Divvela Madhuri About Marriage With Duvvada: దివ్వెల మాధురి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈమెకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఈ మధ్య బిగ్ బాస్ షో కారణంగా ఆమె పేరు బాగా వినిపిస్తుంది. ఈ సారి బిగ్‌బాస్ తెలుగు 9లోకి ఆమె కంటెస్టెంట్గా రాబోతుందంటూ వార్తలు వినిపించాయి. తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందనే విషయాన్ని కూడా ఇటీవల ఓ ఇంటర్య్వూలో కన్ఫాం చేసింది. అయితే షో వెళ్లాలా? వద్దా? అని తాను ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పింది. అదే విధంగా దువ్వాడ శ్రీనివాస్‌తో పరిచయం, ప్రేమ, పెళ్లి, బిగ్‌బాస్ ఆఫర్‌పై స్పందించింది.
తామిద్దరం ఎప్పుడు ప్రపోజ్ చేసుకోలేదని, తన టఫ్ టైంలో తనకు తోడుగా నిలబడ్డాను.. అప్పటి నుంచి మా మధ్య బంధం బలపడింది. అలా మేమిద్దరం ఒక్కటయ్యాం.. అంతేకానీ, ముందుగా ప్రపోజ్ చేసుకోవడం ఏం లేదు. అయితే వీరద్దరి పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ.. తమ మధ్య విడిపోలేని బంధం ఏర్పడిందని చెప్పింది. శ్రీనివాస్‌తో ఉన్నప్పటి నుంచి తాను ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వలేదని చెప్పింది. “ఎందుకో తెలియదు మా మధ్య మంచి బాండ్ ఏర్పడింది. మాది జన్మన్మల బంధం ఏమైనా ఉందేమో. మేమిద్దరం ఒకరికొకరం లేకుండ ఉండలేం. మాకు ఇప్పటి వరకు దూరంగాద ఉండాల్సి రాలేదు. అయితే ఇటీవల బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్‌కి వెళతాననని అడిగితే..
‘నీ ఇష్టం నువ్వు వెళ్లాలనుకుంటే వెళ్లు. కానీ, నువ్వు లేకుండ నేను ఉండలేను’ అన్నారు. నాకు బిగ్‌బాస్ వెళ్లాలని కోరిక. కానీ, ఆయన నేను లేకుండ ఉండేలేనిన చెప్పడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఒకవేళ బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఆఫర్ వస్తే వెళతారా? అని అడగ్గా.. ఇద్దరం కలిసే వెళ్తాం.. లేదంటే వెళ్లమని వెల్లడించింది. ఇక పెళ్లి ఎప్పుడు అని అడిగితే.. మాత్రం తామ మనసులు కలిశాయని, తాను ఎప్పటికీ దువ్వాడ శ్రీనివాస్.. మాధురినే అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. మానసికంగా తాము ఎప్పటికే ఒక్కటేనని, తమకు పెళ్లి అవసరం లేదు అని చెప్పింది. కానీ, పెళ్లి చేసుకుంటారా? లేదా? అనే విషయాన్ని మాత్రం కన్‌ఫాం చేయలేదు.
సోషల్ మీడియా కపుల్గా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి పాపులారిటీ సంపాదించుకున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వీరిద్దరు తెలియని వారు లేరు. సోషల్ మీడియాలో వీరు చేసి హంగామా అంతా ఇంత కాదు. ఎక్కడ చూసిన జంటగా కనిపిస్తూ సందడి చేస్తుంటారు. దీంతో ఈ జంట ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఇక వీరి ప్రేమ వ్యవహరం గురించి తెలిసిందే. ఇద్దరికి వేరు వేరుగా పెళ్లయినా.. కుటుంబంలో నెలకొన్ని పరిణామాల నేపథ్యంలో వీరిద్దరు ఒక్కటయ్యారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోయినా.. సహాజీవనం చేస్తున్నారు. ఏపీలో వీరి వివాదం తర్వాత హైదరాబాద్లో వచ్చి సెటిలైయ్యారు . ప్రస్తుతం పాలిటిక్స్ పక్కన వీరు ఇటీవల వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం పర్సనల్, ప్రోఫెషనల్ లైఫ్‌ని ఈ కపుల్ హ్యాపీగా లీడ్ చేస్తున్నారు.