Hyderabad City: ఎల్‌నినో కారణంగా వర్షాలు లేక సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ కొందరు అవేమీ పట్టించుకోలేదు. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ సిటీ శివార్లలో ఓ కారు బీభత్సం సృష్టించింది. దీని కారణంగా తాగు నీటి పైపులైన్ పగిలిపోయింది. గాల్లోకి నీరు ఎగిసిపడింది. ఈ ఘటన దాదాపు కొన్ని నిమిషాలపాటు అలాగే జరిగింది.
ఎల్‌నినో కారణంగా రుతు పవనాలు ముఖం చాటేశాయి. ఈసారి వర్షాకాలం కనీసం కనిపించలేదు. ఈ సీజన్‌లో ఎండలు ఠారెత్తించాయి. ఫలితంగా సామాన్యుడు అల్లాడిపోయాడు. వారం కింద ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ఎంట్రీ ఇచ్చాయి. కాకపోతే సాయంత్రం అయ్యేసరికి వాతావరణ చల్లగా ఉంటుంది. కనీసం ఒక్క నీటి చుక్క కిందకు రాలని పరిస్థితి నెలకొంది. దీంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి.
తాజాగా హైదరాబాద్ సిటీలోని ఉప్పల్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం చేసింది. నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 813 వద్దనున్న కృష్ణా వాటర్ పైప్‌లైన్‌ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులోని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు హయత్ నగర్ కు చెందిన 24 ఏళ్ల వినీత్ చౌదరిగా గుర్తించారు. ఈ ఘటన తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటన తర్వాత క్షణాల్లో తాగునీటి వాటర్ గాల్లోకి ఎగిసిపడింది. వంద మీటర్ల ఎత్తున వాటర్ పైకి లేవడంతో ఆ సన్నివేశాన్ని చూసేందుకు ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఈలోగా పోలీసులు అలర్టయి జలమండలి అధికారులు కబురు పెట్టారు. వారు వచ్చేసరికి కాస్త సమయం పట్టింది. అప్పటి వరకు వాటర్ గాల్లోకి ఎగజిమ్ముతూ కనిపించింది. ఫలితంగా ప్రధాన రహదారి నీటితో జలమయం అయ్యింది. తాగునీరు భారీగా వృధా అయ్యింది.
ఈలోగా వచ్చిన జలమండలి అధికారులు తొలుత వాటర్ పైపులైన్ వాల్వ్‌ను బంద్ చేయడంతో చాలా సేపటి తర్వాత వాటర్ రావడం నిలిచిపోయింది. ప్రస్తుతం పైపులైనుకు అత్యవసర మరమ్మతులు చేపడుతున్నారు. ఫలితంగా అనేక ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేశారు. ముఖ్యంగా బీఎన్‌రెడ్డి నగర్, ఉప్పల్, వనస్థలిపురం, రామంతపూర్, బీరప్పగడ్డ, ఆటోనగర్, ప్రకాష్ నగర్, బేగంపేట, పద్మారావునగర్, సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలు ఉన్నాయి.
ALSO READ: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు!
దీనికితోడు కంటోన్మెంట్, లాలాగూడ, అడ్డగుట్ట, నల్లగుట్ట, మెట్టుగూడ, వైశాలినగర్, మీర్‌పేట్, బడంగ్‌పేట్, బాలాపూర్, మారేడ్‌పల్లి వంటి ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ చేశారు. నీటి సరఫరా లేని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు ఉన్నతాధికారులు.
Fatal Car Accident on #Uppal–#Nagole Road, Hyderabad!
A car rammed into HMWSSB’s main water pipeline near Nagole Metro Station around 3:30 AM on Tuesday. The driver died on the spot,& water flooded the main road. Repair work is underway.#Hyderabad #RoadAccident #BreakingNews pic.twitter.com/VuFIOeDdu6
— RSB NEWS 9 (@ShabazBaba) October 20, 2026