Bigg Boss 9 Rithu Chowdary Injuried: బిగ్ బాస్ 9 తెలుగు రెండో రోజుకు వచ్చింది. ఏ సిజన్ అయిన కంటెస్టెంట్స్ మధ్య పరిచయాలు, ముచ్చట్లతో మొదలై మెల్లిగా గొడవల వరకు వెళుతుంది. కానీ, సీజన్ లో మాత్రం వచ్చిరాగానే గొడవలు పడ్డారు. మాస్క్ మ్యాన్, ఇమ్మాన్యుయేల మధ్య మాటల యుద్దమే జరిగింది. ఇక లవ్ ట్రాక్స్ కాస్తా టైం పడుతుంది. పరిచయమై.. ఆ తర్వాత ఒకరికిఒకరు ఫుల్ అర్థం చేసుకున్నాక.. మెల్లిగా ఇంట్రెస్ట్ చూపిస్తూ.. లవ్ ట్రాక్ ఎక్కుతారు. కానీ, సీజన్ లో రెండో రోజుకే రీతూ చౌదరి లవ్ ట్రాక్ మొదలెట్టింది. కామనర్స్ సోల్జర్ పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్ లతో పులిహోర కలుపుతుంది. అటూ వారు సైతం.. రీతూ చౌదరిని ఇంప్రెస్ చేయడానికి చేయాల్సినవన్ని చేస్తున్నారు.
ఇలా రెండు రోజుల్లోనే హౌజ్ లో గొడవలు, లవ్ ట్రాక్స్ మొదలెట్టడంతో సీజన్ పై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా రితూ చౌదరి లవ్ ట్రాక్స్ తో ఆడియన్స్, ట్రోల్స్ మంచి టఫ్ ఇస్తుంది. ఈ ట్రయాంగిల్ లవ్ ట్రాక్ ఎక్కడి వరకు వెళుతుందోనని అంతా వారి గురించి మాట్లాడుకుంటారు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ హౌజ్ లో ఓ ప్రమాదం జరిగింది. నిన్న నామినేషన్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక టాస్క్ ఘట్టం మొదలైంది. అయితే ఈ టాస్క్ లో రితూ చౌదరి గాయపడిందట. కామనర్స్, సెలబ్రిటీ మధ్య జరిగిన ఫిజికల్ టాస్క్ లో రీతూ చౌదరి కి గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే వాటి తీవ్రత ఎంతనేది మాత్రం తెలియదు. మరి గాయాలతోనే టాస్క్ కంటిన్యూ చేసిందా? డ్రాప్ అయ్యిందా? అనేది తెలియదు. ఒకవేళ అవి తీవ్ర గాయాలైతే మాత్రం రితూ చౌదరి హౌజ్ నుంచి బయటకు రాక తప్పదు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఇవాళ్లి ఎపిసోడ్ వచ్చే వరకు వేయిట్ చేయాల్సిందే.
Also Read: Bigg Boss Telugu 9: హౌజ్‌లోకి జానీ మాస్టర్ కూడా.. చివరిలో ట్విస్ట్.. శ్రేష్టి వర్మ ఎంట్రీతో..
కాగా మొదట సీరియల్స్ తో బుల్లితెరపై అలరించిన ఆమె ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్ గా మారింది. సీరియల్స్ లో సైడ్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం లేక.. బయటకు వచ్చిన ఆమె ఆ తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ సందడి చేసింది. ఆమె గ్లామర్ కి, డ్యాన్స్ మంచి ఫాలోయింగ్ పెరిగింది. అలా సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ భామ.. జబర్దస్త్ కామెడీ షోలోనూ కనిపించింది. జబర్దస్త్ లో కొంతకాలం లేడీ కంటెస్టెంట్స్ చేసిన ఆమె.. ఆ తర్వాత అడపదడపా ఈవెంట్స్ చేస్తూ గుర్తింపు పొందింది. ఆ తర్వాత ప్రేమ, పెళ్లితో వార్తల్లో నిలిచిన సెన్సేషన్ అయ్యింది. ఆ తర్వాత బెట్టింగ్ యాప్ కేసులోనూ రీతూ చౌదరిపై కేసు నమోదైంది. అలా సోషల్ మీడియాలో ఫాలోయింగ్.. రియాలిటీ లైఫ్ వివాదంతో ఈమె బాగా ఫేమస్ అయ్యింది. అదే గుర్తింపు ఇప్పుడు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో అడుగుపెట్టిన ఆమె తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంటుంది. మరి మున్ముందు రీతూ ఆట, పాట ఎలా ఉండబోతుందనేది ప్రేక్షకుల్లో ఆసక్తి సంతరించుకుంది.