BigTV English

Magic Movie Telugu : నాగవంశీకి ‘మ్యాజిక్’ లేదు.. మరో 10 కోట్లు లాస్ అయినట్టేనా ?

Magic Movie Telugu : నాగవంశీకి ‘మ్యాజిక్’ లేదు.. మరో 10 కోట్లు లాస్ అయినట్టేనా ?

Magic Movie Telugu : మూవీ సక్సెస్ అయినా… డిజాస్టర్ అయినా… ఎప్పుడూ వార్తల్లో ఉండే ప్రొడ్యూసర్ నాగవంశీ. సాధారణంగా సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో చేసే ప్రమోషన్ ఈవెంట్స్‌లో నాగవంశీ చేసే స్పీచ్ తెగ వైరల్ అవుతాయి. అవే, సినిమా రిలీజ్ తర్వాత ట్రోల్స్ అవుతాయి. ఇవి పక్కన పెడితే, నాగవంశీ ఈ మధ్య దాదాపు అన్ని సినిమాలు ఫెయిల్యూర్స్ అవుతున్నాయి.


ఎన్నో హోప్స్ పెట్టుకున్న కింగ్‌డం మూవీ కమర్షియల్‌గా సక్సెస్ అవ్వలేకపోయింది. 80 కోట్లు పెట్టి వార్ 2 మూవీ రైట్స్ తీసుకుంటే, అది కూడా ఇక్కడ చేతులెత్తేసింది. ఇప్పుడు నాగవంశీకి ఓ సినిమా వల్ల మరో 10 కోట్లు నష్టం వచ్చేలా ఉందని తెలుస్తుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం…

సాధారణంగా సినిమా ఈవెంట్స్‌లో హీరో స్పీచ్‌ల కోసం ఎదురుచూస్తారు. కానీ, ఆ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ నాగవంశీ ఉంటే… ఆయన స్పీచ్ కోసం ఎదురుచూస్తారు. ఆయన ట్విట్టర్‌లో ఓ చిన్న ట్వీట్ వేసినా… దాని కింద ఉండే రచ్చ కూడా వేరే రేంజ్‌లో ఉంటుంది. అంతటి రేంజ్ ఉన్న ప్రొడ్యూసర్ ఇప్పుడు వరుసగా ఫెయిల్యూర్స్‌ను ఫేస్ చేస్తున్నాడు. కింగ్‌డం తో పాటు వార్ 2 కూడా నాగ వంశీకి హ్యాండ్ ఇచ్చింది. అయితే, కొత్త లోక చాప్టర్ 1 చంద్ర మూవీ అయితే నాగ వంశీకి మంచి రిజల్ట్ ఇచ్చింది. ఈ సినిమాకు ప్రస్తుతం సూపర్ రెస్పాన్స్ వస్తుంది.


మ్యాజిక్ చేస్తా అనుకున్నారు.. కానీ లాస్ ?

ఇదిలా ఉండగా, ఓ సినిమా వల్ల నాగవంశీ దాదాపు 10 కోట్ల వరకు నష్టపోతున్నట్టు తెలుస్తుంది. అది ఏ సినిమా అంటే.. మ్యాజిక్. ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం చేశాడు. నిజానికి కింగ్‌డం కంటే ముందే ఈ సినిమా రావాలి. కానీ, రీ షూట్స్, రీ టేక్స్, ప్యాచ్ వర్క్ అంటూ అన్నీ ఎక్ట్స్రా పనుల వల్ల లేట్ అవుతూ వచ్చింది. బడ్జెట్ పెరిగిపోయింది. అన్నీ చేసినా.. మ్యాజిక్ అవుట్ పుట్ సరిగ్గా రాలేదని సమాచారం.

మ్యాజిక్‌లో స్టార్ కాస్ట్ అండ్ క్రూ ?

గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో స్టార్ కాస్ట్ అండ్ క్రూ పని చేసింది. మెయిన్ లీడ్‌గా సారా అర్జున్ నటించింది. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఓ పాత్ర చేసిన ఈ అమ్మాయికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. అందుకే ఈ సినిమాలో మెయిన్ లీడ్ తీసుకున్నారు.

