‘పనిలేని మంగలి పిల్లితల గొరిగినట్లు’ అని చాలా మంది ఓ సామెతను వాడుతారు. ఏ పనీ లేని వాళ్లు ఏదో ఒక పనికి మాలిన పని చేయడాన్ని ఉద్దేశించి ఈ సామెతను సటైర్ గా వాడుతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువకుడు చేసే పని చూస్తే మీరూ ఇలాగే అనడం ఖాయం. ఎందుకంటే.. అతడు చేసే పని అచ్చం ఇలాగే ఉంటుంది..
సాధారణంగా యువకులు రకరకాల పనులు చేస్తుంటారు. ఖాళీ సమయంలో పెయింటింగ్స్ వేయడం, లేదంటే గార్డెన్ లో పని చేయడం అదీ కాదంటే తన ఫ్రెండ్స్ తో ఆడుకోవడం లాంటి పనులు చేస్తారు. కానీ, ఓ యువకుడు మాత్రం ప్రపంచంలో ఎవరూ చేయని పనిని చేస్తూ, అందరినీ హవ్వా అనిపిస్తున్నాడు. ఇంతకీ అతడు చేసే పని ఏంటంటే..
సాధారణంగా ఎవరైనా దోమలు కుడితే మళ్లీ కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ, ఓ యువకుడు తనను కుట్టిన దోమలను జాగ్రత్తగా పట్టుకుని ఓ డబ్బలో వేస్తున్నాడు. ఆ తర్వాత దోమ ఉన్న చిన్న డబ్బాకు రంధ్రం చేసి, దానిలోకి ప్రమాదకరమైన వాయువును పంపిస్తాడు. ఆ వాయువుకు దోమ తీవ్రంగా ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోతుంది. ఇక ఆ దోమను పట్టుకుని తన నోట్ బుక్ లో టేప్ ద్వారా దానిని అంటించి ఏ రోజు చంపాడు అనే డేట్ వేస్తున్నాడు. ఇలా అతడు చంపిన ఎన్నో దోమల్ని ఇలాగే తన నోట్ బుక్ లో అతికిస్తున్నాడు.
https://www.threads.com/@chan_.0730/post/DOSoXIik_kx
Read Also: పెళ్లి కూతురును ఎత్తుకొని బొక్కబోర్ల పడ్డ పెళ్లి కొడుకు, నెట్టింట వీడియో వైరల్!
ఇక అతడు వందలాది దోమలను చంపి తన నోట్ బుక్ లో స్టిక్ చేయడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. “ఎలాంటి పనీ పాట లేని వారికి ఇలాంటి ఆలోచనలే వస్తాయి. వెంటనే ఎవరైనా అతడికి ఓ పని చూపించండ్రా బాబూ” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “నువ్వు చేసే పని చూస్తుంటే, ఎంత ఖాళీగా ఉన్నావో అర్థం అవుతుంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఇలాంటి ఆలోచనలు సాధారణ వ్యక్తులకు రావు. నువ్వో టార్చ్ బేరర్ భయ్యా” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “బహుశ ఇలాంటి పనులు ఇతడు తప్ప, మరే వ్యక్తి చేసి ఉండడు, ఇకపై చేయడు కూడా. ఇది అతడికి మాత్రమే తెలిసి స్పెషల్ విద్య” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫుల్ గా హాస్యాన్ని పంచుతోంది.
Read Also: ఆ విమానంలోని సీట్ల నిండా బంగాళ దుంపల బస్తాలు వేశారు.. ఎందుకో తెలుసా?