E-Paper
Advertisement

Yograj Singh: వాడికి అమ్మాయిల సోకు ఎక్కువైంది, ప్ర‌తి రోజూ 10 కిలో మీటర్లు పరుగెత్తించండి

Yograj Singh: వాడికి అమ్మాయిల సోకు ఎక్కువైంది, ప్ర‌తి రోజూ 10 కిలో మీటర్లు పరుగెత్తించండి
Advertisement

Yograj Singh:  టీమిండియా టి20 ఓపెనర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు రెండు సంవత్సరాలుగా టీమిండియాలో కొనసాగుతున్న అభిషేక్ శర్మ, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసే అభిషేక్ శర్మ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతనిపై చాలామంది విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కోసం సిద్ధమవుతున్న అభిషేక్ శర్మ పై యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు నేతృత్వంలో ట్రైనింగ్ తీసుకున్న అభిషేక్ శర్మకు అమ్మాయిల సోకు ఎక్కువైందని, వాడు రోజుకు 10 కిలో మీటర్లు పరిగెత్తాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే అభిషేక్ శర్మ కెరీర్ మళ్ళీ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు యోగరాజు సింగ్ ( Yograj Singh).

Also Read : Rajasthan Royals Sold: ప‌నికిరాని షేర్లు కొని, త‌న పిల్లలకు రూ.460 కోట్ల ఆస్తి సంపాదించిన షేన్ వార్న్..సన్నాఫ్ సత్యమూర్తి రేంజ్ లో

టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో విఫలమైన అభిషేక్ శర్మ

Advertisement

ఎన్నో అంచనాల నడుమ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కోసం గాను అభిషేక్ శర్మను తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అంతకుముందు జరిగిన అన్ని టోర్నమెంట్స్ లో అభిషేక్ శర్మ అద్భుతంగానే రాణించాడు. అయితే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఇటీవల జరగగా అందులో ఒకే ఒక్క అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. మూడుసార్లు వరుసగా డకౌట్ అయ్యాడు అభిషేక్ శర్మ. ఇలా మొత్తంగా 150 పరుగులు కూడా దాటలేకపోయాడు అభిషేక్ శర్మ. అయితే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా విఫలమైన అభిషేక్ శర్మ పై మాజీ క్రికెటర్లు చాలా సీరియస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ కూడా స్పందించారు. ప్రతి రోజు 10 కిలో మీటర్లు అభిషేక్ శర్మ పరిగెత్తితేనే అతడి కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందని సూచనలు చేశారు.

వాడిని 10 కిలోమీటర్లు పరిగెత్తించండి

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా విఫలమైన అభిషేక్ శర్మ పై చాలా సీరియస్ అయ్యారు యోగరాజ్ సింగ్. వాడికి ఈ మధ్యకాలంలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువైంది.. వాళ్ల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడని మండిపడ్డారు. దీనివల్ల అతనికి కెరీర్ దెబ్బతింటుందని హెచ్చరించారు. అలాగే ప్రతిరోజు రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.. ఈ రీల్స్ చూడడం వల్ల క్రికెట్ పైన ఏకాగ్రత పూర్తిగా తగ్గిపోయింది.. ఈ విషయాన్ని అభిషేక్ శర్మ గ్రహించాలని మండిపడ్డారు. ఇలాగే రీల్స్ చేస్తూ గడిపితే ప్రమాదం తప్పదని హెచ్చరించారు.

Advertisement

ఈ రీల్స్ చేయడం, చూడడం మానేసి రాత్రి 9 గంటలకే అభిషేక్ శర్మ పడుకోవాలని సూచనలు చేశారు. ఇక ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి రోజుకు కిలో మీటర్ నుంచి పది కిలోమీటర్ల వరకు పరిగెత్తాలని వార్నింగ్ ఇచ్చారు యోగరాజ్ సింగ్. లేకపోతే అభిషేక్ శర్మ కెరీర్ నాశనం అవుతుందని హెచ్చరించారు యోగరాజ్ సింగ్. అయితే తన సూచనలు అభిషేక్ శర్మ పాటిస్తాడని… కచ్చితంగా రికవరీ దూసుకు వెళ్తాడని పేర్కొన్నారు. తాను చెప్పిన‌ట్లుగా ఇప్పటి నుంచి ఫాలో అయితే, ఐపీఎల్ లో అభిషేక్ శర్మను కొట్టే మొనగాడు ఉండబోడని కామెంట్స్ చేశారు.

Also Read : Fans On Mohsin Naqvi: న‌ఖ్వీ పెద్ద మోస‌గాడు..PSL టికెట్ల రిఫండ్ డ‌బ్బులు తినేశాడంటూ పాక్ ఫ్యాన్స్ ఫైర్

 

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×