Konda Susmitha Emotional:రేవంత్ రెడ్డి క్యాబినెట్ నుండి బర్తరఫ్ అవ్వడానికి కారణం కూతురు కొండా సుస్మిత అన్న సంగతి తెల్సిందే.ఇక తాజాగా తల్లి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం పై కొండా సుస్మిత కన్నీటి పర్యంతం అయ్యారు.
గత కొన్ని రోజులుగా తమ కుటుంబం ఎదుర్కొంటున్న పరిణామాలతో తాను తీవ్రంగా బాధపడుతున్నానని, సరిగ్గా తినలేక.. నిద్రపోలేక మానసికంగా కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు సుస్మిత.
రాజకీయంగా టార్గెట్ చేయడం బాధాకరం
తాను మాట్లాడిన మాటలని వక్రీకరించారని ,తాను రేవంత్ రెడ్డిపై మాట్లాడితే తన మాటలని పార్టీని లేదా ప్రభుత్వాన్ని ఆపాదించడం సరికాదని స్పష్టం చేశారు. తన మాటల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని .. తనను అడ్డుపెట్టుకుని కుటుంబాన్ని రాజకీయంగా టార్గెట్ చేయడం బాధాకరమని సుస్మిత అన్నారు.
అయితే ఈ వ్యవహారం ఇక్కడితో ఆగిపోలేదని, తన తల్లిపై తీసుకున్న చర్య తమ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసిందని ఆమె పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూసిన తమ కుటుంబం ఇలాంటి పరిస్థితిని కూడా ఎదుర్కొంటుందని ఊహించలేదని చెప్పారు. ఒకరి వ్యాఖ్యలకు మొత్తం కుటుంబాన్ని బాధ్యుల్ని చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తూ కన్నీరు పెట్టుకున్నారు.
మరోమారు తీవ్ర స్థాయిలో విమర్శలు
పనిలో పనిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా సుస్మిత మరోమారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తమ కుటుంబంపై వ్యక్తిగత కక్షతోనే చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు చేశారు. రాజకీయంగా తమ కుటుంబం ఎదగడం కొందరికి ఇష్టం లేదని, అందుకే అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. తన తల్లిని మంత్రివర్గం నుంచి తొలగించడం వెనుక రాజకీయ కక్ష ఉందని ఆమె ఆరోపించారు.
ఇక తన తల్లి మంత్రిగా ఉన్న సమయంలో శాఖలో ఎలాంటి అవకతవకలు జరగలేదని అవినీతికి సంబంధించి ఒక్క ఆరోపణ కూడా లేకపోయినా నా మాటలని సాకుగా చూపించి తన తల్లిని పదవి నుంచి తప్పించారని వాపోయారు .
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తన తల్లి రాజకీయాల్లో ఇంకా ఉన్నారని , పదవి కోల్పోవడం తమ కుటుంబానికి ఎంతో బాధ కలిగించిన విషయమని సుస్మిత కన్నీటి పర్యంతమైంది.
MLA పదవికే ఎసరు పెడతాయా ?
తాజాగా మరోమారు కొండా సుస్మిత రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడంతో అటువైపు నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి సురేఖ MLA గా అయినా కొనసాగుతుందా లేక మరోమారు కూతురు చేసిన ఈ కామెంట్స్ MLA పదవికే ఎసరు పెడతాయా అన్నది కాలమే నిర్ణయించాలి .
Also read :జూబ్లీహిల్స్ కారా కారా పబ్బులో యువకులు హల్చల్.. పబ్ గొడవలో ఓ కాంగ్రెస్ ఎంపీ కుమారుడు?