Nagarjuna:సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలామంది దాన్నే ఫాలో అవుతున్నారు . ముఖ్యంగా ఏ విషయం అయినా సరే క్షణాల్లో వైరల్ చేయాలంటే దానికి సోషల్ మీడియాని ఆయుధంగా మలుచుకుంటున్నారు. అలా ప్రపంచ నలుమూలల్లో ఏం జరిగినా సరే క్షణాల్లో మన ముందుంటుంది. అయితే అలాంటి సోషల్ మీడియా ద్వారా ఎంత ఉపయోగముందో అంతే నష్టం కూడా ఉంది. సోషల్ మీడియా వల్ల చాలామంది యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాగే తమ విలువైన సమయాన్ని సోషల్ మీడియాకి కేటాయిస్తూ ఫ్యూచర్ ని కోల్పోతున్నారు. ఇదంతా పక్కన పెడితే..చాలా మంది సెలబ్రెటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. కానీ కొంతమంది మాత్రం అసలు సోషల్ మీడియా మొహం కూడా చూడరు.
సోషల్ మీడియా వాడకం పై నాగార్జున కామెంట్స్..
అలాంటి వారిలో నాగార్జున కూడా ఒకరు.. మరి నాగార్జున సోషల్ మీడియా వాడకపోవడానికి కారణం ఏంటి.. ?సోషల్ మీడియా పై ఆయన అభిప్రాయం ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. నాగార్జున ఓ టాక్ షోలో సోషల్ మీడియా వాడకం గురించి మాట్లాడుతూ.. “నేను ఆరు, ఏడు సంవత్సరాల క్రితం అంటే ట్విట్టర్ కొత్తగా వచ్చిన టైంలో అకౌంట్ ఓపెన్ చేశాను.ఆ తర్వాత ఒకటి రెండు సంవత్సరాల్లో అది నెగిటివ్, ఒపీనియేటెడ్.. ఇక ఆ నోటిఫికేషన్స్ యాక్సెప్ట్ చేస్తే మన జీవితం మొత్తం మార్చేసుకోవాలి.. రేపు ఉదయం నేను ఏ బట్టలు వేసుకోవాలి? ఏం చేయాలి..?ఏం తినాలి.. ?అని ప్రతి ఒక్క విషయం వాళ్లే చెప్తారని అన్నారు.
అందుకే అసహ్యం అంటూ..
కానీ ఒక్క నోటిఫికేషన్ ఆన్ చేస్తే.. ఇలా వాళ్ళు చెప్పింది చేయడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. ఎవరో తెలియని అనామకులు నేను లైఫ్ లో ఎలా ఉండాలో.. ? ఏం చేయాలో కూడా చెప్పడం ఏంటి? అని ఆలోచించుకున్నాను. మన జీవితం ఇంకొకరి హాండోవర్లోకి వెళ్లడం ఏంటి అనే ఆలోచన వచ్చింది. ఆఖరికి నా మీద నాకే అసహ్యం కూడా వేసింది. అందుకే నా లైఫ్ ని నేను హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని, అప్పటినుండి నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ చేసేసాను” అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. అలా నాగార్జున సోషల్ మీడియాకి కాస్త దూరంగా ఉంటాను అని చెప్పారు.అయితే ఈ విషయాన్ని నాగర్జున తన వైల్డ్ డాగ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రానా హోస్ట్ గా చేసిన నెంబర్ 1 యారి విత్ రానా అనే టాక్ షోలో బయటపెట్టారు.
నాగార్జున సినిమాలు..
నాగార్జున సినిమాల విషయానికొస్తే..ఈ ఏడాది కుబేర,కూలీ సినిమాల్లో కీ రోల్స్ పోషించారు. అలాగే ప్రస్తుతం ఈయన తన 100వ సినిమా విషయంలో బిజీలో ఉండడమే కాకుండా.. మరోవైపు ఈ మధ్యనే స్టార్ట్ అయిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కి హోస్టుగా కూడా చేస్తున్నారు. ఇకపోతే తన 100వ సినిమా విషయంలో కాస్త బిజీగా ఉన్న ఎప్పుడు తెరపైకి తీసుకొస్తారో చూడాలి.