CM Revanth: పొలిటికల్ గా ఏ చిన్న పదివి ఉన్నా.. తన పలుకుబడిని ఉపయోగించుకుని అడ్డంకులు రాకుండా చూసుకుంటారు. గ్రామాల్లో రోడ్ల విస్తరణ పనులు అయినా.. భూమి నుంచి ఏదైనా కాలువ ప్రాజెక్ట్ వెళ్తే అయినా.. అధికారులు పెద్దగా పట్టించుకోరు. రాజకీయ పదవి ఉంది కదా.. అని సింపుల్ వదిలేస్తారు. అధికారులు నిజాయితీ ఉందామని ముందుకు వెళ్తే ఇక అంతే సంగతులు.. వార్నింగుల మీద వార్నింగులు తప్పవు. అలాంటిది ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డి పల్లిలో అధికారులు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా ఏకంగా ముఖ్యమంత్రి ప్రహారీ గోడనే కూలగొట్టారు.
అధికారులు ఎలాంటి భయానికి లోను కాకుండా సీఎం ఇంటి ప్రహరీ కూల్చడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అధికారులు చేస్తున్న పనిని ముఖ్యమంత్రి అడ్డుకోకుండా గోడ కూల్చడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వైఖరి అందరికీ ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రానికి సీఎం హోదాలో ఉండి కూడా సొంత గ్రామంలో తన ఇంటి విషయంలో చూపించిన చొరవను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, పలువురు కీలక వ్యక్తులు మెచ్చుకుంటున్నారు. తన ఇంటి ప్రహారీ గోడ ముఖ్యం కాదు.. విలేజ్ డెవలప్ మెంటే ముఖ్యమంటూ.. అందరికీ ఒకే రూల్ ఉండాలని వ్యవహరించిన సీఎం తీరును అందరూ అభినందిస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి కదా మనకు ఉండాల్సింది అని కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ: Jobs in Indian Railways: 32,438 ఉద్యోగాలు.. మంచి వేతనం, ఎగ్జామ్స్ డేట్స్ వచ్చేశాయ్..
సీఎం ఇంటి ప్రహరీ గోడను కూలుస్తున్న ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ‘ప్రజా నాయకుడు అంటే ఇలా ఉండాలి’ అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. గ్రామ అభివృద్ధి కోసం తన వ్యక్తిగత ఆస్తులను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడడం గ్రేట్ అని రాసుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లోనూ సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఇదీ మా సీఎం నిబద్దత అని రాసుకొచ్చింది. పాలనలో నిజాయితీ, పారదర్శకత ఉంటే ప్రజలు ఎప్పుడు జేజేలు పలుకుతారు. అందుకే ఇది చిన్న సంఘటన అయినా వీడియో తెగ వైరల్ గా మారింది.
ALSO READ: Karimnagar News: రాష్ట్రంలో దారుణ ఘటన.. ఫీవర్ వచ్చిందని ఆస్పత్రికి వెళ్తే.. మత్తు ఇచ్చి..?