అలాగే, మ్యూజిక్ సెన్సేషన్.. అనిరుధ్ రవిచంద్రన్ ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చాడు. అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్ హైప్ తెస్తుంది అనుకున్నారు.

మ్యాజిక్‌ను వదిలి కింగ్‌డం ?

మ్యాజిక్ చేస్తూనే కింగ్‌డం పనులు కూడా స్టార్ట్ చేశాడు గౌతమ్ తిన్ననూరి. విజయ్ దేవరకొండతో షూటింగ్ స్టార్ట్ చేసి రిలీజ్ కూడా చేశారు. కానీ, మ్యాజిక్ ను మాత్రం రిలీజ్ చేయలేదు. అయితే, నాగ వంశీకి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి కింగ్‌డం మూవీకి ముందు మంచి సంబంధాలు ఉండేవట. అందుకే, ఏది జరిగినా… మ్యాజిక్ మూవీని రిలీజ్ చేయాలని అనుకున్నారట. కింగ్‌డం కంటే ముందుగా మ్యాజిక్ అనుకున్నారు కానీ, అప్పుడు అవ్వలేదు.

కింగ్‌డం తర్వాత మ్యాజక్ రిలీజ్‌ అవ్వలేదు ?

కింగ్‌డం కంటే ముందు అవ్వలేదు. కింగ్‌డం తర్వాత అయినా… మ్యాజిక్ మూవీని రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, కింగ్‌డం రిజల్ట్ ప్రభావం ఈ మ్యాజిక్ మూవీ రిలీజ్ పై పడింది. కింగ్‌డం ఫలితం వల్ల నిర్మాత నాగవంశీ – డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మధ్య ఉన్న సంబంధాలు కాస్త దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. దీంతో ఆ సినిమా ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టినట్టు తెలుస్తుంది.

నాగవంశీకి 10 కోట్లు లాస్ అయినట్టేనా ?

ఈ సినిమా రిలీజ్ ఆగిపోవడంతో, నిర్మాత నాగవంశీకి దాదాపు 10 కోట్ల నష్టం వచ్చినట్టేనా అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే, ఈ సినిమాను నాగవంశీ దాదాపు 10 కోట్లు పెట్టి నిర్మించాడు. దీంట్లో… రీ షూట్స్, రీ టేక్స్, ప్యాచ్ వర్క్ బడ్జెట్ కూడా ఉందట.

ఓటీటీ రిలీజ్ అయినా ఉంటుందా ?

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఆ మూవీకి వచ్చిన అవుట్ పుట్ చూసిన తర్వాత మ్యాజిక్ థియేట్రికల్ రిలీజ్ అవ్వడం చాలా కష్టమే అని అంటున్నారు. కనీసం ఓటీటీ రిలీజ్ కి ఇచ్చిన పోయిన 10 కోట్లల్లో ఎంతో కొంత రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా… అని అంటున్నారు. అలా అవ్వాలి అంటే, నాగ వంశీ – గౌతమ్ తిన్ననూరి మళ్లీ టీమ్ అప్ అయి… అలాంటి ప్రయత్నాలు చేయాలి. మరి చేస్తారా ?

Related News

SYG Shooting: హమ్మయ్యా.. షూట్ స్టార్ట్ అయింది… బాలీవుడ్ స్టార్‌ని ఢీ కొడుతున్న సుప్రీం హీరో

Film industry: బడ్జెట్ తక్కువ.. లాభమెక్కువ.. రికార్డు సృష్టించిన చిత్రాలివే!

Telugu Hero Movie : ప్లాప్ హీరో – డిజాస్టర్ డైరెక్టర్… ఇద్దరు కలిస్తే ఇంకేమైనా ఉందా ?

Tollywood: వ్యాపారవేత్తలకు అల్లుళ్ళుగా మారిన టాలీవుడ్ హీరోలు వీరే!

Teja Sajja: మరోసారి మహేష్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసిన తేజ సజ్జా.. మిరాయ్ పై ఎఫెక్ట్..

Nagarjuna: అందుకే సోషల్ మీడియా అంటే అసహ్యం.. నాగార్జున కీలక వ్యాఖ్యలు!

×