Nepal Revolt: నేపాల్ మరో బంగ్లాదేశ్‌గా మారుతుందా? యువత చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారుతోందా? ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసిన తర్వాత యువత శాంతించలేదా? ఆ అధ్యక్షుడు, ప్రధానిమంత్రి నివాసాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారా? కచ్చితంగా నేతలు రాజీనామా చేయాల్సిందేనని అంటున్నారు. అసలు నేపాల్‌లో ప్రస్తుత పరిస్థితి ఏంటి?
నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినా ఆందోళనకారులు ఏ మాత్రం శాంతించలేదు. తాజాగా మంగళవారం ఉదయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా నిరసనకారులు రెచ్చిపోయారు. రాజధాని ఖాట్మండ్‌లో అధ్యక్షుడు, ప్రధానమంత్రి నివాసాలను ముట్టడించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన యువత, వారిని నివాసాలకు నిప్పుపెట్టారు. ప్రదర్శనకారులు అనేక మంది రాజకీయ నేతల ఇంటిపైకి చొరబడ్డారు. నేపాల్ ప్రధాని కెపి ఓలి, కమ్యూనికేషన్ మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్ ప్రైవేట్ నివాసాన్ని తగల బెట్టారని స్థానిక మీడియా ది హిమాలయన్ పేర్కొంది. నిరసనకారులు రాజధాని రోడ్లను దిగ్బంధించారు.
టైర్లను తగులబెట్టడంతో పోలీసులు టియర్ గ్యాస్‌తో ప్రయోగించారు. ఈ క్రమంలో బలగాలకు-ఆందోళనకారుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఆ దేశ అధ్యక్షుడు, ప్రధాని నివాసాలను ఆందోళన కారులు చుట్టిముట్టారు. నేపాలీ మాజీ ప్రధానులు ప్రచండ, షేర్ బహదూర్ దేవుబా, ఇంధన మంత్రి దీపక్ ఖడ్కా ఇళ్లను నిరసనకారులు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.
ALSO READ: నేపాల్ నిప్పుకణిక సూడాన్.. ఆయన పిలుపు ప్రభుత్వానికి వణుకు
ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని ప్రధాని ఓలి కోరుతున్నారు. మంగళవారం సాయంత్రం అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితికి అర్థవంతమైన ముగింపుకు సంబంధిత పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. అక్కడ పరిస్థితులు గమనించినవారు మరో నేపాల్ మరో బంగ్లాదేశ్‌గా మారే అవకాశముందని అంటున్నారు.
బంగ్లాదేశ్‌లో ఆ దేశ ప్రజలు చేసిన ఉద్యమాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటి పరిస్థితులు నెలకొన్నట్లు అక్కడి పత్రికలు చెబుతున్నాయి. నేతలంతా రాజీనామా చేయాల్సిందేనని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు అరడజను మంది మంత్రులు రాజీనామాలు చేశారు. పరిస్థితులు చేజారిపోవడంతో ప్రభుత్వ పెద్దలు అలర్ట్ అయ్యారు.
ఆర్మీ అధికారులతో ప్రధాని శర్మ మాట్లాడారు. అధికారిక నివాసాల నుంచి మంత్రులను హెలికాఫ్టర్ ద్వారా మరొక ప్రాంతానికి తరలిస్తున్నారు. ఖాట్మండ్ ఎయిర్‌పోర్టుని అధికారులు మూసివేశారు. అక్కడ 300 మంది ఆర్మీ సిబ్బంది మోహరించారు. నేపాల్‌కు వచ్చేవి.. అక్కడి నుంచి వివిధ దేశాలకు వెళ్లే విమానలను రద్దు చేశారు అధికారులు.
Chaos in Nepal 🇳🇵🔥 protesters set fire to the Prime Minister’s residence as tensions erupt. Government officials are evacuating via helicopter from Kathmandu airport. Major upheaval in the heart of the Himalayas. #Nepal #Protests #Kathmandu #BreakingNews pic.twitter.com/NmJtr0ngBJ
— ceanpolitics (@ceanglobal) September 9, 2025