BigTV English
Advertisement

MS Dhoni : 50 మిలియన్ ఫాలోవర్స్…అది ధోని అకౌంట్ కాదట… ఫేక్ అంటూ ట్రోలింగ్.. కోహ్లీ ఆడుకుంటున్నాడుగా

MS Dhoni : 50 మిలియన్ ఫాలోవర్స్…అది ధోని అకౌంట్ కాదట… ఫేక్ అంటూ ట్రోలింగ్.. కోహ్లీ ఆడుకుంటున్నాడుగా

MS Dhoni : భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఇటీవలే ధోనీ తన 44వ పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు. అభిమానులు, తన సహచర క్రికెటర్లంతా ధోనీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ముఖ్యంగా క్రికెట్ కెరీర్ లో అనేక మైలు రాళ్లను సాధించాడు. భారత క్రికెట్ లో ధోనీ సహకారాన్ని మాటల్లో వర్ణించలేము. ఎందుకంటే అతను కొన్ని మరుపు రాని క్రికెట్ జ్ఞాపకాలను బహుమతిగా ఇచ్చాడు. 2007లో టీ-20 వరల్డ్ కప్ తో పాటు 2011 వన్డే వరల్డ్ కప్ విజయంతో ముగించడం.. అతని వారసత్వం క్రికెట్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఇంతటితో అతని వారసత్వం ముగిసిపోలేదు. అతని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ 5 ఐపీఎల్ ట్రోఫీలతో వారసత్వాన్ని కొనసాగిస్తోంది.


Also Read : IND vs SL 2025: రోహిత్, విరాట్ కోహ్లీ కోసం BCCI బిగ్ ప్లాన్… వచ్చే నెలలోనే అదిరిపోయే సిరీస్.. ఇక ఫ్యాన్స్ కు పండగే

50 మిలియన్ ఫాలోవర్స్..


2020లో అంతర్జాతీయ క్రికెట్ లో బూట్లను వేలాడదీసినప్పటికీ అతను ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో నివసిస్తున్నాడు. జులై 07న భారత్ ప్రియమైన మహేంద్ర సింగ్ ధోనీ 44 సంవత్సరాలు నిండిన సందర్భంగా.. అతను తన టోఫీకి మరో రెక్కను జోడించాడు. ఇన్ స్టాగ్రామ్ లో 50 మిలియన్ల మంది ఫాలోవర్లను దాటేశాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఇన్ స్టాలో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ తరువాత ప్రపచంలో అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్లలో ధోనీ మూడో స్థానంలో ఉన్నాడు. తాజాగా కోహ్లీ పై సోషల్ మీడియాలో ఓ ట్రోలింగ్స్ జరుగుతోంది.  50 మిలియన్ ఫాలోవర్స్.. అది ధోనీ అకౌంట్ కాదట. ఫేక్ అంటూ విరాట్ కోహ్లీ ని ట్రోలింగ్ చేస్తున్నారు.

విరాట్ కోహ్లీ పై ధోనీ ఫ్యాన్స్ ట్రోలింగ్స్.. 

విరాట్ కోహ్లీ ఇన్ స్టా గ్రామ్ లో అత్యధిక మంది పాలోవర్స్ ని కలిగిన క్రికెటర్ కావడంతో ధోనీ అభిమానులు అతన్ని ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఇటీవలే విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ కి, టీ 20 క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ధోనీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. కానీ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. 2025 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. వాస్తవానికి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయాల కారణంగా ఈ సీజన్ కి దూరం అయితే.. అతని స్థానంలో ధోనీ కెప్టెన్ గా కొనసాగాడు. గతంలో ధోనీ 2001 నుంచి 2003 వరకు రైల్వేలో టీటీఈ గా పని చేశారట. తన కెరీర్ ప్రారంభంలో పొడవైన జుట్టుతో అందరి అభిమానాలను చూరగొన్నాడు. ఇక  ఫోన్ లకు దూరంగా ఉండేవిధంగా పేర్గాంచిన కెప్టెన్ కూల్ తన జీవితంలోని పలు విషయాలను చాలా అరుదుగా పంచుకుంటాడు. భారత జట్టును అన్ని ఫార్మాట్ లో నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లిన కెప్టెన్ కూడా ధోనీ నే కావడం విశేషం.

Related News

Rohit Sharma: అన్ని ఫార్మాట్స్ లో 5 సెంచరీలకు పైగా చేసిన ఏకైక క్రికెటర్ గా రోహిత్..ఇక ఆసీస్ కు రాబోమంటూ ప్ర‌క‌ట‌న‌

Womens World Cup 2025: ఆస్ట్రేలియా మ‌హిళ‌ల‌ జ‌ట్టుకు లైంగిక వేధింపులు..ఇండియాలో టోర్న‌మెంట్స్ పెట్టొద్దు అంటూ?

IND VS AUS: మూడో వ‌న్డేలో టీమిండియా విజ‌యం..గంభీర్ కు ఘోర అవ‌మానం..ర‌విశాస్త్రి కావాలంటూ !

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ…స‌చిన్ రికార్డు బ్రేక్, హిట్ మ్యాన్ ప్రైవేట్ పార్ట్ పై కొట్టిన కోహ్లీ

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ అర్థ‌సెంచ‌రీలు…60 హ‌ఫ్ సెంచ‌రీలు పూర్తి చేసిన‌ హిట్ మ్యాన్

Virat Kohli: హ‌మ్మ‌య్యా..డ‌కౌట్ కాలేదు, సింగిల్ తీసి కోహ్లీ సెల‌బ్రేష‌న్స్‌…స్మిత్ రికార్డ్ బ‌ద్ద‌లు కొట్టిన‌ హెడ్

Harshit Rana: గిల్ మాట లెక్క‌చేయ‌ని హ‌ర్షిత్ రాణా..రోహిత్ టిప్స్ తీసుకుని 4 వికెట్లు

IND VS AUS, 3rd ODI: 4 వికెట్ల‌తో రెచ్చిపోయిన హ‌ర్షిత్ రాణా..ఆస్ట్రేలియా ఆలౌట్‌, టీమిండియా టార్గెట్ ఎంతంటే

Big Stories

×