Kaushal Manda: కౌశల్ మండ(Kaushal Manda) పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో సినిమాలలో, బుల్లితెర సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన కౌశల్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు మోడలింగ్ ఏజెన్సీ (Modeling Agency)కూడా రన్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల కౌశల్ మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో కూడా ఈయన ఒక కీలక పాత్రలో నటించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కౌశల్ తన కెరియర్ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
మోడలింగ్ ఏజెన్సీ..
సాధారణంగా ప్రతి ఏడాది తాను ఏప్రిల్ నుంచి జూలై వరకు యూఎస్ లో ఉంటానని తెలిపారు. అక్కడ అన్ని రాష్ట్రాలలోనూ బ్యూటీ ప్రెసెంట్ షోస్ చేస్తానని వాటన్నింటినీ తానే ఆర్గనైజ్ చేస్తూ, వర్క్ షాప్స్ పూర్తి చేసి ఇండియాకి తిరిగి వచ్చేస్తుంటాము. ఇక్కడ కూడా సమ్మర్ లో లోకల్ వర్క్ షాప్స్ చేస్తుంటామని తెలిపారు. ఇక తనకు మోడలింగ్ ఏజెన్సీ కూడా ఉందని దాదాపు ఒక 50 మంది పిల్లలు నా ఇన్స్టిట్యూట్లో ఉన్నారని తెలిపారు. వారందరికీ మోడలింగ్ లో శిక్షణ ఇప్పిస్తుంటామని తెలియజేశారు. ఇక తన మోడలింగ్ ఏజెన్సీలో ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు కూడా శిక్షణ తీసుకున్నారని కౌశల్ ఈ సందర్భంగా తెలియజేశారు.
యాడ్ ఫిలిమ్స్ డైరెక్టర్…
తాను మోడలింగ్ ఏజెన్సీ రన్ చేయడంతో పాటు యాడ్ ఫిలిం మేకింగ్ చేస్తున్నానని వెల్లడించారు. ఇప్పటివరకు సుమారు 200 లకు పైగా యాడ్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేసానని అందులో రీతూ వర్మ (Reethu Varma)తమన్నా(Tamannaah) లాంటి స్టార్ హీరోయిన్స్ ఉన్నారని కూడా కౌశల్ తెలిపారు. తమన్నా నటించిన హ్యాపీడేస్(Happy Days) సినిమా తర్వాత తనతో రెండు మూడు యాడ్ ఫిలిమ్స్ నేనే డైరెక్ట్ చేశాను అని తెలిపారు. నిజానికి నా చెయ్యి చాలా లక్కీ అని, నేను ఎవరికైతే యాడ్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేస్తానో వారందరూ కూడా ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు అంటూ ఈ సందర్భంగా కౌశల్ తెలిపారు.
స్టార్ డం వచ్చాక పలకరించరు..
ఇలా ఒకప్పుడు నా డైరెక్షన్లో యాడ్ ఫిలిమ్స్ చేసిన వారందరూ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే వారికి స్టార్ డం వచ్చిన తర్వాత కొంతమంది గుర్తుపెట్టుకొని నన్ను పలకరిస్తారని, మరి కొంతమంది కృతజ్ఞత లేకుండా చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారని తెలియజేశారు. అలా వెళ్లిపోయే వారి గురించి తానేమి చెప్పదలుచుకోలేదు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా కౌశల్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనగా మారాయి. దీంతో నెటిజన్స్ కూడా విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. వదిలేస్తే ఆస్కార్ అవార్డు కూడా నేనే తెప్పించానని చెబుతాడు అంటూ కొంతమంది కామెంట్లు చేయగా, మరికొందరు మాత్రం కౌశల్ చాలా నిజాయితీపరుడు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: పెళ్లికి ముందే హనీమూన్.. వెళ్తే తప్పేంటీ?