Big Stories

Medaram Jatara 2024: వన దేవతల్ని దర్శించుకున్న 1. 45 కోట్ల మంది భక్తులు

medarm jathara

- Advertisement -

Sammakka Saralamma Jatara 2024: ఈ ఏడాది సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. నాలుగు రోజుల్లోనే దాదాపు కోటిన్నర మంది దర్శించుకున్నారంటే మామూలు విషయం కాదు. మేడారం జనసంద్రాన్ని తలపించింది. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవం.. జాతర నాలుగురోజులు పూజలందుకున్న వన దేవతలు.. శనివారం సాయంత్రం వనప్రవేశం చేయడంతో మహాజాతర ముగిసింది. ఈ నేపథ్యంలో మేడారం నుంచి హుండీలను హన్మకొండలోని టీటీడి కళ్యాణమండపానికి తరలించనున్నారు. అక్కడ దేవదాయ శాఖ అధికారులు ఆదాయాన్ని లెక్కిస్తారు.

- Advertisement -

మేడారంలోని మొత్తం 512 హుండీలను అధికారులు ఏర్పాటు చేసారు. ఫిబ్రవరి 29 నుంచి మేడారం హుండీలు లెక్కింపు చేపట్టనున్నారు. దీంతో పది రోజులు పాటు హుండీల లెక్కింపునకు కసరత్తు ప్రారంభం కానుంది. ఈ మహాజాతరకు రెండునెలల ముందే మేడారాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు సంఖ్యలో సందర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మేడారం జాతర నాలుగు రోజుల్లో 1.45 కోట్ల మంది భక్తులు వనదేవతల్ని దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

గతేడాది 2022 జాతర సందర్భంగా 11.44 కోట్లకు పైగా హుండీ ఆదాయం వచ్చింది. బంగారం 631 గ్రాములు, వెండి 48 కిలోలు భక్తులు సమర్పించారు. అయితే 2020 లో మాత్రం భక్తుల సంఖ్య పెరిగినా ఆదాయం మాత్రం తగ్గింది. కానీ ఈ ఏడాది మాత్రం 2022 జాతరకు మించి ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ సారి రెండు నెలల ముందే మేడారానికి పెద్ద సంఖ్యలో భక్తులు రాక మొదలైంది. ఆదివారం కూడా లక్షల్లో భక్తులు వచ్చి గద్దెల చెంత పూజలు చేశారు. దీంతో ఆదాయం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News