BigTV English

Bigg Boss 9 Remuneration : సెలబ్రిటీస్, కామనర్స్, హోస్ట్… ఒక్కొక్కరికి వారానికి రెమ్యూనరేషన్ ఎంతంటే ?

Bigg Boss 9 Remuneration : సెలబ్రిటీస్, కామనర్స్, హోస్ట్… ఒక్కొక్కరికి వారానికి రెమ్యూనరేషన్ ఎంతంటే ?

Bigg Boss 9 Remuneration: ప్రతి ఏడాది బుల్లితెర ఆడియన్స్ ను అలరించడానికి వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సరికొత్త సీజన్లతో ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 9వ సీజన్ కూడా ప్రారంభం అయింది. అలా ఈసారి ఏకంగా 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా.. 9 మంది సెలబ్రిటీలు సత్తా చాటడానికి వచ్చేశారు. ఇక్కడ కామనర్స్ ని హౌస్ ఓనర్స్ గా, సెలబ్రిటీలను టెనెంట్స్ గా విభజించి.. టాస్కులు నిర్వహిస్తున్నారు బిగ్ బాస్. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. ఇప్పుడు రెండవ ఎపిసోడ్ కూడా ఈరోజు రాత్రి స్టార్ మా వేదికగా ప్రసారం కాబోతున్న విషయం తెలిసిందే. అంతేకాదు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్ స్టార్ వేదికగా కూడా ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ షోలో హౌస్ లోకి తమ పర్ఫామెన్స్ తో అలరించడానికి అడుగుపెట్టిన సెలబ్రిటీలు, కామనర్స్ కి ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.


సెలబ్రిటీల రెమ్యూనరేషన్ లిస్ట్..

ఇకపోతే ఒక్కొక్క వారానికి, ఒక్కొక్కరికి వారి ఫేమ్ దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ నిర్వహికులు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. మరి సెలబ్రిటీలుగా 9మంది హౌస్ లోకి అడుగుపెట్టగా.. ఎవరికి ఎంత రెమ్యూనరేషన్ వారానికి ఇస్తున్నారు? ఇందులో ఎవరికి అత్యధికంగా ఇస్తున్నారు అనే విషయం ఎప్పుడు చూద్దాం.

భరణి శంకర్ (Bharani Shankar).. స్రవంతి సీరియల్ తో కెరియర్ మొదలుపెట్టి.. అటు సినిమాలలో కూడా అలరించిన ఈయన.. నాగబాబు ఫ్రెండ్ గా మరింత పాపులారిటీ అందుకున్నారు. ఈయనకు వారానికి రూ.3.5 లక్షల రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.


ఆశా షైనీ(Asha Saini).. అలియాస్ ఫ్లోరా షైనీగా పేరు సొంతం చేసుకున్న ఈమె లక్స్ పాప అంటూ బాలకృష్ణ సరసన నటించి మెప్పించింది. ఈమెకు వారానికి రూ.3లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.

సంజన గల్రానీ(Sanjana Garlani).. ప్రముఖ హీరోయిన్ నిక్కీ గల్రానీ సోదరిగా, ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి వదినగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. గతంలో ఒక కేసులో ఏఐ నిందితురాలుగా ఉన్న విషయం తెలిసింది.ఇప్పుడు హౌస్ లోకి అడుగుపెట్టిన ఈమెకు వారానికి రూ.2.75 లక్షలు రెమ్యూనరేషన్ గా ఇస్తున్నారు.

రీతూ చౌదరి (Rithu chowdhary).. సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత జబర్దస్త్ షో తో మరింత పాపులారిటీ అందుకున్న ఈమె.. సీరియల్స్ లో కూడా నటించింది. మొన్నా మధ్య బెట్టింగ్ కేసులో కూడా ఇరుక్కున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమెకు వారానికి రూ.2.5 లక్షల రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.

సుమన్ శెట్టి (Suman Shetty).. తేజ దర్శకత్వంలో పలు చిత్రాలలో నటించి ఆకట్టుకున్న ఈయన తెలుగు, తమిళ్, కన్నడ, భోజ్ పురి అంటూ 300కు పైగా చిత్రాలలో నటించారు. ఇప్పుడు బిగ్బాస్ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సుమన్ శెట్టికి రూ.2.5 లక్షలు వారానికి రెమ్యూనరేషన్ గా ఇస్తున్నారు.

