BigTV English

7 Seater Car @ Rs 6 Lakhs: రూ. 6 లక్షలకే 7 సీటర్ కారు.. అద్భుతమైన మైలేజీ, ఫీచర్లు!

7 Seater Car @ Rs 6 Lakhs: రూ. 6 లక్షలకే 7 సీటర్ కారు.. అద్భుతమైన మైలేజీ, ఫీచర్లు!


Buy 7 Seater Car in Just Rs 6 Lakhs: ప్రస్తుత కాలంలో భారతీయ మార్కెట్‌లో ఆటోమొబైల్స్ రంగం బాగా అభివృద్ది చెందుతోంది. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వెర్షన్‌ల వాహనాలను మార్కెట్‌లోకి పరిచయం చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే చాలా రకాలైన వెహికల్స్ మార్కెట్‌లోకి వచ్చి వాహన ప్రియులను ఆకర్షించాయి. అందులో 7-సీటర్స్ ఒకటి.

ఈ 7-సీటర్స్ వాహనాలకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో ఈ డిమాండ్ కారణంగా ప్రముఖ కార్ల కంపెనీలు ఈ 7సీటర్ విభాగంలో తమదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నాయి. వాటిలో రెనాల్ట్ కంపెనీ ఒకటి.


ఈ రెనాల్ట్ దాని ట్రైబర్ 7-సీటర్ MPV (మల్టీ-పర్పస్ వెహికల్)తో మార్కెట్‌లో మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఈ కారుకు డిమాండ్‌ కూడా బాగానే ఉంది. అయితే ఈ కారును కొనాలని ప్లాన్ చేస్తున్న వినియోగదారులు.. అధిక ధర కారణంగా వారి ప్లాన్‌ను మార్చుకుంటుంటారు. అయితే దీనిని ఇప్పుడు అధిక ధరలో కొనాల్సిన పనిలేదు. ఈ కారుని ఇప్పుడు అతి తక్కువ ధరలోనే సొంతం చేసుకోవచ్చు.

READ MORE: కేవలం రూ. 10 లక్షలకే 7- సీటర్ కారు.. అద్భుతమైన మోడల్స్.. ఓ లుక్కేయండి!

రెనాల్ట్ ట్రైబర్ వేరియంట్లు, ధర:

రెనాల్ట్ ట్రైబర్ మొత్తం RXE, RXL, RXT, and RXZ వంటి 4 ట్రిమ్ స్థాయిలలో లభిస్తుంది. ఇది 8 వేరియంట్లను కలిగి ఉంది. కాగా ఈ ట్రైబర్ ధరలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. దీని బేస్ మోడల్ ధర అయితే మరీ తక్కువ అనే చెప్పాలి. దీని బేస్ మోడల్.. RXE మాన్యువల్ పెట్రోల్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.6.33 లక్షలతో ప్రారంభమవుతుంది.

అలాగే దీని టాప్ వేరియంట్ ధర రూ.8.97 లక్షలతో అందుబాటులో ఉంది. ఈ ట్రైబర్‌ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో పాటు 999cc 1.0-లీటర్ సహజంగా ఆశించిన పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఇంజన్లు గరిష్టంగా 100 PS పవర్, 160 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలవు. ఈ రెనాల్ట్ ట్రైబర్‌ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను కలిగి ఉంది. ఇక దీని ఇంధన సామర్థ్యం విషయానికి వస్తే.. MPV 18.2 kmpl నుండి 20 kmpl వరకు మైలేజీని అందిస్తుంది.

READ MORE: 35 కి.మీ మైలేజీ గల కారు ధరను తగ్గించిన మారుతి.. ఎంతంటే?

వీటిలో 14-అంగుళాల స్టీల్ వీల్స్, LED DRLs ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్ ల్యాంప్స్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, సెంట్రల్ లాకింగ్, పవర్ విండోస్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల వైపర్‌లు, ఆడియో సిస్టమ్ వంటివి అందించారు.

Tags

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×