Jani Master As Contestant in Bigg Boss 9: బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలైంది. నిన్న (సెప్టెంబర్ 7) బిగ్ బాస్ 9 తెలుగు() కొత్త సీజన్ గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ షో.. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌజ్ లోకి వచ్చారు. అందులో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది సామాన్యులు. ఈ సారి హౌజ్ లో రణరంగమే అంటూ ముందు నుంచి బిగ్ బాస్ పై హైప్ ఇస్తూ వస్తున్నాడు నాగార్జున. ఈసారి సామాన్యులు వర్సెస్ సెలబ్రిటీలంటూ కొత్త థీమ్ సెట్ చేసింది బిగ్ బాస్ టీం. దీంతో హోస్ట్ నాగార్జున చెప్పినట్టుగానే ఊహించని ట్విస్ట్స్, మలుపుతో షో ఎంతగా రక్తి కట్టిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక కంటెస్టెంట్స్ విషయంలో ఈసారి మంచి ఫేమస్ సెలబ్రిటీలు వస్తున్నారనుకుంటే.. 9 మందిలో పెద్దగా తెలియలని మొహాలే ఎక్కువ. బాగా తెలిసిన సెలబ్రిటీలు పెద్దగా లేకపోవడంతో ఆడియన్స్ కాస్తా నిరూత్సాహం మొదలైంది. ఆడియన్స్ ని హ్యాపీ చేసే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే ఒక్క శ్రేష్టి వర్మనే. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై వేధింపుల ఆరోపణలతో శ్రేష్టి వర్మ ఎంతటి సెన్సేషన్ అయ్యిందో తెలిసిందే. ఆమె ఉండటంతో హౌజ్ లో కాస్తా టఫ్ దొరుకుందని ఆశపడుతున్నారు. అయితే ఆమెతో పాటు జానీ మాస్టర్ ని కూడా కంటెస్టెంట్ తీసుకువస్తే.. షో మరింత రక్తి కట్టేదని బిగ్ బాస్ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సారి కంటెస్టెంట్స్ లిస్ట్ జానీ మాస్టర్ కూడా ఉన్నారట. ఆయన కూడా హౌజ్ లోకి రావాల్సి ఉందట. కానీ చివరిలో అసలు జానీ మాస్టర్ హ్యాండ్ ఇచ్చాడట.ఇంతకి అసలు విషయం ఏంటంటే.. ఈసారి హౌజ్లోకి మంచి ఫేమస్, కాంట్రవర్సల్ కంటెంట్ ఇచ్చే సెలబ్రిటీలను సంప్రదించిందట బిగ్ బాస్ టీం. అందులో వివాదస్పద నటి కల్పిక గణేష్, కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా ఉన్నారట. మొదట బిగ్ బాస్ టీం ఈ రియాలిటీ షో కోసం జానీ మాస్టర్ ని సంప్రదించిందట. కానీ, రెమ్యునరేషన్ కూడా భారీగా ఆఫర్ చేశారట. హౌజ్ లోకి వచ్చేందుకు ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలు తప్పుని ప్రూవ్ చూసుకునేందుకు ఇది మంచి అవకాశమని, ఈ రియాలిటీ షో ద్వారా తనేంటో నిరూపించుకుంటానని కూడా సన్నిహిత వర్గాల దగ్గర చెప్పుకున్నాడు.
అయితే బిగ్ బాస్ టీం జానీ మాస్టర్ తర్వాత శ్రేష్టి వర్మను కూడా సంప్రదించారట. ఆమె కూడా హౌజ్ లోకి వచ్చేందుకు ఒకే చెప్పింది. ఇక వీరిద్దరి హౌజ్ లో దింపి.. ఆడియన్స్ ని ఆకట్టుకుని మంచి టిఆర్సీ రేట్ కొట్టేయాలని బిగ్ బాస్ టీం ప్లాన్ చేసింది. కానీ, చివరిలో వీరి ఆశలపై జానీ మాస్టర్ నిరూచల్లారు. శ్రేష్టి వర్మ కూడా వస్తుందని తెలిసి ఆయన ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశారట. తను వస్తే.. తాను బిగ్ బాస్ లోకి రాననిన కండిషన్ పెట్టారట. ఈ కండిషన్ కి బిగ్ బాస్ టీం సముఖంగా లేకపోవడంతో జానీ మాస్టర్ చివరిలో డ్రాప్ అయ్యారట. ఇక ఇద్దరిలో శ్రేష్టి వర్మ వస్తనే హౌజ్ లో మంచి స్టప్ దొరుకుందట.. తను వస్తేనే ప్లస్ అవుతుందని భావించిన టీం.. జానీ మాస్టర్ ని వదులకునేందుకు రెడీ అయ్యిందట. అలా బిగ్ బాస్ హౌజ్ లోకి రావాల్సిన జానీ మాస్టర్… చివరిలో డ్రాప్ అయ్యి.. షాకిచ్చాడు. ఈ విషయం తెలిసి ఆడియన్స్.. అబ్బా ఆయన కూడా హౌజ్ లోకి వస్తే బాగుండేది.. షో మంచి కంటెంట్ ఉండేదంటూ అభిప్రాయ పడుతున్నారు.
Also Read: Divvala Madhuri: దివ్వెల మాధురి ఎక్కడ? పెళ్లి కోసమే బిగ్ బాస్ ఎంట్రీ ఆలస్యం.. ఆమె ఏం చెప్పిందంటే