ఇమ్మానుయేల్ (Emmanuel).. జబర్దస్త్ కామెడీ షోతో వెలుగులోకి వచ్చిన ఇమ్మానుయేల్ ప్రస్తుతం వారానికి రూ.2.25 లక్షలు సొంతం చేసుకోనున్నారు.

రాము రాథోడ్ (Ramu Rathod).. యూట్యూబర్గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ జానపద కళాకారుడు “రాను బొంబాయి కి రాను” అనే పాటతో ఏకంగా యూట్యూబ్ ద్వారా కోటి సంపాదించి దేశవ్యాప్తంగా పేరు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈయనకు వారానికి రూ.2లక్షల చొప్పున రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.

తనూజ గౌడ (Thanuja Gowda).. అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో ప్రారంభమైన ముద్దమందారం సీరియల్ ద్వారా కెరియర్ను ఆరంభించిన తనూజ గౌడ కి రూ.2.5 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.

శ్రేష్టి వర్మ (Sresti varma).. జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పేరు సొంతం చేసుకొని.. ఇప్పుడు లేడీ కొరియోగ్రాఫర్ గా చలామణి అవుతున్న శ్రేష్టి వర్మకు రూ.2లక్షల రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.

కామనర్స్ రెమ్యూనరేషన్..

కామనర్స్ కేటగిరీలో హౌస్ లోకి మొత్తం 6 మంది అడుగుపెట్టారు. వీరికి కూడా వారానికి చొప్పున రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.
సోల్జర్ కళ్యాణ్ – రూ. 70,000
మాస్క్ మాన్ హరిత హరీష్ – రూ. 70,000
దమ్ము శ్రీజ – రూ. 70,000
డిమోన్ పవన్ – రూ. 70,000
ప్రియా శెట్టి – రూ. 70,000
మర్యాద మనీష్ – రూ. 70,000

హోస్ట్ నాగార్జున రెమ్యూనరేషన్:

బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ (NTR)హోస్ట్ గా ప్రారంభం అవ్వగా.. సీజన్ 2 కి నాని(Nani )హోస్టుగా చేశారు. మూడవ సీజన్ నుంచి ఇప్పటివరకు నిర్విరామంగా హోస్ట్గా వ్యవహరిస్తూ.. ఆడియన్స్ ను అలరిస్తూ షోని సక్సెస్ దిశగా తీసుకెళ్తున్న నాగార్జున (Nagarjuna)కు ఈ షోకి ఏకంగా రూ.40 కోట్లు రెమ్యూనరేషన్ గా ఇస్తున్నట్లు సమాచారం. అంతేకాదు అన్నపూర్ణ స్టూడియోలో భారీ ఎత్తున దీనికి నిర్వాహకులు సెట్ వేసిన కారణంగా అటు నుంచి కూడా ఆదాయం వస్తున్న విషయం తెలిసిందే.

also read:Mohan Lal: నన్ను శత్రువులా చూస్తున్నారు.. ఆవేదన వ్యక్తం చేస్తున్న మోహన్ లాల్!

Related News

Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ సెలబ్రిటీల నుంచే.. వారిద్దరికే నెగిటివిటీ ఎక్కువ.. హౌజ్ వీడేది ఆమెనే!

Bigg Boss 9 Telugu: సంజనా మొండితనం.. దెబ్బకు లేడీ కంటెస్టెంట్స్ కి షాక్!

Bigg Boss 9 Telugu Day 2: బ్రేకింగ్.. హౌజ్ లో రితూ చౌదరికి తీవ్ర గాయాలు.. బయటకు రాక తప్పదా?

Bigg Boss 9 Promo : నామినేషన్స్ షురూ.. సెలబ్రెటీస్ మధ్య చిచ్చు పెట్టిన కామనర్స్

Bigg Boss Telugu 9 Day 1: ఈ పిల్ల ఇన్నోసెంట్ అని చెప్పింది, కానీ హౌస్ లో దొంగతనం..

×