజీఆర్ఎస్ ద్వారా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కి ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో పాటు కుటుంబ సభ్యులకు పరిచయం చేయడంతో పాటు కుటుంబ సభ్యులకు పరిచయం చేయడంతో తాను యశ్ ను నమ్మానని ఆ యువతి వెల్లడించింది. కొద్ది రోజుల తరువాత మానసికంగా, శారీరకంగా వేధించడంతోో పాటు డబ్బులు కూడా తీసుకున్నట్టు తెలిపింది. తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు, చాట్ రికార్డులు, స్క్రీన్ షాట్స్, కాల్ రికార్డింగ్ లు, ఫొటోలను పోలీసులకు అప్పగించింది. ప్రస్తుతం  ఈ విషయం పై అందరూ చర్చించుకోవడం విశేషం.

 

Related News

Rohit Sharma: అన్ని ఫార్మాట్స్ లో 5 సెంచరీలకు పైగా చేసిన ఏకైక క్రికెటర్ గా రోహిత్..ఇక ఆసీస్ కు రాబోమంటూ ప్ర‌క‌ట‌న‌

Womens World Cup 2025: ఆస్ట్రేలియా మ‌హిళ‌ల‌ జ‌ట్టుకు లైంగిక వేధింపులు..ఇండియాలో టోర్న‌మెంట్స్ పెట్టొద్దు అంటూ?

IND VS AUS: మూడో వ‌న్డేలో టీమిండియా విజ‌యం..గంభీర్ కు ఘోర అవ‌మానం..ర‌విశాస్త్రి కావాలంటూ !

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ…స‌చిన్ రికార్డు బ్రేక్, హిట్ మ్యాన్ ప్రైవేట్ పార్ట్ పై కొట్టిన కోహ్లీ

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ అర్థ‌సెంచ‌రీలు…60 హ‌ఫ్ సెంచ‌రీలు పూర్తి చేసిన‌ హిట్ మ్యాన్

Virat Kohli: హ‌మ్మ‌య్యా..డ‌కౌట్ కాలేదు, సింగిల్ తీసి కోహ్లీ సెల‌బ్రేష‌న్స్‌…స్మిత్ రికార్డ్ బ‌ద్ద‌లు కొట్టిన‌ హెడ్

Harshit Rana: గిల్ మాట లెక్క‌చేయ‌ని హ‌ర్షిత్ రాణా..రోహిత్ టిప్స్ తీసుకుని 4 వికెట్లు

IND VS AUS, 3rd ODI: 4 వికెట్ల‌తో రెచ్చిపోయిన హ‌ర్షిత్ రాణా..ఆస్ట్రేలియా ఆలౌట్‌, టీమిండియా టార్గెట్ ఎంతంటే

Big Stories

×